
దుబాయ్: అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ముగిసిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 8 వికెట్లు పడగొట్టిన రషీద్.. మొత్తంగా 813 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్ తర్వాత 54 రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకున్న రషీద్ తన టాప్ ర్యాంకును పదిలం చేసుకున్నాడు.
ఇక్కడ పాకిస్థాన్‌కు చెందిన షాదబ్ ఖాన్ కంటే 80 పాయింట్లు ముందంజలో ఉన్న రషీద్ ఖాన్.. నంబర్‌వన్ ర్యాంకును కాపాడుకున్నాడు. ఇక అఫ్గానిస్తాన్‌కే చెందిన మహ్మద్ నబీ కెరీర్‌లోనే అత్యుత్తమంగా 8వ ర్యాంకులో నిలిచాడు.