దుబాయ్: భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టి20 ఫార్మాట్‌లో కెరీర్ అత్యుత్తమ ర్యాంకులో నిలిచింది. ఐసీసీ విడుదల చేసిన తాజా జాబితాలో ఆమె (633 పాయింట్లు) మూడో స్థానం దక్కించుకుంది. యువ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (607 పాయింట్లు) ఏకంగా 9 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ ఆరో ర్యాంకు అందుకోగా, ఓపెనర్ స్మృతి మంధాన (567 పాయింట్లు) ఏడు స్థానాలు అధిగమించి 10వ స్థానానికి చేరుకుంది. వెటరన్ మిథాలీరాజ్ 9వ ర్యాంకులో ఉంది. జట్ల విభాగంలో ఆస్ట్రేలియా (283 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతోంది.
సిడ్నీ థండర్స్‌తోనే హర్మన్‌ప్రీత్
మహిళల బిగ్‌బాష్ టీ20 లీగ్ (బీబీఎల్)లో హర్మన్‌ప్రీత్ కౌర్ సిడ్నీ థండర్స్ జట్టుతోనే కొనసాగాలని నిర్ణయించుకుంది. ఈ లీగ్ రెండో సీజన్‌లో హర్మన్ 12 ఇన్నింగ్స్‌లాడి 59.20 సగటుతో 296 పరుగులు చేసింది. 117 స్ట్రయిక్ రేట్ నమోదు చేసింది. భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన హోబర్ట్ హరికేన్స్‌తో జతకట్టింది. గతంలో ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ బ్రిస్బేన్ హీట్ తరఫున ఆడింది. ఎనిమిది ఫ్రాంచైజీల మధ్య నాలుగో సీజన్ మహిళల బీబీఎల్ డిసెంబర్ 1 నుంచి ఆస్ట్రేలియాలో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment