
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్‌లో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (728 పాయింట్లు) కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ రెండో స్థానానికి ఎగబాకాడు. అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (793 పాయింట్లు) ‘టాప్’లో కొనసాగుతున్నాడు. టాప్–10లో మరే భారత బౌలర్‌కూ చోటు దక్కలేదు. యజువేంద్ర చహల్ ఆరు స్థానాలు కోల్పోయి 17వ ర్యాంక్‌కు పడిపోయాడు. భువనేశ్వర్ 18వ ర్యాంక్‌లో ఉన్నాడు.
కృనాల్ పాండ్యా ఏకంగా 39 స్థానాలు మెరుగు పర్చుకుని కెరీర్ బెస్ట్ 58వ స్థానానికి చేరుకున్నాడు. బ్యాట్స్‌మెన్ విభాగంలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ 7వ, ధావన్ 11వ ర్యాంకులో నిలిచారు. న్యూజిలాండ్ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ కోహ్లి 4 స్థానాలు కోల్పోయి 19వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు. టి20 జట్ల ర్యాంక్‌ల్లో పాకిస్తాన్ నంబర్‌వన్ స్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment