
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ ఒక స్థానాన్ని మెరుగు పర్చుకున్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో రాహుల్ మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకున్నాడు. రాహుల్ ఖాతాలో 816 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 915 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్ క్రికెటర్ డేవిడ్ మలాన్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. భారత కెప్టెన్ కోహ్లి ఏడో ర్యాంక్‌లో ఎలాంటి మార్పు లేదు.
బౌలర్ల ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ షమ్సీ 733 రేటింగ్ పాయింట్లతో కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌ను అందుకున్నాడు. రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్–736 పాయింట్లు) టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. ఇక జట్ల పరంగా చూసుకుంటే ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ 2, టీమిండియా మూడో స్థానంలో ఉంది.
చదవండి: ఐపీఎల్: పేరు మార్చుకున్న కింగ్స్ పంజాబ్
Comments
Please login to add a commentAdd a comment