ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన లంక స్పిన్నర్ వనిందు హసరంగ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును సొంతం చేసుకున్నాడు. 2023 జూన్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును సొంతం చేసుకున్నాడు. మహిళల విభాగంలో ఆసీస్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్‌నర్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (జూన్) అవార్డు దక్కించుకుంది. మహిళల యాషెస్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకు గానూ గార్డ్‌నర్‌ను ఈ అవార్డు వరించింది.
పురుషుల విభాగంలో జింబాబ్వే సీన్ విలియమ్స్, ఆస్ట్రేలియా ట్రవిస్ హెడ్ నుంచి హసరంగకు పోటీ ఎదురైనప్పటికీ అంతిమంగా అతన్నే ఈ అవార్డు వరించింది. మహిళల విభాగంలో ఇంగ్లండ్ ట్యామీ బేమౌంట్, వెస్టిండీస్ హేలీ మాథ్యూస్ ఐసీసీ అవార్డు కోసం పోటీపడగా జ్యూరీ గార్డ్‌నర్‌వైపు మొగ్గు చూపింది. జూన్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కారణంగా వీరిద్దరు ఈ అవార్డులకు ఎంపికయ్యారు.
కాగా, ప్రతి నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్స్, మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు, మీడియా ప్రతినిధులు, ఐసీసీ-క్రికెట్.కామ్‌లో నమోదు చేసుకున్న గ్లోబల్ క్రికెట్ అభిమానులతో కూడిన ప్రత్యేక ప్యానెల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపిక చేస్తారన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment