బాబర్ అజమ్
దుబాయ్ : పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజమ్ స్టన్నింగ్ ప్రదర్శనతో టీ20 టాప్ ర్యాంక్ అందుకున్నాడు. ఇటీవల యూఏఈ వేదికగా జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో బాబర్ దెబ్బకు ఆస్ట్రేలియా వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో 68 నాటౌట్, 45, 50 పరుగులతో రాణించిన బాబర్ టీ20ల్లో టాప్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాదే బాబర్ మూడోసారి టాప్‌లో నిలవడం విశేషం. ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమైన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ సిరీస్‌తో పాటు టాప్ ర్యాంకును కోల్పోయాడు. మూడు ఇన్నింగ్స్‌లో కేవలం మూడు పరుగులే చేసిన ఫించ్ ఇందులో రెండు సార్లు డకౌట్ కావడం గమనార్హం. (చదవండి: రోహిత్ ధమాకా రాయుడు పటాకా)
844 రేటింగ్ పాయింట్లతో బాబర్ టాప్‌లో ఉండగా.. ఫించ్(839) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక భారత బ్యాట్స్‌మన్ లోకెశ్ రాహుల్ (812) మూడో స్థానంలో ఉండగా.. కొలిన్ మున్రో (801), ఫకార్ జమాన్ (793) తరువాతి స్థానంలో ఉన్నారు. హిట్‌మ్యాన్ రోహిత్ 10వ స్థానంలో, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి 13వ స్థానంలో కొనసాగుతున్నారు. బాబర్ తన ర్యాంకు నిలబెట్టుకోవాలంటే.. రేపటి(బుధవారం) నుంచి న్యూజిలాండ్ వేదికగా జరిగే మూడు టీ20ల సిరీస్‌లో ఇదే తరహా ఫామ్‌ను కొనసాగించాలి. లేకుంటే నాలుగో స్థానంలో ఉన్న కొలిన్ మున్రో చెలరేగితే బాబర్ టాప్ ర్యాంకు చేజారే అవకాశం ఉంది. బౌలింగ్‌లో రషీద్ ఖాన్ టాప్ ర్యాంకులోనే ఉండగా.. షాదాబ్ ఖాన్, ఇష్ సోదీ, చహల్‌లు తరువాతి స్థానాల్లో ఉన్నారు.( చదవండి: ఆసీస్‌ను వైట్‌వాష్ చేశారు.. )
Comments
Please login to add a commentAdd a comment