Auto Expo 2023: Keeway SR250 Launched In India, Check Price And Other Details - Sakshi
Sakshi News home page

Auto Expo 2023 అదిరిపోయే కీవే రెట్రో బైక్ ఎస్‌ఆర్‌ 250, కేవలం 2 వేలతో

Published Wed, Jan 11 2023 6:51 PM | Last Updated on Wed, Jan 11 2023 8:31 PM

Auto Expo 2023 Keeway SR250 Launched check price here - Sakshi

న్యూఢిల్లీ:  హంగేరియన్ బ్రాండ్ కీవే  ఆటో ఎక్స్‌పోలో కొత్త బైక్‌ను లాంచ్‌ చేసింది. SR125  సిరీస్‌లో కీవే ఎస్‌ఆర్‌ 250ని ఢిల్లీలో జరుగుతున్న ఆటోఎక్స్‌పో 2023లో ఆవిష్కరించింది.  రెట్రో మోడల్ బైక్  ఎస్‌ఆర్‌ 250 ప్రారంభ ధరను  1.49 లక్షలుగా నిర్ణయించింది. 

కేవలం  2 వేల రూపాయలతో ఆన్‌లైన్‌ ద్వారా  దీన్ని బుక్‌ చేసుకోవచ్చని  కంపెనీ తెలిపింది.  సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, 223cc ఇంజన్‌,  7500 rpm వద్ద 15.8 bhp, 6500 rpm వద్ద16 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2023 ఏప్రిల్‌ నుండి SR250 డెలివరీలను ప్రారంభం. ఇండియాలో ఎస్‌ఆర్‌ 125కి వచ్చిన ఆదరణ నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చామని AARI మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఝబఖ్  తెలిపారు. ఇది భారతదేశంలో హంగేరియన్ బ్రాండ్  8వ ఉత్పత్తి. ఈ బ్రాండ్‌ను అదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మార్కెట్‌ చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement