ఐసీసీ తాజాగా (అక్టోబర్ 19) విడుదల చేసిన పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో పెద్ద మార్పులేవీ లేవు. బ్యాటర్ల విభాగంలో పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (861), టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (838), పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (808) తొలి మూడు స్థానాల్లో యధాతథంగా కొనసాగుతుండగా.. మార్క్రమ్, డెవాన్ కాన్వే, డేవిడ్ మలాన్, ఫించ్, నిస్సంక, ముహ్మద్ వసీమ్, గ్లెన్ ఫిలిప్స్ నాలుగు నుంచి పది స్థానాల్లో ఉన్నారు.
పదో స్థానంలో ఉన్న గ్లెన్ ఫిలిప్స్ మినహా టాప్-10 జాబితా యధాతథంగా కొనసాగుతుంది. ఇటీవల ముగిసిన ముక్కోణపు సిరీస్‌లో రాణించిన ఫిలిప్స్.. 13 స్థానాలు ఎగబాకి పదో స్పాట్‌కు చేరుకున్నాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ వారం టాప్-10లో రెండు మార్పులు జరిగాయి. ఆఫ్ఘన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్.. రెండు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకోగా, సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్.. ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని ఎనిమిదిలో నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ పేసర్ హేజిల్‌వుడ్, రషీద్ ఖాన్, హసరంగ, షంషి తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. టీమిండియా బౌలర్ల విషయానికొస్తే.. భువీ 12లో, అశ్విన్, అక్షర్ వరుసగా 22, 23 స్థానాల్లో నిలిచారు.
ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీని వెనక్కు నెట్టి టాప్ ప్లేస్‌కు దూసుకొచ్చాడు. ఈ జాబితాలో మొయిన్ అలీ, జెజె స్మిట్, హసరంగ, హార్ధిక్ పాండ్యా, సికందర్ రజా, జీషన్ మక్సూద్, మ్యాక్స్‌వెల్, దీపేంద్ర వరుసగా మూడు నుంచి పది స్థానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment