వెస్టిండీస్‌తో రెండో టీ20లో విరాట్ కోహ్లి చేలరేగి ఆడాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన అర్ధ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 41 బంతుల్లో 52 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, సిక్స్ ఉన్నాయి. అయితే అర్ధ సెంచరీ వెంటనే ఛేజ్ బౌలింగ్‌లో విరాట్ క్లీన్ బౌల్డయ్యాడు. ఇక ఫామ్‌లో లేడని తనపై వస్తున్న విమర్శలకు విరాట్ బ్యాట్‌తో సమాధానం చెప్పాడు.
కాగా 52 పరుగుల చేసిన కోహ్లి తృటిలో ప్రపంచ రికార్డను కోల్పోయాడు. మరో 23 పరుగులు చేసి ఉంటే కోహ్లి అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించేవాడు. కాగా విండీస్‌తో జరిగిన మూడు వన్డేల్లో మొత్తం కోహ్లి 24 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఆటతీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
చదవండి: IND vs SL : శ్రీలంకతో టీ20 సిరీస్.. విరాట్ కోహ్లి దూరం.. కారణం అదేనా?
Comments
Please login to add a commentAdd a comment