అగ్రస్థానం దిశగా దూసుకెళ్తున్న కేఎల్‌ రాహుల్‌ | KL Rahul Moves To Fourth In ICC T20 Rankings | Sakshi
Sakshi News home page

T20 Rankings: నాలుగో స్థానానికి ఎగ‌బాకిన‌ కేఎల్ రాహుల్‌

Published Wed, Feb 2 2022 8:33 PM | Last Updated on Wed, Feb 2 2022 8:33 PM

KL Rahul Moves To Fourth In ICC T20 Rankings - Sakshi

KL Rahul Moves To Fourth In T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అగ్రస్థానం దిశగా దూసుకెళ్తున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో ఓ స్థానానికి మెరుగుప‌ర్చుకుని నాలుగో ర్యాంకుకు ఎగబాకాడు. రాహుల్ ఖాతాలో ప్రస్తుతం 729 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. త్వరలో విండీస్‌తో జరగబోయే 3 మ్యాచ్‌ల టీ20లో రాణిస్తే.. టీ20 ర్యాంకింగ్స్‌ అగ్రపీఠం కేఎల్‌ రాహుల్‌ వశం కావడం ఖాయమని తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే, ఈ జాబితాలోని టీమిండియా ప్రస్తుత, మాజీ సారధులు రోహిత్‌ శర్మ(11), విరాట్ కోహి(10)లు.. తమతమ స్థానాలను నిలబెట్టుకోగా.. పాక్‌ కెప్టెన్ బాబ‌ర్ అజామ్ అగ్రస్థానంలో, అదే దేశానికి చెందిన మహ్మ‌ద్ రిజ్వాన్ రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నారు. బౌల‌ర్ల జాబితాలో టీమిండియా స్వింగ్‌ బౌలర్‌ భువ‌నేశ్వ‌ర్ కుమార్ 20వ ర్యాంకులో ఉండగా జ‌స్ప్రీత్ బుమ్రా 26వ స్థానానికి పడిపోయాడు. 


శ్రీ‌లంక స్పిన్నర్‌ హ‌స‌రంగ, సౌతాఫ్రికా బౌల‌ర్ షంసీ, ఇంగ్లండ్ బౌల‌ర్ ఆదిల్ ర‌షీద్ వరుసగా ఒకటి నుంచి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక ఆల్‌రౌండ‌ర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఈ జాబితాలో అఫ్ఘాన్‌ ఆటగాడు మహ్మద్‌ నబీ, బంగ్లా ఆల్‌రౌండర్‌ షకీబ్‌లు తొలి రెండు స్థానాలను నిలబెట్టుకున్నారు. టాప్ 10 ఆల్‌రౌండర్లలో టీమిండియా ఆట‌గాళ్లు ఒక్కరు కూడా లేరు.
చదవండి: చియాన్‌ విక్రమ్‌ను కలిసిన ధోని.. "మహాన్‌" కోసమే అంటున్న నెటిజన్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement