Ashleigh Gardner
-
WPL 2025: దంచికొట్టిన హర్మన్.. ధనాధన్ హాఫ్ సెంచరీ
మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో ఫైనల్ చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముంబై ఇండియన్స్.. గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మెరుగైన స్కోరు సాధించింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్.. హర్మన్‌ప్రీత్ కౌర్ బృందాన్ని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్ముంబై ఓపెనర్లలో అమెలియా కౌర్(5) విఫలం కాగా.. మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్(27) ఫర్వాలేదనిపించింది. వన్‌డౌన్ బ్యాటర్ నాట్ సీవర్-బ్రంట్ 38 పరుగులతో రాణించగా.. హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 33 బంతుల్లోనే 6 ఫోర్ల సాయంతో 54 పరుగులు రాబట్టింది.మిగతా వాళ్లలో అమన్‌జ్యోత్ కౌర్(15 బంతుల్లో 27) దంచికొట్టగా.. సజీవన్ సంజన మెరుపు(6 బంతుల్లో 11, నాటౌట్)లు మెరిపించింది. ఆఖర్లో వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా 4 బంతుల్లోనే 13 పరుగులతో దుమ్ములేపింది. ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు స్కోరు చేసింది.ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారుగుజరాత్ జెయింట్స్ బౌలర్లలో తనూజ కన్వార్, కశ్వీ గౌతం, ప్రియా మిశ్రా, కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. WPL-2025లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారైన విషయం తెలిసిందే. ఎనిమిదింట ఐదు విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ పది పాయింట్లతో టాప్‌లో కొనసాగుతుండగా.. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ చెరో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు సాధించి.. ఢిల్లీతో కలిసి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి.టాప్‌లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్కుఅయితే, పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. అయితే, లీగ్ దశలో గుజరాత్‌కు తాజా మ్యాచ్ రూపంలో ఒకే మ్యాచ్ మిగిలి ఉండగా.. ముంబైకి గుజరాత్‌తో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ కూడా మిగిలే ఉంది.ఈ నేపథ్యంలో సోమవారం నాటి మ్యాచ్‌లో గుజరాత్‌ను.. తదుపరి మంగళవారం బెంగళూరును ఓడిస్తే పన్నెండు పాయింట్లతో నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది. అందుకే గుజరాత్‌ను ఓడించి.. ఆ తర్వాత బెంగళూరు జట్టు పనిపట్టాలని హర్మన్‌సేన పట్టుదలగా ఉంది. ఇక ముంబై ఇండియన్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ఫలితాన్ని బట్టి గుజరాత్ భవితవ్యం తేలిపోనుంది.డబ్ల్యూపీఎల్-2025: ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్తుదిజట్లుముంబై ఇండియన్స్:హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ సీవర్- బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కర్, సజీవన సంజన, జి.కమలిని, అమన్‌జోత్ కౌర్, సంస్కృతి గుప్తా, షబ్నం ఇస్మాయిల్, పరుణిక సిసోడియాగుజరాత్ జెయింట్స్బెత్ మూనీ(వికెట్ కీపర్), హర్లిన్ డియోల్, ఆష్లే గార్డ్నర్(కెప్టెన్), డియాండ్రా డాటిన్, కశ్వీ గౌతం, సిమ్రన్ షేక్, ఫోబే లిచ్‌ఫీల్డ్, భార్తి ఫల్మాలి, తనుజ కన్వార్, మేఘనా సింగ్, ప్రియా మిశ్రా. View this post on Instagram A post shared by Women's Premier League (WPL) (@wplt20) -
RCB Vs GG: మళ్లీ ఓడిన బెంగళూరు
బెంగళూరు: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పరాజయాల పరంపర కొనసాగుతోంది. వడోదర వేదికగా తొలి రెండు మ్యాచ్‌లు ఆడి విజయాలు అందుకున్న ఆర్సీబీ... ఆపై సొంత మైదానానికి వచ్చిన తర్వాత ఒక్క గెలుపూ సాధించలేదు. తాజాగా గురువారం జట్టు ఖాతాలో వరుసగా మూడో పరాజయం చేరింది. మరోవైపు ఈ పోరుకు ముందు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకటే గెలిచి పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్ జెయింట్స్ ఖాతాలో రెండో విజయం చేరింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. కనిక అహుజా (28 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా...రాఘ్వీ బిస్త్ (19 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్), జార్జియా వేర్హామ్ (21 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్) ఫర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో తనూజ కన్వర్, డాటిన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం గుజరాత్ 16.3 ఓవర్లలో 4 వికెట్లకు 126 పరుగులు సాధించింది. కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్ (31 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో కదం తొక్కగా... ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (21 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఏ స్థాయిలోనూ ధాటి కనిపించలేదు. టాప్–3 బ్యాటర్లలో స్మృతి మంధాన (10), డానీ వ్యాట్ (4) విఫలం కాగా... ఎలైస్ పెరీ (4 బంతుల్లో 0) డబ్ల్యూపీఎల్‌లో తొలిసారి డకౌటైంది. నాలుగో వికెట్‌కు కనిక, రాఘ్వీ 37 బంతుల్లో 48 పరుగులు జోడించారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్ కూడా కాస్త తడబడింది. హేమలత (15 బంతుల్లో 11; 2 ఫోర్లు), బెత్ మూనీ (20 బంతుల్లో 17; 2 ఫోర్లు), హర్లీన్ డియోల్ (10 బంతుల్లో 5) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. అయితే ఆ్రస్టేలియా క్రికెటర్లయిన గార్డ్నర్, లిచ్‌ఫీల్డ్ భాగస్వామ్యంలో జట్టు గెలుపు దిశగా సాగింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 36 బంతుల్లో 51 పరుగులు జత చేశారు. ప్రేమ రావత్ ఓవర్లో గార్డ్నర్ వరుస బంతుల్లో 4, 4, 4, 6 బాదడం ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. స్కోరు వివరాలురాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) హర్లీన్ (బి) తనూజ 10; డానీ వ్యాట్ (ఎల్బీ) (బి) డాటిన్ 4; పెరీ (సి) తనూజ (బి) గార్డ్నర్ 0; రాఘ్వీ (రనౌట్) 22; కనిక (సి అండ్ బి) తనూజ 33; రిచా (బి) కాశ్వీ 9; వేర్హామ్ (నాటౌట్) 20; గార్త్ (సి) మూనీ (బి) డాటిన్ 14; స్నేహ్ రాణా (నాటౌట్) 1; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–6, 2–16, 3–25, 4–73, 5–78, 6–99, 7–122. బౌలింగ్: డాటిన్ 4–0–31–2, ఆష్లీ గార్డ్నర్ 4–0–22–1, కాశ్వీ గౌతమ్ 4–0–17–1, తనూజ 4–0–16–2, హేమలత 1–0–4–0, ప్రియా మిశ్రా 1–0–18–0, మేఘన 2–0–12–0. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) వేర్హామ్ (బి) రేణుక 17; హేమలత (స్టంప్డ్) రిచా (బి) రేణుక 11; హర్లీన్ (సి) పెరీ (బి) వేర్హామ్ 5; గార్డ్నర్ (సి అండ్ బి) వేర్హామ్ 58; లిచ్‌ఫీల్డ్ (నాటౌట్) 30; డాటిన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (16.3 ఓవర్లలో 4 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–25, 2–32, 3–66, 4–117. బౌలింగ్: రేణుకా సింగ్ 4–0–24–2, కిమ్ గార్త్ 2–3.–0–19–0, స్నేహ్ రాణా 4–0–23–0, ప్రేమ రావత్ 1–0–19–0, వేర్హామ్ 3–0–26–2, ఎలైస్ పెరీ 1–0–7–0, కనిక 1–0–7–0. డబ్ల్యూపీఎల్‌లో నేడుఢిల్లీ క్యాపిటల్స్ X ముంబై ఇండియన్స్రాత్రి గం. 7:30 స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
WPL 2025: ముంబై బౌలర్ల విజృంభణ.. గుజరాత్ నామమాత్రపు స్కోరు
ముంబై ఇండియన్స్ వుమెన్(Mumbai Indians Women)తో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ వుమెన్(Gujarat Giants Women) బ్యాటర్లు విఫలమయ్యారు. టాపార్డర్ కుప్పకూలడంతో గుజరాత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. మహిళల ప్రీమియర్ లీగ్-2025(WPL) ఎడిషన్‌లో భాగంగా ముంబై- గుజరాత్ మధ్య మ్యాచ్‌కు వడోదర ఆతిథ్యమిస్తోంది.కొటాంబి స్టేడియంలో మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన గుజరాత్ జెయింట్స్.. ముంబై జట్టు ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు బెత్ మూనీ(1), లారా వొల్వర్ట్(4) పూర్తిగా విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ దయాళన్ హేమలత(9), నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ ఆష్లీ గార్డనర్(10) కూడా నిరాశపరిచారు.ఆదుకున్న హర్లీన్ డియోల్ ఈ క్రమంలో హర్లీన్ డియోల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. 31 బంతుల్లో 32 పరుగులు చేసిన హర్లీన్ అమన్‌జోత్ కౌర్ బౌలింగ్‌లో హేలీ మాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. మిగతావాళ్లలో హార్డ్ హిట్టర్‌గా పేరొందిన డియాండ్రా డాటిన్ ఏడు పరుగులకే నిష్క్రమించగా.. కశ్వీ గౌతమ్ 20 పరుగులతో ఫర్వాలేదనిపించింది. హేలీ మాథ్యూస్‌కు మూడు వికెట్లుఇక లోయర్ ఆర్డర్లో సిమ్రన్ షేక్ 3, తనూజా కన్వర్ 13, సయాలీ సత్ఘరే 13(నాటౌట్), ప్రియా మిశ్రా(2) పరుగులు చేశారు. ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో 120 పరుగులు చేసిన గుజరాత్ ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో స్పిన్నర్ హేలీ మాథ్యూస్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. రైటార్మ్ మీడియం పేసర్ నట్ సీవర్- బ్రంట్, అమేలియా కెర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షబ్నం ఇస్మాయిల్, అమన్‌జోత్ కౌర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.తొలి గెలుపు కోసంకాగా ఫిబ్రవరి 14న డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ మొదలైన విషయం తెలిసిందే. తాజా ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వుమెన్ జట్టు ఎదుర్కొన్న గుజరాత్ జెయింట్స్ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడగా.. రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.అనంతరం యూపీ వారియర్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి గెలుపుబాట పట్టిన గుజరాత్ జెయింట్స్.. తాజా మ్యాచ్‌లో ముంబై బౌలర్ల ధాటికి నామమాత్రపు స్కోరు చేసింది. ఇక సీజన్లో తొలి గెలుపు కోసం ఎదురుచూస్తున్న ముంబై.. విజయమే లక్ష్యంగా మంగళవారం నాటి మ్యాచ్ బరిలో దిగింది. కాగా 2023లో డబ్ల్యూపీఎల్ మొదలుకాగా.. అరంగేట్ర చాంపియన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ సేన(ముంబై) నిలిచిన విషయం తెలిసిందే. ఇక గతేడాది స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ టైటిల్ గెలిచింది.డబ్ల్యూపీఎల్-2025: గుజరాత్ జెయింట్స్ వుమెన్ వర్సెస్ ముంబై వుమెన్ తుదిజట్లుగుజరాత్ జట్టులారా వోల్వార్ట్, బెత్ మూనీ(వికెట్ కీపర్), దయాళన్ హేమలత, ఆష్లీ గార్డనర్(కెప్టెన్), హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, సిమ్రాన్ షేక్, తనూజా కన్వర్, సయాలీ సత్ఘరే, కశ్వీ గౌతమ్, ప్రియా మిశ్రా.ముంబై జట్టుయాస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ సీవర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జి.కమలిని, అమేలియా కెర్, సజీవన్ సజన, అమన్‌జోత్ కౌర్, సంస్కృతి గుప్తా, షబ్నమ్ ఇస్మాయిల్, పరుణిక సిసోడియా. -
WPL 2025: గార్డ్నర్ ఆల్‌రౌండ్ ‘షో’
వడోదర: ఈ సీజన్ డబ్ల్యూపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో 200 పైచిలుకు స్కోరు చేసినా గెలువలేకపోయిన గుజరాత్ జెయింట్స్... కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్, డియాండ్ర డాటిన్ల ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రెండో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసింది. కెప్టెన్ దీప్తి శర్మ (27 బంతుల్లో 39; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. స్పిన్నర్ ప్రియా మిశ్రా 3 వికెట్లు తీయగా... ఆష్లీ గార్డ్నర్, పేసర్ డియాండ్ర 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. అనంతరం గుజరాత్ 18 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 144 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆష్లీ గార్డ్నర్ (32 బంతుల్లో 52; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డియాండ్ర డాటిన్ (18 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశారు. సోఫీ ఎకిల్‌స్టోన్ (4–0– 16–2) చక్కని స్పెల్ వృథా అయ్యింది. నేడు జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతుంది. దీప్తి ఒక్కరే మెరుగ్గా... టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూపీ ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే కష్టాల్లో కూరుకుపోయింది. జట్టు స్కోరు 22 వద్ద ఓపెనర్లు కిరణ్ నవ్‌గిరే (15), వృందా (6) పెవిలియన్ చేరారు. ఈ దశలో ఉమా ఛెత్రి (27 బంతుల్లో 24; 4 ఫోర్లు), దీప్తి శర్మ మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ కుదుట పడుతున్న సమయంలో 73 పరుగుల వద్ద ఉమా, పరుగు వ్యవధిలో ప్రియా స్పిన్ మ్యాజిక్కు తాలియా (0), గ్రేస్ (4) అవుటవ్వడంతో 78 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ధాటిగా ఆడిన దీప్తి జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. కానీ తర్వాత 16 పరుగుల వ్యవధిలో మళ్లీ 3 వికెట్లు కూలడంతో యూపీ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. దూకుడుగా ఆడి... కష్టమైన లక్ష్యం కాకపోయినా... ఓపెనర్ బెత్ మూనీ (0), వన్‌డౌన్ బ్యాటర్ హేమలత (0) డకౌట్లతో 2 పరుగులకే 2 వికెట్లను కోల్పోయిన గుజరాత్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. 4 ఓవర్లలో జట్టు స్కోరు 15/2. పవర్‌ప్లేలో మిగిలినవి రెండే ఓవర్లు. సైమా ఠాకూర్ వేసిన ఐదో ఓవర్లో ఆష్లీ గార్డ్నర్ 2 సిక్స్‌లు, వొల్వార్ట్ మరో సిక్స్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. ఇక్కడి నుంచి మ్యాచ్ స్వరూపం మారింది. వోల్వార్ట్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్) అవుటైనా... ధనాధన్ షోతో గార్డ్నర్ 28 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకుంది. జట్టు స్కోరు 86 వద్ద ఆమె నిష్క్రమించినా... హర్లీన్ డియోల్ (30 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు), డియాండ్ర జోడీ ఐదో వికెట్‌కు అజేయంగా 58 పరుగులు జోడించి మ్యాచ్‌ను 18 ఓవర్లలోనే ముగించింది. స్కోరు వివరాలు యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: నవ్‌గిరే (ఎల్బీడబ్ల్యూ) (బి) డాటిన్ 15; వృందా (బి) గార్డ్నర్ 6; ఉమా (సి) ప్రియా (బి) డాటిన్ 24; దీప్తి (సి) గార్డ్నర్ (బి) ప్రియా 39; తాలియా (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రియా 0; గ్రేస్ (బి) ప్రియా 4; శ్వేత (బి) గార్డ్నర్ 16; అలానా కింగ్ (నాటౌట్) 19; సోఫీ (బి) కశ్వీ 2; సైమా (రనౌట్) 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–22, 2–22, 3–73, 4–74, 5–78, 6–101, 7–111, 8–117, 9–143. బౌలింగ్: సయాలీ 2–0–20–0, డియాండ్రా 4–0– 34–2, ఆష్లీ గార్డ్నర్ 4–0–39–2, కశ్వీ 4–0– 15–1, తనూజ 2–0–10–0, ప్రియా 4–0– 25–3. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: వొల్వార్ట్ (బి) సోఫీ 22; బెత్ మూనీ (సి) తాలియా (బి) గ్రేస్ హారిస్ 0; హేమలత (బి) సోఫీ 0; ఆష్లీ గార్డ్నర్ (సి) నవ్‌గిరే (బి) తాలియా 52; హర్లీన్ (నాటౌట్) 34; డియాండ్ర (నాటౌట్) 33; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18 ఓవర్లలో 4 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–1, 2–2, 3–57, 4–86. బౌలింగ్: గ్రేస్ హారిస్ 1–0–1–1, సోఫీ 4–0– 16–2, క్రాంతి గౌడ్ 2–0– 15–0, సైమా 1–0– 20–0, దీప్తి శర్మ 4–0–32–0, అలానా కింగ్ 3–0–38–0, తాలియా 3–0–21–1. -
RCB సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి జట్టుగా అరుదైన ఘనత
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల(Royal Challengers Bengaluru Women) జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదనను పూర్తి చేసి.. అరుదైన ప్రపంచ రికార్డు సాధించింది. కాగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL)-2025 సీజన్ శుక్రవారం (ఫిబ్రవరి 14) మొదలైంది.డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ- గుజరాత్ జెయింట్స్ వుమెన్(Gujarat Giants Women) మధ్య మ్యాచ్‌తో వడోదర వేదికగా ఈ మెగా ఈవెంట్‌కు తెరలేచింది. కోటాంబి స్టేడియంలో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే నష్టపోయి 201 పరుగులు చేసింది.ఆష్లే గార్డ్నర్ సునామీ ఇన్నింగ్స్ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ బెత్ మూనీ(42 బంతుల్లో 56) అర్ధ శతకంతో రాణించగా.. కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగింది. కేవలం 37 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 79 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. మిగతా వాళ్లలో డియాండ్రా డాటిన్(13 బంతుల్లో 25), సిమ్రన్ షేక్(5 బంతుల్లో 11) ధనాధన్ దంచికొట్టారు. దీంతో గుజరాత్‌కు భారీ స్కోరు సాధ్యమైంది.అయితే, లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు కెప్టెన్ స్మృతి మంధాన(9), డానియెల్ వ్యాట్- హాడ్జ్(4)లను సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్‌కు చేర్చింది ఆష్లే గార్డ్నర్. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ(34 బంతుల్లో 57) అర్ధ శతకంతో ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. రాఘ్వి బిస్త్(25) ఆమెకు సహకారం అందించింది.రిచా విధ్వంసకర ఇన్నింగ్స్అయితే, వికెట్ కీపర్ రిచా ఘోష్ క్రీజులోకి రాగానే మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన రిచా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడింది. కేవలం 27 బంతుల్లోనే 64 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇక రిచాకు తోడుగా కనికా అహుజా(13 బంతుల్లో 30) బ్యాట్ ఝులిపించింది. ఇద్దరూ కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.ఈ క్రమంలో 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ వుమెన్ వరల్డ్ రికార్డు సాధించింది. మహిళల డొమెస్టిక్, ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసిన జట్టుగా నిలిచింది. ఇక అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన రిచా ఘోష్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.మహిళల డొమెస్టిక్ లేదంటే ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన1. ఆర్సీబీ వుమెన్- వడోదరలో 2025లో గుజరాత్ జెయింట్స్‌పై- 202/4(WPL)2. ముంబై ఇండియన్స్- ఢిల్లీలో 2024లో గుజరాత్ జెయింట్స్‌పై- 191/3(WPL)3. ఆర్సీబీ వుమెన్- ముంబైలో 2023లో గుజరాత్ జెయింట్స్- 189/2(WPL)4. మెల్బోర్న్ రెనెగేడ్స్- అడిలైడ్‌లో 2024లో అడిలైడ్ స్ట్రైకర్స్‌పై 186/1(WBBL)5. సదరన్ వైపర్స్- 2019లో యార్క్‌లో యార్క్‌షైర్ డైమండ్‌పై 185/4(WCSL).డబ్ల్యూపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ స్కోర్లు👉గుజరాత్ జెయింట్స్- 201/5 (20)👉ఆర్సీబీ వుమెన్- 202/4 (18.3)👉ఫలితం: గుజరాత్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన ఆర్సీబీ వుమెన్.చదవండి: అద్భుత ఫామ్.. అతడిని ఆపతరమా!.. ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలే! -
ఉమెన్ ప్రీమియర్ లీగ్ : గుజరాత్ జెయింట్స్ పై బెంగళూరు మెరుపు గెలుపు (ఫోటోలు)
-
RCB Vs GG: ‘రాయల్’ విజయంతో మొదలు
‘పరుగుల వరద ఖాయం’... టాస్ సమయంలో విశ్లేషకురాలు మిథాలీరాజ్ చేసిన వ్యాఖ్య ఇది. ఆమె చెప్పినట్లుగానే డబ్ల్యూపీఎల్ తొలి పోరులో 400కు పైగా పరుగులు నమోదయ్యాయి. ఇరు జట్లూ భారీ షాట్లతో విరుచుకుపడి పూర్తి వినోదాన్ని పంచాయి. ముందుగా ఆష్లీ గార్డ్నర్, బెత్ మూనీ మెరుపులు గుజరాత్‌కు భారీ స్కోరును అందిస్తే రిచా ఘోష్, ఎలైస్ పెరీ తమ ఆటతో అదరగొట్టారు. ఫలితంగా లీగ్‌లో అత్యధిక పరుగుల ఛేదనతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) శుభారంభం చేసింది.వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) సీజన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు రికార్డు లక్ష్య ఛేధనతో ఘనంగా ప్రారంభించింది. శుక్రవారం జరిగిన తొలి పోరులో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్ (37 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా, బెత్ మూనీ (42 బంతుల్లో 56; 8 ఫోర్లు) కూడా అర్ధసెంచరీ సాధించింది.అనంతరం బెంగళూరు 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిచా ఘోష్ (27 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఎలైస్ పెరీ (34 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు చేయగా, కనిక ఆహుజా (13 బంతుల్లో 30 నాటౌట్; 4 ఫోర్లు) రాణించింది. రిచా, కనిక ఐదో వికెట్‌కు 37 బంతుల్లోనే అభేద్యంగా 93 పరుగులు జత చేశారు. సిక్స్‌ల జోరు... ఓపెనర్ మూనీ ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించినా... మరో ఎండ్‌లో 6 పరుగుల వ్యవధిలో వోల్వార్ట్ (6), హేమలత (4) వెనుదిరిగారు. అయితే మూనీ దూకుడు కొనసాగించింది. వేర్హామ్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదిన ఆమె 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. మూనీ వెనుదిరిగిన తర్వాత గార్డ్నర్ విధ్వంసం మొదలైంది. ప్రేమ ఓవర్లో ఆమె వరుసగా మూడు సిక్స్‌లు బాదింది. డియాండ్రా డాటిన్ (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా జోరు ప్రదర్శించడంతో గుజరాత్ స్కోరు దూసుకుపోయింది. 25 బంతుల్లోనే గార్డ్నర్ హాఫ్ సెంచరీని అందుకుంది. జోషిత వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో కూడా గార్డ్నర్ 3 సిక్స్‌లతో చెలరేగింది. చివరి రెండు బంతుల్లో హర్లీన్ 2 ఫోర్లు బాది స్కోరును 200 దాటించింది. కీలక భాగస్వామ్యం... భారీ లక్ష్య ఛేదనలో 14 పరుగులకే తొలి 2 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ ఇబ్బందుల్లో పడింది. ఒకే ఓవర్లో కెప్టెన్ స్మృతి మంధాన (9), డానీ వ్యాట్ (4)లను గార్డ్నర్ వెనక్కి పంపించింది. ఈ దశలో పెరీ, రాఘ్వీ బిష్త్ (27 బంతుల్లో 25; 3 ఫోర్లు) భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది. ముఖ్యంగా పెరీ తన అనుభవంతో కొన్ని చక్కటి షాట్లు ఆడగా, తొలి డబ్ల్యూపీఎల్ మ్యాచ్ ఆడుతున్న రాఘ్వీ అండగా నిలిచింది. 19 పరుగుల వద్ద హర్లీన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పెరీ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. మూడో వికెట్‌కు 55 బంతుల్లో 86 పరుగులు జోడించిన పెరీ, రాఘ్వీ తక్కువ వ్యవధిలో అవుటయ్యారు. బెంగళూరు విజయం కోసం 46 బంతుల్లో 93 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో గుజరాత్‌దే పైచేయిగా కనిపించింది. కానీ రిచా, కనిక భాగస్వామ్యం అసాధారణ ఆటతో జట్టును గెలిపించింది. ‘0’ వద్ద రిచా ఇచ్చిన క్యాచ్‌ను సిమ్రన్ వదిలేయడం కూడా బెంగళూరు జట్టుకు కలిసొచ్చింది. ఒకే ఓవర్లో 23 పరుగులు... ఆర్సీబీ 30 బంతుల్లో 63 పరుగులు చేయాల్సి ఉండగా గార్డ్నర్ వేసిన 16వ ఓవర్ ఆటను పూర్తిగా మలుపు తిప్పింది. ఈ ఓవర్లో రిచా ఏకంగా 4 ఫోర్లు, 1 సిక్స్ బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ప్రియ ఓవర్లో కూడా 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన రిచా 23 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించింది. అనంతరం డాటిన్ బౌలింగ్‌లో మరో సిక్స్‌తో రిచా మ్యాచ్‌ను ముగించడం విశేషం. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) స్మృతి (బి) ప్రేమ 56; వోల్వార్ట్ (బి) రేణుక 6; హేమలత (సి) ప్రేమ (బి) కనిక 4; ఆష్లీ గార్డ్నర్ (నాటౌట్) 79; డాటిన్ (సి) వ్యాట్ (బి) రేణుక 25; సిమ్రన్ (బి) వేర్హమ్ 11; హర్లీన్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–35, 2–41, 3–85, 4–152, 5–182. బౌలింగ్: రేణుక 4–0–25–2, కిమ్ గార్త్ 4–0–34–0, జోషిత 4–0–43–0, కనిక 3–0–19–1, వేర్హామ్ 3–0–50–1, ప్రేమ 2–0–26–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (ఎల్బీ) (బి) గార్డ్నర్ 9; డానీ వ్యాట్ (బి) గార్డ్నర్ 4; పెరీ (సి) వోల్వార్ట్ (బి) సయాలీ 57; రాఘ్వీ (సి) సయాలీ (బి) డాటిన్ 25; రిచా ఘోష్ (నాటౌట్) 64; కనిక (నాటౌట్) 30; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 202.వికెట్ల పతనం: 1–13, 2–14, 3–100, 4–109. బౌలింగ్: కాశ్వీ 2–0–22–0, గార్డ్నర్ 3–0–33–2, డాటిన్ 3.3–0– 41–1, తనూజ 3–0–29–0, సయాలీ 4–0–44–1, ప్రియ 3–0–29–0. -
WPL 2025: గుజరాత్ బ్యాటర్ సిక్సర్ల సునామీ.. ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం
మహిళల ఐపీఎల్ (WPL) మూడో సీజన్ ఇవాళ (ఫిబ్రవరి 14) ఘనంగా ప్రారంభమైంది. లీగ్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గత రెండు సీజన్లుగా పేలవ ప్రదర్శన (టేబుల్ లాస్ట్) కనబర్చిన గుజరాజ్ జెయింట్స్ (GG) తలపడుతున్నాయి. వడోదరలోని కొటాంబి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోకపోవడం తప్పని ఆర్సీబీకి ఇన్నింగ్స్ మధ్యలో అర్థమైంది. మాజీ కెప్టెన్, ఓపెనర్ బెత్ మూనీ అర్ద సెంచరీతో రాణించి జెయింట్స్ ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేసింది. మూనీ 42 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేసి ఔటైంది. మరో ఓపెనర్ లారా వోల్వార్డ్ 10 బంతుల్లో బౌండరీ సాయంతో కేవలం 6 పరుగులకే నిష్క్రమించి నిరాశపర్చింది. వన్‌డౌన్‌లో వచ్చిన దయాలన్ హేమలత 9 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టింది. అనంతరం బరిలోకి దిగిన ఈ సీజన్ కొత్త కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగింది.గార్డ్నర్ 37 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఫలితంగా గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో డియాండ్ర డొట్టిన్ కూడా సుడిగాల ఇన్నింగ్స్ ఆడింది. డొట్టిన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 25 పరుగులు చేసింది. ఆఖర్లో సిమ్రన్ షేక్, హర్లీన్ డియోల్ కూడా బ్యాట్ ఝులిపించారు. సిమ్రన్ బంతుల్లో బౌండరీ, సిక్సర్ సాయంతో 11 పరుగులు.. హర్లీన్ 4 బంతుల్లో 2 బౌండరీల సాయంతో 9 పరుగులు (నాటౌట్) చేశారు. ఇన్నింగ్స్ 18, 19 ఓవర్లలో గార్డ్నర్, సిమ్రన్ చెలరేగి పోయారు. ఈ రెండు ఓవర్లలో గార్డ్నర్ ఏకంగా నాలుగు సిక్సర్లు బాదింది. సిమ్రన్ బౌండరీ, సిక్సర్‌తో చెలరేగింది. ఫలితంగా 40 పరుగులు వచ్చాయి.25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన గార్డ్నర్ఈ మ్యాచ్‌లో గార్డ్నర్ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. తద్వారా లీగ్ చరిత్రలో నాలుగో వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేసింది. డబ్ల్యూపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు గుజరాత్‌కే చెందిన సోఫీ డంక్లీ పేరిట ఉంది. డంక్లీ 2023 సీజన్లో ఆర్సీబీపై 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది. లీగ్‌లో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు ఢిల్లీకి చెందిన షఫాలీ వర్మ పేరిట ఉంది. షఫాలీ 2023 సీజన్లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది.ఆతర్వాత 2023 సీజన్లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 22 బంతుల్లో అర్ద సెంచరీ చేసింది. ఈమె తర్వాత గ్రేస్ హ్యారిస్ (యూపీ), కిరణ్ నవ్‌గిరే (యూపీ), ఇవాళ గార్డ్నర్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. సిక్సర్ల సునామీఈ మ్యాచ్‌లో గార్డ్నర్ సిక్సర్ల సునామీ సృష్టించింది. గార్డ్నర్ ఆ బౌలర్, ఈ బౌలర్ అన్న తేడా లేకుండా అందరిపై విరుచుకుపడింది. ఈ మ్యాచ్‌లో ఆమె ఏకంగా 8 సిక్సర్లు బాదింది. లీగ్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో ఓ బ్యాటర్ కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే. 2023 సీజన్లో సోఫీ డివైన్ కూడా గుజరాత్‌పై 8 సిక్సర్లు కొట్టింది. -
గుజరాత్ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్
మహిళల ఐపీఎల్ (WPL) 2025 సీజన్ ప్రారంభానికి ముందు గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) ఫ్రాంచైజీ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. పాత కెప్టెన్‌ను మార్చి కొత్త కెప్టెన్‌ను నియమించుకుంది. బెత్ మూనీ (Beth Mooney) (ఆస్ట్రేలియా) స్థానంలో ఆష్లే గార్డ్నర్ను (Ashleigh Gardner) (ఆస్ట్రేలియా) నూతన సారధిగా నియమిస్తున్నట్లు జెయింట్స్ యాజమాన్యం ఇవాళ (ఫిబ్రవరి 5) ప్రకటించింది. గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శనల నేపథ్యంలో కెప్టెన్‌ను మారుస్తున్నట్లు మేనేజ్మెంట్ పేర్కొంది. జెయింట్స్ గత రెండు సీజన్లలో (2023, 2024) చిట్ట చివరి స్థానంలో నిలిచింది. 2023 సీజన్లో 8 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌లు గెలిచిన జెయింట్స్.. 2024 సీజన్లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేసింది.గత రెండు సీజన్లలో జెయింట్స్ ప్రదర్శన బాగా లేనప్పటికీ.. గార్డ్నర్ మాత్రం వ్యక్తిగతంగా రాణించింది. గార్డ్నర్ డబ్ల్యూపీఎల్ మొత్తంలో 324 పరుగులు చేసి 17 వికెట్లు పడగొట్టింది. కెప్టెన్‌గా నియమించడం పట్ల గార్డ్నర్ సంతోషం వ్యక్తం చేసింది. జట్టును ముందుండి నడిపించడానికి ఉత్సాహంగా ఉన్నానని ప్రకటించింది. తమ జట్టులో భారతీయ ప్రతిభ పుష్కలంగా ఉందని పేర్కొంది. జెయింట్స్ కెప్టెన్‌గా ఎంపిక కావడం తనకు దక్కిన గౌరవమని తెలిపింది. తదుపరి సీజన్లో జెయింట్స్‌కు నాయకత్వం వహించడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించింది. జట్టులో యువ మరియు అనుభవజ్ఞులైన క్రికెటర్లతో పాటు భారతీయ ప్రతిభ పుష్కలంగా ఉందని పేర్కొంది. ఈసారి తమ అభిమానులను గర్వపడేలా చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని తెలిపింది.జెయింట్స్ కెప్టెన్‌గా గార్డ్నర్ నియామకంపై ఆ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ మైఖేల్ క్లింగర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. గార్డ్నర్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నాడు. గార్డ్నర్ను టఫ్ కాంపిటీటర్తో పోల్చాడు. గార్డ్నర్కు ఆటపై అవగాహన, వ్యూహాత్మక చతురత మరియు ప్లేయర్లను ప్రేరేపించే సామర్థ్యం ఉందని కొనియాడాడు. తదుపరి సీజన్లో గార్డ్నర్ జెయింట్స్‌ను విజయవంతంగా ముందుండి నడుపుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.తాజా మాజీ కెప్టెన్ మూనీ గురించి మాట్లాడుతూ.. ఆమె జట్టులో అంతర్గత నాయకురాలిగా కొనసాగుతుందని అన్నాడు. బ్యాటింగ్ విభాగంలో మూనీ ప్రధాన పాత్ర పోషించనుందని తెలిపాడు. కెప్టెన్‌గా మూనీ సేవలను కొనియాడాడు. ఇకపై మూనీ బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌పై పూర్తిగా దృష్టి సారిస్తుందని పేర్కొన్నాడు.కాగా, డిసెంబర్లో జరిగిన వేలంలో జెయింట్స్ భారత ఆల్ రౌండర్ సిమ్రాన్ షేక్‌తో సహా నలుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. విండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ సేవలను నిలుపుకుంది. -
ప్రేయసిని నిశ్చితార్థం చేసుకున్న ఆసీస్ మహిళా స్టార్ క్రికెటర్..
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్లీ గార్డనర్ తన చిరకాల స్నేహితురాలు మోనికా రైట్ను నిశ్చితార్థం చేసుకుంది. గత మూడేళ్లగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట.. తమ బంధంలో మరో అడుగు ముందుకు వేసింది. శుక్రవారం కొంతమంది సన్నిహితుల మధ్య వీరిద్దరూ ఉంగరాలు మార్చకున్నారు. తమ నిశ్చితార్థ ఫొటోలను గార్డ్నర్ సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు కాబోయే కొత్త జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా గార్డ్నర్, మోనికాలు 2021 నుంచి ప్రేమలో ఉన్నారు. గార్డ్నర్ను సపోర్ట్ చేసేందుకు మోనికా చాలా సందర్బాల్లో స్టేడియం వచ్చేది. 2017లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గార్డనర్ .. ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలుగా కొనసాగుతోంది. గార్డనర్ తన కెరీర్లో ఇప్పటివరకు ఆరు టెస్టులు, 69 వన్డేలు, 88 టీ20 మ్యాచ్‌ల్లో ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహించింది. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో 2583 పరుగులతో పాటు 180 వికెట్లు పడగొట్టింది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు గార్డనర్ ప్రాతినిథ్యం వహిస్తోంది. View this post on Instagram A post shared by Ashleigh Gardner (@ashleigh_gardner97) -
చరిత్ర సృష్టించిన ఆసీస్ ఆల్‌రౌండర్.. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్‌కు ఐసీసీ అవార్డు
చరిత్ర సృష్టించిన ఆసీస్ ఆల్‌రౌండర్.. 2023 జులై నెల మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్నర్ గెలుచుకుంది. ఆష్లే ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును వరుసగా రెండు నెలలు (జూన్, జులై) గెలుచుకుని, ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా ఆష్లేకు ఇది నాలుగో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కావడం విశేషం. జులై నెలలో ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ల్లో 232 పరుగులతో పాటు 15 వికెట్లు తీసిన ఆష్లే వరుసగా రెండో నెల కూడా ఐసీసీ అవార్డును గెలుచుకుంది. జులై నెలకు గాను పురుషుల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ గెలుచుకున్నాడు. జులై నెలలో కనబర్చిన అత్యుత్తమ ప్రదర్శనకు గాను వోక్స్‌కు ఈ అవార్డు దక్కింది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు కోసం నెదర్లాండ్స్ స్టార్ ఆల్‌రౌండర్ బాస్ డి లీడ్, ఇంగ్లండ్‌కే చెందిన జాక్ క్రాలే పోటీపడినప్పటికీ వోక్స్నే ఈ అవార్డు వరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్స్, మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు మరియు మీడియా ప్రతినిధులతో కూడిన ప్రత్యేక ప్యానెల్ నుండి సేకరించిన ఓట్ల ఆధారంగా వోక్స్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. జులై నెలలో జరిగిన 3,4,5 యాషెస్ టెస్ట్‌ల్లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సైతం దక్కించుకున్న వోక్స్.. ఈ నెలలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 18.15 సగటున 19 వికెట్లు పడగొట్టాడు. వోక్స్‌కు పోటీదారులైన జాక్ క్రాలే, బాస్ డి లీడ్ కూడా జులై నెలలో అద్భుత ప్రదర్శనలు చేసినప్పటికీ వారికి నిరశే ఎదురైంది. క్రాలే జులైలో జరిగిన 2, 3, 4, 5 యాషెస్ టెస్ట్‌ల్లో 58.85 సగటున 412 పరుగులు చేశాడు. ఇందులో మాంచెస్టర్ టెస్ట్‌లో అతను చేసిన 189 పరుగుల ఇన్నింగ్స్, నిర్ణయాత్మక ఐదో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో చేసిన 73 పరుగుల ఇన్నింగ్స్‌లు హైలైట్‌గా నిలిచాయి. బాస్ డి లీడ్ విషయానికొస్తే.. ఈ నెదర్లాండ్స్ యువ ఆల్‌రౌండర్ జులైలో జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో అద్భుతంగా రాణించాడు. టోర్నీలో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో అతను అత్యుత్తమ ఆల్‌రౌండ్ ప్రదర్శనను (5/52, 123 (92 బంతుల్లో)) కనబర్చి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. -
క్వాలిఫయర్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన.. ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న లంక స్పిన్నర్
ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన లంక స్పిన్నర్ వనిందు హసరంగ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును సొంతం చేసుకున్నాడు. 2023 జూన్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును సొంతం చేసుకున్నాడు. మహిళల విభాగంలో ఆసీస్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్నర్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (జూన్) అవార్డు దక్కించుకుంది. మహిళల యాషెస్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకు గానూ గార్డ్నర్ను ఈ అవార్డు వరించింది. పురుషుల విభాగంలో జింబాబ్వే సీన్ విలియమ్స్, ఆస్ట్రేలియా ట్రవిస్ హెడ్ నుంచి హసరంగకు పోటీ ఎదురైనప్పటికీ అంతిమంగా అతన్నే ఈ అవార్డు వరించింది. మహిళల విభాగంలో ఇంగ్లండ్ ట్యామీ బేమౌంట్, వెస్టిండీస్ హేలీ మాథ్యూస్ ఐసీసీ అవార్డు కోసం పోటీపడగా జ్యూరీ గార్డ్నర్వైపు మొగ్గు చూపింది. జూన్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కారణంగా వీరిద్దరు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. కాగా, ప్రతి నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్స్, మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు, మీడియా ప్రతినిధులు, ఐసీసీ-క్రికెట్.కామ్‌లో నమోదు చేసుకున్న గ్లోబల్ క్రికెట్ అభిమానులతో కూడిన ప్రత్యేక ప్యానెల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపిక చేస్తారన్న విషయం తెలిసిందే. -
ఇంగ్లండ్‌కు పరాభవం.. యాషెస్ టెస్ట్ సిరీస్ ఓటమి
నాటింగ్హమ్: ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న మల్టీ ఫార్మాట్ యాషెస్ సిరీస్‌లో ఆ్రస్టేలియా శుభారంభం చేసింది. మూడు ఫార్మాట్ల ఫలితాలతో విజేత ఖరారయ్యే ఈ సిరీస్‌లో ఆసీస్ అమ్మాయిలు ఏకైక టెస్టులో గెలిచి ఆధిక్యంలోకి వచ్చారు. ఇక ఈ యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే తదుపరి జరిగే ఆరు మ్యాచ్‌ల్లో (మూడు టి20లు, మూడు వన్డేలు) ఐదింట గెలవాలి. సోమవారం ముగిసిన టెస్టులో ఆస్ట్రేలియా 89 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ ఆష్లే గార్డ్నర్ (8/66) ఇంగ్లండ్‌ను దెబ్బ తీసింది. భారత స్పిన్నర్ నీతూ డేవిడ్ (8/53; 1995లో ఇంగ్లండ్‌పై) తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఆష్లే నిలిచింది. 268 పరుగుల లక్ష్యంతో ఆఖరి రోజు 116/5తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి సెషన్లోనే ఆలౌటైంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 49 ఓవర్లలో 178 పరుగుల వద్ద ముగిసింది. నాలుగో రోజు ఆటలోనే 3 కీలక వికెట్లు తీసిన ఆష్లే చివరి రోజు ఉదయం మరో ఐదు వికెట్లను పడగొట్టింది. ఈ టెస్టులో ఆమె మొత్తం 12 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 4) పడగొట్టింది. తద్వారా మహిళల టెస్టు చరిత్రలో రెండో ఉత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసింది. ఈ జాబితాలో పాక్ బౌలర్ షాయిజా ఖాన్ (2004లో విండీస్‌పై 13 వికెట్లు) అగ్రస్థానంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఆసీస్ 473, ఇంగ్లండ్ 463 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్ లో ఆ్రస్టేలియా 257 పరుగులు చేసింది. -
రసవత్తరంగా యాషెస్ టెస్ట్.. ఇంగ్లండ్‌కు పరాభవం తప్పదా..?
మహిళల యాషెస్ ఏకైక టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. నాలుగో రోజు రెండు సెషన్లు పూర్తియ్యాక కూడా డ్రా అయ్యేలా కనిపించిన ఈ మ్యాచ్.. ఒక్కసారిగా మలుపు తిరిగి ఆసీస్‌వైపు మళ్లింది. ఆష్లే గార్డ్నర్ (3/33) తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్‌ను ఇరుకునపడేసి, ఆసీస్‌వైపు మ్యాచ్‌ను మలుపు తిప్పింది. పురుషుల యాషెస్ తొలి టెస్ట్ తరహాలోని ఈ మ్యాచ్ కూడా సాగుతుండటంతో ఇంగ్లండ్‌కు పరాభవం తప్పదని నెటిజన్లు అనుకుంటున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగో రోజు సెకెండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్.. సోఫీ ఎక్లెస్టోన్ (5/63) మరోసారి విజృంభించడంతో 257 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో బెత్ మూనీ 85 పరుగులు సాధించగా.. కెప్టెన్ హీలీ సరిగ్గా 50 పరుగులు చేసి ఔటైంది. తొలి ఇన్నింగ్స్ స్వల్ప ఆధిక్యం (10) కలుపుకుని ఆసీస్.. ఇంగ్లండ్‌కు 268 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించింది. అనంతరం నాలుగో రోజు మూడో సెషన్లో లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆరంభంలో ఆచితూచి ఆడింది. అయితే తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ స్టార్ ట్యామీ బీమౌంట్‌ను (22) ఆష్లే గార్డ్నర్ పెవిలియన్‌కు పంపడంతో ఇంగ్లండ్ ఒక్కసారిగా లయ తప్పి వరుసగా వికెట్లు కోల్పోయింది. గార్డ్నర్ 3, కిమ్ గార్త్, తహిళ మెక్‌గ్రాత్ తలో వికెట్ పడగొట్టారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 152 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆసీస్ గెలుపుకు కేవలం ఐదు వికెట్లు మాత్రమే అవసరంగా ఉన్నాయి. క్రీజ్‌లో డేనియల్ వ్యాట్ (20), కేట్ క్రాస్ (5) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 473 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 463 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఎల్లైస్ పెర్రీ (99) పరుగు తేడాతో శతకం మిస్ చేసుకోగా.. సదర్లాండ్ (137) అజేయమైన సెంచరీతో సత్తా చాటింది. ఇంగ్లండ్ బౌలర్ ఎక్లెస్టోన్ 5 వికెట్లతో విజృంభించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ట్యామీ బీమౌంట్ (208) డబుల్ సెంచరీతో చెలరేగగా.. హీథర్ నైట్ (57), నాట్ సీవర్ బ్రంట్ (78) అర్ధసెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్ గార్డ్నర్ 4, తహిళ మెక్‌గ్రాత్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్ 10 వికెట్లు పడగొట్టగా, బీమౌంట్ డబుల్ సెంచరీతో మెరిసింది. -
హేమలత, గార్డ్నర్ మెరుపు అర్ధశతకాలు.. గుజరాత్ జెయింట్స్ భారీ స్కోర్
డబ్ల్యూపీఎల్-2023లో భాగంగా యూపీ వారియర్జ్‌తో ఇవాళ (మార్చి 20) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జెయింట్స్.. దయాలన్ హేమలత (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆష్లే గార్డ్నర్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోర్ చేసింది. గార్డ్నర్, హేమలత జోరు చూసి ఓ దశలో జెయింట్స్ స్కోర్ సునాయాసంగా 200 పరుగులు దాటుతుందని భావించినప్పటికీ.. రెండు ఓవర్ల వ్యవధిలో ఇద్దరు ఔట్ కావడంతో ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ నమోదైంది. సూపర్ ఫామ్‌లో ఉన్న గార్డ్నర్ ఎడాపెడా షాట్లు బాది భారీ స్కోర్‌కు దోహదపడింది. సోఫీ డంక్లే (23), లారా వోల్వార్డ్ (17) తొలి వికెట్‌కు 41 పరుగులు (4.1 ఓవరల్లో) జోడించి శుభారంభాన్ని అందించగా.. హర్లీన్ డియోల్ (4), అశ్వనీ కుమారి (5) విఫలమయ్యారు. వారియర్జ్ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, పర్షవి చోప్రా తలో 2 వికెట్లు పడగొట్టగా.. అంజలీ సర్వాని, సోఫీ ఎక్లెస్టోన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 4 ఓవర్లు బౌల్ చేసిన దీప్తి శర్మ భారీగా పరుగులు (49) సమర్పించుకుంది. కాగా, ప్రస్తుత లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. వారియర్జ్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో మూడో ప్లేస్‌లో ఉంది. తొలి రెండు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇదివరకే క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించాయి. -
ఫిబ్రవరి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరంటే..?
ICC Player Of The Month: 2023, ఫిబ్రవరి నెల పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఐసీసీ ఇవాళ (మార్చి 13) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఇంగ్లండ్ అప్‌కమింగ్ స్టార్ హ్యారీ బ్రూక్ గెలుచుకున్నాడు. 3 నెలల వ్యవధిలో బ్రూక్ ఈ అవార్డును సొంతం చేసుకోవడం ఇది రెండోసారి. 2022 డిసెంబర్‌లోనూ బ్రూక్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును రెండుసార్లు గెలుచుకున్న ఏకైక ఆటగాడు బ్రూక్ మాత్రమే కావడం విశేషం. బాబర్ 2021 ఏప్రిల్‌లో, 2022 మార్చిలో ఈ అవార్డును దక్కించుకున్నాడు. 2023, ఫిబ్రవరిలో బ్రూక్‌కు పోటీగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, విండీస్ యువ స్పిన్నర్ గుడకేశ్ మోటీ పోటీపడినప్పటికీ, అంతిమంగా అవార్డు బ్రూక్‌నే వరించింది. బ్రూక్.. ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల్లో 2 హాఫ్ సెంచరీలు, ఓ భారీ సెంచరీ బాదగా.. జడేజా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్ట్‌ల్లో రెండు ఫైఫర్లతో పాటు అతి విలువైన ఓ హాఫ్ సెంచరీ చేశాడు. విండీస్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ విషయానికొస్తే.. ఇండియన్ ఆరిజిన్ కలిగిన ఈ స్పిన్ బౌలర్ ఫిబ్రవరిలో జింబాబ్వేతో జరిగిన రెండు టెస్ట్‌ల్లో ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు. జడ్డూ, మోటీలతో పోలిస్తే, బ్రూక్‌కు ఓటింగ్ శాతం అధికంగా రావడంతో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ఫిబ్రవరి మంత్ అవార్డుకు అతన్నే ఎంపిక చేసింది. ఇక మహిళల ప్లేయర్ ఆఫ్ ఫిబ్రవరి మంత్ అవార్డు విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే గార్డ్నర్ ఈ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డు కోసం దక్షిణాఫ్రికాకు చెందిన లారా వోల్వార్ట్, ఇంగ్లండ్ నాట్ సీవర్ బ్రంట్ పోటీపడినప్పటికీ, గార్డ్నర్నే అవార్డు వరించింది. బ్రూక్, బాబర్ తరహాలోనే గార్డ్నర్ కూడా ప్లేయర్ అఫ్ ద మంత్ అవార్డును రెండుసార్లు గెలుచుకుంది. 2022 డిసెంబర్లో తొలిసారి ఈ అవార్డుకు ఎంపికైన గార్డ్నర్, 2023 ఫిబ్రవరిలో రెండో సారి ఐసీసీ అవార్డను గెలుచుకుంది. -
టీ20 ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన శ్రీలంక బ్యాటర్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్
Women's T20 Rankings: తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీలంక, ఇంగ్లండ్, వెస్టిండీస్ ప్లేయర్స్ దుమ్మురేపారు. ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్‌కప్ సంచలన ప్రదర్శన నమోదు చేసిన శ్రీలంక యంగ్ గన్ విష్మి గుణరత్నే తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 95 స్థానాలు ఎగబాకి 169 ప్లేస్‌కు చేరుకుంది. 17 ఏళ్ల విష్మి.. టీ20 వరల్డ్‌కప్ రన్నరప్ సౌతాఫ్రికాపై 35 పరుగులు, సిక్స్ టైమ్ వరల్డ్ ఛాంపియన్, ప్రస్తుత జగజ్జేత ఆస్ట్రేలియాపై 24 పరుగులు సాధించడం ద్వారా తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగుపర్చుకుంది. బ్యాటర్ల విభాగంలో విష్మితో పాటు ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్న ప్లేయర్స్‌లో విండీస్‌కు చెందిన రషదా విలియమ్స్ (50 స్థానాలు), పాకిస్తాన్‌కు చెందిన ఫాతిమా సనా (36 స్థానాలు), బంగ్లా బ్యాటర్ నహిదా అక్తర్ (33 స్థానాలు), విండీస్ ప్లేయర్ చిన్నెల్ హెన్రీ (30 స్థానాలు) ఉన్నారు. ఈ విభాగంలో ఆసీస్ తహీల మెక్‌గ్రాత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బెత్ మూనీ, స్మృతి మంధన, మెగ్ లాన్నింగ్, సోఫీ డివైన్, లారా వొల్వార్డ్ట్, ఆష్లే గార్డెనర్, సూజీ బేట్స్, అలైసా హీలీ, నతాలీ సీవర్ టాప్ 10లో ఉన్నారు. బౌలర్ల విషయానికొస్తే.. సోఫీ ఎక్లెస్‌స్టోన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మ్లాబా, డార్సీ బ్రౌన్, సారా గ్లెన్, దీప్తి శర్మ, మెగాన్ షట్, షబ్మిమ్ ఇస్మాయిల్, లీ తహుహు, రేణుకా సింగ్, ఆష్లే గార్డెనర్ టాప్-10లో ఉన్నారు. ఈ విభాగంలో ఇంగ్లండ్ స్పిన్నర్ చార్లీ డీన్ రికార్డు స్థాయిలో 77 స్థానాలు ఎగబాకగా.. లారెన్ బెల్ (ఇంగ్లండ్) 60 స్థానాలు, కరిష్మా రామ్హరాక్ (విండీస్) 49 స్థానాలు, హన్నా రోవ్ (బంగ్లాదేశ్) 35 స్థానాలు, జార్జీనా డెంప్సీ (ఐర్లాండ్) 33 స్థానాలు మెరుగుపర్చుకుని, కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌లకు చేరుకున్నారు. ఆల్రౌండర్ల్ విషయానికొస్తే.. ఇంగ్లండ్ చార్లీ డీన్ రికార్డు స్థాయిలో 103 స్థానాలు మెరుగుపర్చుకోగా.. తుబా హసన్ (పాక్) 47 స్థానాలు, కరిష్మా రమహరాక్ (విండీస్) 36 స్థానాలు, సాదియా ఇక్బాల్ (పాక్) 34 స్థానాలు, చిన్నెల్ హెన్రీ (విండీస్) 31 స్థానాలు మెరుగుపర్చుకుని కెరీర్లో అత్యుత్తమ ర్యాంకింగ్స్‌కు చేరుకున్నారు. ఈ విభాగంలో ఆష్లే గార్డెనర్ టాప్‌లో కొనసాగుతుండగా.. హేలీ మాథ్యూ, దీప్తి శర్మ, అమెలియా కెర్ర్, నతాలీ సీవర్, సోఫీ డివైన్, నిదా దార్, క్యాథరీన్ బ్రైస్, ఎల్లిస్ పెర్రీ, సల్మా ఖాతూన్ టాప్-10లో ఉన్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });