
తొలి ఐదు ర్యాంకులు సాధించిన లెగ్ స్పిన్నర్స్
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకుల్లో అరుదైన సందర్భం చోటుచేసుకుంది. బౌలింగ్ విభాగంలో తొలి ఐదు స్థానాలు లెగ్ స్పిన్నర్లే సొంతం చేసుకున్నారు. 759 రేటింగ్ పాయింట్లతో అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ తొలి స్థానంలో ఉండగా.. పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ షాదాబ్‌ఖాన్ 733 పాయింట్లతో రెండో స్థానం సొంతం చేసుకున్నాడు. 706 పాయింట్లతో భారత స్పిన్నర్ యుజువేంద్ర చహల్ మూడో ర్యాంకు సాధించాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ ఇష్ సోది(700), వెస్టిండీస్ స్పిన్నర్ సామ్యుల్ బద్రీ (671) నాలుగు, ఐదు ర్యాంకుల్లో ఉన్నారు.
ఐపీఎల్-11 సీజన్‌లో రషీద్ ఖాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తుండగా చహల్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. గత సీజన్‌లో బెంగళూరుకు ఆడిన సామ్యుల్ బద్రీని ఈ సారి వేలంలో ఏ ఫ్రాంచైజీ కనికరించలేదు. ఇష్ సోదీ సైతం అన్‌సోల్డ్ ఆటగాడిగా మిగిలిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment