టి20లో మూడో ర్యాంకు నిలబెట్టుకున్న భారత్ | Team India retain No. 3 position in T20 rankings | Sakshi
Sakshi News home page

టి20లో మూడో ర్యాంకు నిలబెట్టుకున్న భారత్

Published Sun, Sep 1 2013 2:24 PM | Last Updated on Mon, May 28 2018 2:10 PM

టి20లో మూడో ర్యాంకు నిలబెట్టుకున్న భారత్ - Sakshi

టి20లో మూడో ర్యాంకు నిలబెట్టుకున్న భారత్

టి20 ప్రపంచ ర్యాంకింగ్లో భారత్ మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. టీమిండియా బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లి టాప్ టెన్లో చోటు సంపాదించాడు. అతడు ఆరో స్థానంలో ఉన్నాడు. తాజాగా ప్రకటించిన ఐసీసీ టి20 చాంపియన్షిప్ టేబుల్లో 121 పాయింట్లతో భారత్ మూడో స్థానంలో నిలిచింది. శ్రీలంక అగ్ర స్థానం దక్కించుకోగా, పాకిస్థాన్ రెండో ర్యాంకులో ఉంది.

బ్యాట్స్మెన్ల జాబితాలో నలుగురు టీమిండియా ఆటగాళ్లు టాప్-20లో కొనసాగుతున్నారు.  కోహ్లి 731 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. సురేష్ రైనా 719 పాయింట్లతో  8వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. యువరాజ్ సింగ్ 16, గౌతమ్ గంభీర్ 19 ర్యాంకుల్లో ఉన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్లో 61 బంతుల్లో 94 పరుగులు సాధించిన ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ టాప్ ర్యాంకులోకి దూసుకొచ్చాడు.

ఇక బౌలింగ్ టాప్-20 లిస్టులో రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడే భారత తరపున నిలిచాడు. అశ్విన్ 16వ ర్యాంకులో ఉన్నాడు. ఆల్ రౌండర్ విభాగంలో యువరాజ్ సింగ్  నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement