ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్ భారీ జంప్ కొట్టాడు. ఈ వారం ర్యాంకింగ్స్‌లో గిల్ ఏకంగా 36 స్థానాలు మెరుగుపర్చుకుని 37వ స్థానానికి ఎగబాకాడు. తాజా ర్యాంకింగ్స్‌లో గిల్‌తో పాటు మరో టీమిండియా బ్యాటర్ భారీ లబ్ది పొందాడు. ఇదివరకే టాప్-10లో ఉండిన యశస్వి జైస్వాల్.. నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకాడు.
గత నెలలో రెండో స్థానానికి పడిపోయిన సూర్యకుమార్.. ఇటీవల జింబాబ్వేతో సిరీస్ ఆడనప్పటికీ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు ఫిలిప్ సాల్ట్ ఓ స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరాడు. ట్రవిస్ హెడ్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. పాక్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ ఏడు, టీమిండియా ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ ఎనిమిది, విండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్, జాన్సన్ ఛార్లెస్ తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్-10లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. ఆదిల్ రషీద్, నోర్జే, హసరంగ, రషీద్ ఖాన్, హాజిల్‌వుడ్, అకీల్ హొస్సేన్, ఆడమ్ జంపా, ఫజల్ హక్ ఫారూఖీ, మహీశ్ తీక్షణ ఒకటి నుంచి తొమ్మిది స్థానాలను నిలుపుకున్నారు. అల్జరీ జోసఫ్, తబ్రేజ్ షంషి, గుడకేశ్ మోటీ తలో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 10, 11, 12 స్థానాలకు ఎగబాకారు.
భారత బౌలర్లలో టాప్-10లో ఎవరూ లేకపోగా.. అక్షర్ పటేల్ నాలుగు స్థానాలు దిగజారి 13కు.. రవి బిష్ణోయ్ నాలుగు స్థానాలు దిగజారి 19కి, జస్ప్రీత్ బుమ్రా ఏడు స్థానాలు దిగజారి 21వ స్థానానికి పడిపోయారు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా నాలుగు స్థానాలు దిగజారి ఆరో స్థానానికి పడిపోగా.. హసరంగ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment