
ఆరేళ్ల తర్వాత టీ20ల్లో నెం1 జట్టుగా భారత్ అవతరించింది. ఈడెన్ గార్టెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో గెలుపొందిన టీమిండియా.. ఈ ఘనత సాధించింది. కాగా గత ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత భారత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా టీ 20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. ఇక భారత జట్టును టీ20ల్లో నెం1 గా నిలిపిన రెండో కెప్టెన్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. అంతకు ముందు 2016లో మహేంద్ర సింగ్ ధోని భారత జట్టును టీ20ల్లో నెం1గా నిలిపాడు.
ఇప్పుడు రోహిత్ ఈ ఘనత సాధించాడు. కాగా రోహిత్ టీ20ల్లో భారత కెప్టెన్సీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వరుసగా రెండో టీ20 సిరీస్ విజయం. అదే విధంగా టీ20 ఫార్మాట్‌లో మూడు లేదంటే అంతకంటే ఎక్కువ సిరీస్‌లను వైట్‌వాష్ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఇక స్వదేశంలో విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. 270 పాయింట్లు సాధించి ఇంగ్లండ్‌ను వెనుక్కి నెట్టి నెం1 గా నిలిచింది. 269 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్ధానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment