చరిత్రపుటల్లోకెక్కిన ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్‌ | Mandhana, Harman, Wolvaardt, Kapp Scored Centuries In INDW VS SAW 2nd ODI, First Time In Womens ODI Match | Sakshi
Sakshi News home page

INDW VS SAW 2nd ODI: చరిత్రపుటల్లోకెక్కిన ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్‌

Published Thu, Jun 20 2024 4:59 PM | Last Updated on Thu, Jun 20 2024 5:44 PM

Mandhana, Harman, Wolvaardt, Kapp Scored Centuries In INDW VS SAW 2nd ODI, First Time In Womens ODI Match 4 Players Scored Hundreds

మహిళల క్రికెట్‌లో భాగంగా నిన్న (జూన్‌ 19) జరిగిన భారత్‌-సౌతాఫ్రికా వన్డే మ్యాచ్‌ చరిత్రపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీల మోత మోగించారు. మహిళల వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌లో తొలుత భారత బ్యాటర్లు స్మృతి మంధన (136), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (103 నాటౌట్‌) శతక్కొట్టగా.. ఆ తర్వాత సౌతాఫ్రికా ప్లేయర్లు లారా వాల్వార్డ్ట్‌ (135 నాటౌట్‌), మారిజన్‌ కాప్‌ (114) సెంచరీలతో విరుచుకుపడ్డారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చివరి బంతి వరకు పోరాడి ఓటమిపాలైంది. లారా వోల్వార్డ్ట్‌, మారిజన్‌ కాప్‌ సౌతాఫ్రికాను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. సౌతాఫ్రికా గెలుపుకు చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరం కాగా.. పూజా వస్త్రాకర్ అద్భుతంగా బౌలింగ్‌ చేసి‌ 2 కీలక వికెట్లు తీసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఫలితంగా భారత్‌ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల స్కోర్‌ చేయగా.. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 321 పరుగులకు పరిమితమైంది. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే జూన్‌ 23న జరుగనుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement