
ICC T20 Rankings: భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. గత ఏడాది నవంబర్ 2న సూర్య టాప్ ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. బుధవారం (ఏప్రిల్ 26) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సూర్య 906 రేటింగ్ పాయింట్లతో అగ్ర స్థానంలోనే ఉన్నాడు. రిజ్వాన్ (811 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో, బాబర్ ఆజమ్ (756 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.
చదవండి: Hardik Pandya: కెప్టెన్ అన్న అహంకారంతో విర్రవీగుతున్నాడు, తీసేయండి..!
బాబర్ ఆజమ్ శతక్కొట్టినా, సూర్యకుమార్‌ను కదిలించలేకపోయాడు..
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో (5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో టీ20) సూపర్ సెంచరీతో (58 బంతుల్లో 101) చెలరేగిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు.
బాబర్ శతక్కొట్టినా అతని ర్యాంకింగ్‌లో ఎలాంటి మార్పు లేదు. అతను ఇంకా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదే సిరీస్ మహ్మద్ రిజ్వాన్ కూడా రెండు హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ అతని ర్యాంక్ కూడా మారలేదు. అతను రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు.
చదవండి: Rahane: ఇప్పుడేం చూశారు.. ముందుంది ముసళ్ల పండుగ, సినిమా చూపిస్తా..!
Comments
Please login to add a commentAdd a comment