karizma
-
మార్కెట్లోకి మళ్లీ హీరో కరిజ్మా..
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తాజాగా కరిజ్మా బ్రాండ్‌ను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 సీసీ బైక్‌ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1.72 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంటుంది. ప్రీమియం సెగ్మెంట్లో తమ వాటాన్ని పెంచుకునే దిశగా తమకు ఇది మరో మైలురాయి అని హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. తాము ప్రస్తుతం ఈ విభాగంలో ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని, మార్కెట్ వాటా 4–5 శాతం మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రీమియం ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను పూర్తి స్థాయిలో వేగవంతంగా రూపొందించుకోనున్నట్లు గుప్తా చెప్పారు. ప్రస్తుతం 150 సీసీ లోపు సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్ ఇకపై 150 సీసీ నుంచి 450 సీసీ వరకు బైక్‌ల సెగ్మెంట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టనుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది వ్యవధిలో ప్రతి మూడు నెలలకోసారి ఒక కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
ఆ ఐకానిక్ బైక్ మళ్లీ వచ్చేసింది.. అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా
Karizma XMR: దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ సరికొత్త బైక్‌ను (మంగళవారం, ఆగస్టు 29) లాంచ్ చేసింది. కరిజ్మా XMR 210 పేరుతో ఈ కొత్త బైక్ లాంచ్‌తో కరిజ్మా బ్రాండ్‌ను రీలాంచ్ చేసింది. అంతేకాదు ఈ బైక్‌పై ఆకర్షణీయమైన్ రూ. 10వేల ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది. యంగ్ జనరేషన్ బైకర్లను దృష్టిలో ఉంచుకని దీన్ని తీసు కొచ్చినట్టు హీరో మోటోకార్ప్ కంపెనీ వెల్లడించింది. బుకింగ్‌లను కూడా షురూ చేసింది. రూ. 1,82,900 లాంచింగ్ ప్రైస్‌గా ఉన్న Karizma XMR 210 ఈ తగ్గింపుతో రూ. 1,72,900 (ఎక్స్-షోరూమ్ ధర ఆల్ ఇండియా) అందుబాటులో ఉంటుంది. నటుడు,బ్రాండ్ అంబాసిడర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కరిజ్మా XMR 210ని ఆవిష్కరించారు. ఇది ఐకానిక్ ఎల్లో, టర్బో రెడ్ , మ్యాట్ ఫాంటమ్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభ్యం. Karizma XMR 210 ఇంజీన్, ఫీచర్లు 210cc సింగిల్-సిలిండర్, 4V, DOHC , లిక్విడ్-కూల్డ్ యూనిట్ 9250 RPM (కంపెనీ అత్యంత శక్తివంతమైన ఇంజిన్)ను అమర్చింది. RPM వద్ద 20.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. అని కంపెనీ తెలిపింది. లిక్విడ్ కూల్ సెటప్ డ్యూయల్-ఛానల్ ABS, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఫ్యాటర్ రియల్ వెక టైర్‌తో వస్తుంది.ఇంకా ఈ బైక్‌లో కొత్త ఎల్ఈడీ లైట్లు , ఇండికేటర్లు, స్లీకర్ ఇంధన ట్యాంక్, షార్ప్ లైన్లో, రైడర్‌కు ప్రొటెక్షన్గా స్నాజీ విండ్‌స్క్రీన్‌తో యంగస్టర్స్ను ఆకట్టుకునేలా ఉంది. కాల్ల్స్, ఇతర నోటిఫికేషన్ అలర్ట్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్, ఇంకా టర్న్-బై-టర్న్ నావిగేషన్ కూడా ఉంది. సరికొత్త ఫుల్లీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్, తేదీ, సమయం, టూర్, ఓడోమీటర్ రీడింగ్, ఇంధన స్థాయి, టాకోమీటర్ స్పీడోమీటర్ రీడింగ్‌ల వంటి సమాచారాన్ని అందిస్తుంది. Say hello to the Most Powerful in its Class machine loaded with cutting-edge tech, and a design that's an absolute head-turner. 😎 Introducing the new #KarizmaXMR, at an introductory price of Rs. 1,72,900* (*Ex-showroom price All India). BOOKINGS OPEN https://t.co/Y7zhD7lJTE pic.twitter.com/7NEhA4Fijr — Hero MotoCorp (@HeroMotoCorp) August 29, 2023 -
ధూమ్మచాలే.. హీరో కరిజ్మా మళ్లీ వస్తోంది!
హీరో కరిజ్మా బైక్ మళ్లీ వస్తోంది. ఒకప్పుడు బాగా పాపులర్ అయిన పాత బైక్‌లన్నీ ఇప్పుడు సరికొత్త హంగులు, ఫీచర్లతో మళ్లీ మార్కెట్లోకి వస్తున్నాయి. గత నెలలో బజాజ్ తన సక్సెస్ ఫుల్ బైక్ పల్సర్ ని మళ్లీ మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా హీరో మోటోకార్ప్ కూడా ఒకప్పుడు బాగా ఆదరణ పొందిన కరిజ్మా బైక్‌ను తిరిగి ప్రవేశ పెట్టనుంది. ఇదీ చదవండి: వరల్డ్ బ్యాంక్ కాబోయే ప్రెసిడెంట్‌కు కోవిడ్.. భారత్‌లో సమావేశాలన్నీ రద్దు! హీరో కరిజ్మా బైక్ దాని స్పోర్టీ లుక్స్, పెర్ఫార్మెన్స్తో లాంచ్ అయిన వెంటనే భారత మార్కెట్లో బాగా పాపులర్ అయింది. ఆ సమయంలో హీరో కరిజ్మా అత్యంత ఆకర్షణీయమైన మోటార్‌సైకిళ్లలో ఒకటి. హీరో కరిజ్మా ఆర్, హీరో కరిజ్మా ZMR విక్రయాలు అప్పట్లో భారీగా జరిగాయి. ఆ తర్వాత ఆ బైక్‌ల ఉత్పత్తిని కంపెనీ నిలిపేసింది. చాలా బైక్ తయారీ సంస్థలు ఇటీవల పాత మోడళ్లను పునరుద్ధరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరిజ్మా బైక్‌ను కొత్త హంగులతో తిరిగి తీసుకొచ్చేందుకు హీరో సంస్థ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హీరో కరిజ్మా 2023 కొత్త డిజైన్, శక్తివంతమైన ఇంజన్ ప్రస్తుతం తయారీలో ఉన్నట్లు రష్లేన్ నివేదించింది. కరిజ్మా 2023 టెస్ట్ మ్యూల్ చిత్రాలను కూడా షేర్ చేసింది. అత్యంత ఆదరణ పొందిన ఏ బైక్ అయినా సరే ఆ కంపెనీకి మంచి గుర్తింపుని తీసుకువస్తుంది. అలానే ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లో హీరో మోటోకార్ప్ తీసుకువచ్చిన కరిజ్మా బైక్ చాలా ప్రాచుర్యం పొందింది. అప్పట్లో ధూమ్ సినిమాలో హృతిక్ రోషన్ ఈ బైక్ పై వెళ్తున్న సీన్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గానే ఉంటాయి. అంత ఆదరణ పొందిన ఈ మోడల్ బైక్ ని సరికొత్త లుక్ రీలాంచ్ చేయనుంది హీరోమోటోకార్ప్. 2014లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో OG కరిజ్మా R, కరిజ్మా ZMR సిరీస్ బైక్స్ ని హీరో తీసుకువచ్చింది. ఇప్పుడిదే కొత్త లిక్విడ్ కూల్డ్ 210సీసీ ఇంజన్‌తో వస్తోంది. ఈ సెగ్మెంట్ లో పల్సర్ వంటి అధునాతన బైక్స్‌కి ఈ సరికొత్త కరిజ్మా గట్టి పోటీ ఇవ్వనుంది. ఫేస్‌లిఫ్టెడ్ మోడలన్నీ EBR (ఎరిక్ బుల్ రేసింగ్)తో తయారు చేస్తారు. కరిజ్మా మోడల్ని నిలిపివేసిన తర్వాత హీరో ఎక్స్ట్రీమ్ (Xtreme 200S) బైక్ ని లాంచ్ చేసింది. అయితే కరిజ్మా స్థానంలో తీసుకువచ్చిన ఈ బైక్ కస్టమర్లను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో వాటిని కూడా హీరో సంస్థ నిలిపివేసింది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! -
హీరో కరిజ్మా మళ్లీ వచ్చింది
సాక్షి, ముంబై: భారత మోటారుసైకిల్ తయారీ దిగ్గజ సంస్థ హీరో మోటోకార్ప్ తన పాపులర్ మోడల్ బైక్‌ను తిరిగి లాంచ్ చేసింది. కరిజ్మా జెడ్‌ఎంఆర్ బైక్‌ను ఇండియన్ మార్కెట్లో తీసుకువచ్చింది. ఈ బైక్ స్టాండర్డ్ వెర్షన్‌ను 1.08 లక్షల రూపాయల ధరతో, డ్యూయల్-టోన్ మోడల్ బైక్నురూ. 1.10 లక్షలు (ఎక్స్ షోరూమ్ ) ధర వద్ద అందుబాటులో ఉంచింది.భారతీయ విఫణిలో మొట్టమొదటి 225 సిసి సింగిల్ సిలిండర్ బైక్ గా గుర్తింపు పొందిన కరిజ్మా బైక్‌ను పేలవమైన విక్రయాల కారణంగా ఇండియన్ మార్కెట్లో సేల్స్‌నిలిపివేసింది. అయినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయాలు మెరుగ్గానే ఉన్నాయి. మెకానికల్ మార్పులు చేయనప్పటికీ, కాస్మొటిక్అప్డేట్స్తో సరికొత్తగా లాంచ్ చేసింది. 223సీసీ సింగిల్ ఇంజీన్, 20బీహెచ్పీ పవర్, 19.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ , 5 మాన్యువల్ గేర్ బాక్స్ ఈ బైక్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. నాలుగు రంగుల్లో ఆకర్షణీయంగా అందుబాటులోకి వచ్చింది. -
హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ : రూ. 47,250
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ కంపెనీ అంతా కొత్తదైన స్ప్లెండర్ ఐస్మార్ట్ బైక్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఐ3ఎస్ టెక్నాలజీతో రూపొందించిన ఈ బైక్ ధర రూ.47,250(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్, సేల్స్) అనిల్ దువా పేర్కొన్నారు. గత నెలలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఈ బైక్‌ను ప్రదర్శించామని, 100 సీసీ సెగ్మెంట్లో తమ అగ్రస్థానం మరింత పటిష్టం చేసుకోవడం లక్ష్యంగా ఈ బైక్‌ను తెస్తున్నామని పేర్కొన్నారు. ఇతర మోడళ్లలోనూ ఐ3ఎస్ టెక్నాలజీ ఇంటెలిజెంట్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌గా వ్యవహరించే ఐ3ఎస్ టెక్నాలజీ కారణంగా ట్రాఫిక్‌లో బండి ఆగగానే ఇంజిన్ ఆటోమాటిక్‌గా ఆఫ్ అయిపోతుందని, క్లచ్ నొక్కగానే స్టార్ట్ అవుతుందని అనిల్ దువా పేర్కొన్నారు. ఫలితంగా ట్రాఫిక్ ఇబ్బందులున్న నగరాల్లో కూడా మంచి మైలేజీ (70 కిమీ మైలేజీ వస్తుందని అంచనా)వస్తుందని వివరించారు. ఈ టెక్నాలజీకి పేటెంట్ కోసం దరఖాస్తు చేశామని, ఇతర బైక్‌ల్లో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తామని వివరించారు. 100-సీసీ ఎయిర్-కూల్డ్, 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో రూపొందిన ఈ బైక్‌లో సూపర్ స్ప్లెండర్‌లో ఉన్న త్రీ-టోన్ పెయింట్ ఆప్షన్, అల్యూమినియంతో కూడిన ఫుట్-పెగ్స్ కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్-స్టాండ్ డౌన్ ఇండికేటర్ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. చాలా వరకూ స్ప్లెండర్ ఎన్‌ఎక్స్‌జీని పోలిన ఈ బైక్ నాలుగు కొత్త రంగుల్లో లభ్యమవుతుందని వివరించారు. ఈ కంపెనీ గత నెలలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కొత్త బైక్‌లను ప్రదర్శనకు ఉంచింది. వీటిల్లో 620 సీసీ హస్టర్, 250సీసీ స్పోర్ట్స్ బైక్ హెచ్ఎక్స్ 250ఆర్, హైబ్రిడ్ స్కూటర్ లీప్, 150 సీసీ స్కూటర్ జిర్‌లో రెండు మోడళ్లు, 125 సీసీ డేర్, 110 సీసీ స్కూటర్ డాష్‌లను కూడా ఈ కంపెనీ ఆటో ఎక్స్‌పోలో డిస్ప్లే చేసింది. ఇక ఈ నెలలోనే ప్లెజర్, ఎక్స్ట్రీమ్, జడ్ఎంఆర్ మోడళ్లలో కొత్త వేరియంట్లను అందిస్తామని అనిల్ దువా వెల్లడించారు.