ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌ను ఇవాళ (ఏప్రిల్ 23) విడుదల చేసింది. ఆటగాళ్లంతా ఐపీఎల్‌తో బిజీగా ఉండటంతో ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. జట్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా మూడు ఫార్మాట్లలో టాప్‌లో కొనసాగుతుంది.
వ్యక్తిగత ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్‌మన్, షాహీన్ అఫ్రిది, ఐష్ సోధి, టిమ్ సీఫర్ట్ ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. పాకిస్తాన్‌తో ఇటీవల జరిగిన టీ20లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన చాప్‌మన్ 12 స్థానాలు మెరుగుపర్చుకుని 33వ స్థానానికి ఎగబాకగా.. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో (టీ20) 3 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అఫ్రిది రెండు స్థానాలు మెరుగపర్చుకుని 17వ స్థానానికి చేరుకున్నాడు.
కివీస్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ 27వ స్థానం నుంచి 24కు.. సోధి 23 స్థానం నుంచి 18వ స్థానానికి ఎగబాకాడు. తాజా ర్యాంకింగ్స్‌లో నేపాల్ ఆటగాడు దీపేంద్ర సింగ్ ఎయిరీ తొలిసారి టాప్-50 బ్యాటర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. తద్వారా నేపాల్ తరఫున టాప్-50లో చోటు దక్కించుకున్న నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఏసీసీ ప్రీమియర్ కప్‌లో హాంగ్‌కాంగ్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కారణంగా ఎయిరీ ర్యాంకింగ్స్‌లో మార్పు వచ్చింది.
ఇవి కాకుండా తాజా ర్యాంకింగ్స్‌లో చెపుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. పురుషుల టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కేన్ విలియమ్సన్, వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజమ్, టీ20 బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ టాప్‌లో కొనసాగుతున్నారు.
టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. అశ్విన్ టాప్‌లో కొనసాగుతున్నాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో కేశవ్ మహారాజ్, టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆదిల్ రషీద్ టాప్‌లో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment