Women's T20 Rankings: తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీలంక, ఇంగ్లండ్, వెస్టిండీస్ ప్లేయర్స్ దుమ్మురేపారు. ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్‌కప్ సంచలన ప్రదర్శన నమోదు చేసిన శ్రీలంక యంగ్ గన్ విష్మి గుణరత్నే తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 95 స్థానాలు ఎగబాకి 169 ప్లేస్‌కు చేరుకుంది. 17 ఏళ్ల విష్మి.. టీ20 వరల్డ్‌కప్ రన్నరప్ సౌతాఫ్రికాపై 35 పరుగులు, సిక్స్ టైమ్ వరల్డ్ ఛాంపియన్, ప్రస్తుత జగజ్జేత ఆస్ట్రేలియాపై 24 పరుగులు సాధించడం ద్వారా తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగుపర్చుకుంది.
బ్యాటర్ల విభాగంలో విష్మితో పాటు ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్న ప్లేయర్స్‌లో విండీస్‌కు చెందిన రషదా విలియమ్స్ (50 స్థానాలు), పాకిస్తాన్‌కు చెందిన ఫాతిమా సనా (36 స్థానాలు), బంగ్లా బ్యాటర్ నహిదా అక్తర్ (33 స్థానాలు), విండీస్ ప్లేయర్ చిన్నెల్ హెన్రీ (30 స్థానాలు) ఉన్నారు. ఈ విభాగంలో ఆసీస్ తహీల మెక్‌గ్రాత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బెత్ మూనీ, స్మృతి మంధన, మెగ్ లాన్నింగ్, సోఫీ డివైన్, లారా వొల్వార్డ్ట్, ఆష్లే గార్డెనర్, సూజీ బేట్స్, అలైసా హీలీ, నతాలీ సీవర్ టాప్ 10లో ఉన్నారు.
బౌలర్ల విషయానికొస్తే.. సోఫీ ఎక్లెస్‌స్టోన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మ్లాబా, డార్సీ బ్రౌన్, సారా గ్లెన్, దీప్తి శర్మ, మెగాన్ షట్, షబ్మిమ్ ఇస్మాయిల్, లీ తహుహు, రేణుకా సింగ్, ఆష్లే గార్డెనర్ టాప్-10లో ఉన్నారు. ఈ విభాగంలో ఇంగ్లండ్ స్పిన్నర్ చార్లీ డీన్ రికార్డు స్థాయిలో 77 స్థానాలు ఎగబాకగా.. లారెన్ బెల్ (ఇంగ్లండ్) 60 స్థానాలు, కరిష్మా రామ్‌హరాక్ (విండీస్) 49 స్థానాలు, హన్నా రోవ్ (బంగ్లాదేశ్) 35 స్థానాలు, జార్జీనా డెంప్సీ (ఐర్లాండ్) 33 స్థానాలు మెరుగుపర్చుకుని, కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌లకు చేరుకున్నారు.
ఆల్‌రౌండర్ల్ విషయానికొస్తే.. ఇంగ్లండ్ చార్లీ డీన్ రికార్డు స్థాయిలో 103 స్థానాలు మెరుగుపర్చుకోగా.. తుబా హసన్ (పాక్) 47 స్థానాలు, కరిష్మా రమహరాక్ (విండీస్) 36 స్థానాలు, సాదియా ఇక్బాల్ (పాక్) 34 స్థానాలు, చిన్నెల్ హెన్రీ (విండీస్) 31 స్థానాలు మెరుగుపర్చుకుని కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్స్‌కు చేరుకున్నారు. ఈ విభాగంలో ఆష్లే గార్డెనర్ టాప్‌లో కొనసాగుతుండగా.. హేలీ మాథ్యూ, దీప్తి శర్మ, అమెలియా కెర్ర్, నతాలీ సీవర్, సోఫీ డివైన్, నిదా దార్, క్యాథరీన్ బ్రైస్, ఎల్లిస్ పెర్రీ, సల్మా ఖాతూన్ టాప్-10లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment