ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ సత్తా చాటారు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో సుడిగాలి శతకంతో ఇరగదీసిన అభిషేక్.. ఎంట్రీలోనే అదుర్స్ అనిపించుకోగా.. అదే మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో రాణించిన రుతు.. 13 స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి ఎగబాకాడు. అభిషేక్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో లిస్ట్ అయిన తొలిసారే 75వ స్థానాన్ని దక్కించుకున్నాడు.
భారత్ నుంచి టాప్-10 రుతురాజ్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. గత వారమే అగ్రపీఠాన్ని కోల్పోయిన స్కై.. రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టాప్ టీ20 బ్యాటర్‌గా ట్రవిస్ హెడ్ కొనసాగుతున్నాడు. ఫిల్ సాల్ట్, బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, జోస్ బట్లర్, రుతురాజ్, బ్రాండన్ కింగ్, జాన్సన్ ఛార్లెస్, మార్క్రమ్ వరుసగా మూడు నుంచి పది స్థానాల్లో ఉన్నారు.
బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ వారం ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులేమీ లేవు. ఆదిల్ రషీద్, అన్రిచ్ నోర్జే, హసరంగ టాప్-3 బౌలర్లుగా కొనసాగుతుండగా.. రషీద్ ఖాన్, హాజిల్‌వుడ్, అకీల్ హొసేన్, ఆడమ్ జంపా, ఫజల్‌హక్ ఫారూఖీ, అక్షర్ పటేల్, తీక్షణ నాలుగు నుంచి పది స్థానాల్లో నిలిచారు. భారత బౌలర్లలో అక్షర్ మినహా టాప్-10లో ఎవరూ లేరు. కుల్దీప్ 11, బుమ్రా 14, భిష్ణోయ్ 16, అర్ష్‌దీప్ 19 స్థానాల్లో ఉన్నారు.
ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. గత వారం ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండిన హార్దిక్ పాండ్యా రెండో స్థానానికి పడిపోయాడు. హసరంగ టాప్ ప్లేస్‌కు ఎగబాకాడు. భారత ఆటగాళ్లలో అక్షర్ పటేల్ 12వ స్థానంలో ఉన్నాడు.
టీమ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా ఎవరికీ అందనంత ఎత్తులో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా టాప్-5లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment