దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకుల్లో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లికి నాలుగో స్థానం దక్కింది. సురేశ్ రైనా (5), యువరాజ్ (6) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
బౌలర్ల ర్యాంకుల్లో టాప్-20లో ఒక్క భారత ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. ఆల్‌రౌండర్ల ర్యాంకుల్లో యువీ మూడో స్థానంలో నిలిచాడు. ఇక టి20 ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలవాలని ఆరాటపడుతున్న శ్రీలంక... నంబర్‌వన్ ర్యాంకుతో టోర్నీలో బరిలోకి దిగుతోంది. 2009, 2012లో రన్నరప్‌గా నిలిచిన లంకేయులు టి20 ర్యాంకింగ్స్‌లో 129 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. భారత్ (123 రేటింగ్ పాయింట్లు), పాకిస్థాన్ (121 రేటింగ్ పాయింట్లు), డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ (112 రేటింగ్ పాయింట్లు) వరుసగా రెండు, మూడు, ఆరు స్థానాల్లో నిలిచాయి.
టి20 ర్యాంకింగ్స్‌లో కోహ్లికి నాలుగో స్థానం
Published Sun, Mar 16 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 AM
Advertisement
Advertisement