Auto Expo 2023
-
హైస్పీడ్ ఈ-స్కూటర్ ‘మిహోస్’ లాంచ్..ఫ్రీ బుకింగ్, ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లో మరో ఈ స్కూటర్ సందడి చేయనుంది. జాయ్ ఇ-బైక్ తయారీదారు వార్డ్ విజార్డ్ తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మిహోస్ ఆన్లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది. జనవరి 22 నుండి కస్టమర్లు కంపెనీ వెబ్సైట్ నుండి అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 600+ అధీకృత షోరూమ్‌ల నుండి మిహోస్‌ను ఉచితంగా బుక్ చేసుకోవచ్చు. మిహోస్ డెలివరీలు మార్చి 2023లో దశలవారీగా ప్రారంభం మవుతాయని కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆటో ఎక్స్పో 2023 సందర్భంగా జాయ్ ఇ-బైక్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 1.49 లక్షలకు (ఎక్స్-షోరూమ్, పాన్ ఇండియాలో మొదటి 5000 మంది కస్టమర్లకు) లాంచ్ చేసింది. స్మార్ట్ మిహోస్ ఇ-స్కూటర్ విభిన్న సెన్సార్ల కలయికతో వస్తుంది. అదనపు మన్నిక, సేఫ్టీకోసం పాలీడైసైక్లోపెంటాడిన్ (PDCPD)తో రూపొందించింది. 7 సెకన్లలోపు వ్యవధిలో 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. నికెల్ మాంగనీస్ కోబాల్ట్ కెమిస్ట్రీతో 74V40Ah Li-Ion ఆధారిత బ్యాటరీ,యాంటీ-థెఫ్ట్ సిస్టమ్, GPS సెన్సింగ్, రియల్-టైమ్ పొజిషన్ , జియో-ఫెన్సింగ్ వంటి అనేక ఇతర ఫీచర్లు మిహోస్‌లో ఉన్నాయి.'జాయ్ ఇ-కనెక్ట్ యాప్' ద్వారా స్కూటర్ని ట్రాక్ చేయవచ్చు , బ్యాటరీ స్థితిని కూడా రిమోట్‌గా తనిఖీ చేయవచ్చు. రివర్స్ మోడ్‌తో ఇరుకైన పార్కింగ్ ప్రదేశాల నుండి సులభంగా బయటకు రావడానికి స్కూటర్‌ను వెనుకకు తరలించడానికి అనుమతిస్తుంది. మెటాలిక్ బ్లూ, సాలిడ్ బ్లాక్ గ్లోసీ, సాలిడ్ ఎల్లో గ్లోసీ, పెరల్ వైట్ ఇలా నాలుగు రంగుల్లో మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ఆటో ఎక్స్‌పోలో తమకు అద్భుతమైన స్పందన లభించిందనీ, ముఖ్యంగా ఈ స్కూటర్ రెట్రో డిజైన్‌ను ప్రశంసించడమే కాకుండా అదనపు భద్రత కోసం ఉపయోగించిన పాలీ డైసైక్లోపెంటాడిన్ బాగా ఆకర్షించిందనీ వార్డ్‌విజార్డ్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ యతిన్ గుప్తా తెలిపారు. వినియోగదారుల సానుకూల స్పందనతోనే ఆన్లైన్ బుకింగ్స్‌ను ఉచితంగా ప్రారంభించామన్నారు. టాప్ నాచ్టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో, కస్టమర్ల ఆకాంక్షల్ని తీర్చగలమనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
మారుతి జిమ్నీ హవా మామూలుగా లేదుగా, 2 రోజుల్లోనే
సాక్షి, ముంబై: ఆటో ఎక్స్పో 2023లో మారుతి సుజుకి ఆవిష్కరించిన లైఫ్‌స్టైల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ జిమ్నీ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. ఆవిష్కరించిన రెండు రోజుల్లోనే, 3వేల యూనిట్ల బుకింగ్‌లను పొందింది. రాబోయే రోజుల్లో జిమ్నీకి బలమైన ఆర్డర్లు వస్తాయని కంపెనీ భావిస్తోంది. దీంతో జిమ్నీ వెయిటింగ్ పీరియడ్ ఇప్పటికే మూడు నెలల వరకు పెరిగిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. గ్రేటర్ నోయిడా వేదికగా జరుగుతున్న ఆటో ఎక్స్పో 2023లో మారుతి సుజుకి జిమ్నీని 5 డోర్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజీన్‌తో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరికి దీనిని వినియోగదారులకు అందించనుంది. ఈ జిమ్నీ ధర రూ. 10-12.5 లక్షల శ్రేణిలో ఉంటుందని అంచనా. -
కొత్త ఫీచర్లతో మెరిసిన టాటా సఫారి 2023 డార్క్ ఎడిషన్
న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2023లో టాటా మోటార్స్ సఫారి, హ్యారియర్ కొత్త డార్క్ వెర్షన్లను పరిచయం చేసింది. కాస్మెటిక్ అప్డేట్లతో వీటిని ఆవిష్కరించింది. సఫారీ కొత్త వెర్షన్ స్టాండర్డ్ మోడల్‌తో పోలినప్పటికీ, ప్రతిచోటా క్రిమ్సన్ డిటైలింగ్‌తో అప్డేట్ చేసింది. రెడ్ ఫాబ్రిక్ బ్రాండ్-న్యూ సీట్లను అందించింది. ఫ్రంట్, సెంటర్ ఆర్మ్‌రెస్ట్ ,డోర్ గ్రాబ్ గ్రిప్లలో ఒకటి బ్రైట్ క్రిమ్సన్ రంగులో డిజైన్ చేసింది. ముఖ్యంగా 10.25-అంగుళాల టచ్ స్క్రీన్‌తో కూడిన కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, అధునాతన డ్రైవర్ ఫెండ్లీ ఫీచర్లు (ADAS) కూడా జోడించింది. అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, రియర్ కొలిషన్ వార్నింగ్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, డోర్ ఓపెన్ అలర్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ చేంజ్ అలర్ట్ హై బీమ్ అసిస్ట్ వంటి సేఫ్టీ అసిస్ట్ ఫీచర్లున్నాయి. వీటి ధరలను కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది. 2023 ఆటో ఎక్స్పో తొలి రోజున, టాటా మోటార్స్ ఈవీల్లో తన సత్తాను ప్రదర్శించింది. Avinya ప్రోటోటైప్ EVని , టాటా పంచ్ టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ వేరియంట్లతో పాటు, టాటా హారియర్ EV, టాటా సియెర్రా EVలను కూడా ప్రారంభించింది. -
టాటా, హ్యుందాయ్‌కి పోటీ: మారుతి సుజుకి కాంపాక్ట్ ఎస్యూవీ ఫ్రాంక్స్
న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2023లో రెండో రోజు దేశీయ ఆటో దిగ్గజం మారుతి సుజుకి కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రాంక్స్ కాంపాక్ట్ ఎస్యూవీ, మారుతి సుజుకి జిమ్నీ (5డోర్)ను ఆవిష్కరించింది. వీటి బుకింగ్‌లను కూడా షురూ చేసింది కంపెనీ. కస్టమర్లకు అధునాతన ఫీచర్లు, ఇంజన్ ఎంపికలతో స్పోర్టీ అండ్ స్టైలిష్ వాహనాలను అందించాలని లక్ష్యంతో మారుతి సుజుకి వీటిని లాంచ్ చేసింది. ఇది టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూకి గట్టి పోటీ ఇవ్వనుంది. స్పోర్టీ అండ్ స్టైలిష్ డిజైన్‌తో మారుతి సుజుకి ఫ్రాంక్స్ రెండు ఇంజన్ ఎంపికలతో ఇది లాంచ్ అయింది. 99 హార్స్పవర్, 147 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0 లీటర్ బూస్టర్‌జెట్ ఇంజన్, 89 హార్స్పవర్, 113 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలలో ఇది లభ్యం.కారు ఫ్రంట్ ఎండ్ ఇటీవల విడుదల చేసిన గ్రాండ్ విటారా, బాలెనో మోడల్‌లు పోలి వుంది. కూపే లాంటి C-పిల్లర్‌ను LED స్ట్రిప్ , సిగ్నేచర్ LED బ్లాక్ టెయిల్ లైట్లను జోడించింది. కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జర్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, హెడ్స్-అప్ డిస్ప్లే, 360-డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్,ఆరు ఎయిర్బ్యాగ్లఇతర ఫీచర్లు. అలాగే 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ , ఏఎంటీమూడు ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. 1.2-లీటర్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 5 స్పీడ్ ఆటో ట్రాన్స్మిషన్ తో వస్తోంది. బూస్టర్ జెట్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటో మేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తోంది. -
స్టైలిష్ డిజైన్‌తో టార్క్ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్
న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2023లో భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీదారు టార్క్ మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ - క్రాటోస్ ఎక్స్‌ని ఆవిష్కరించింది.అలాగే సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్ ఈ-మోటార్‌సైకిల్ క్రా టోస్ ఆర్(kratos R) పేరిట తీసుకొచ్చింది. వేగవంతమైన, మెరుగైన, టోర్కియర్: ది స్పోర్టియర్ క్రాటోస్ ® X అని టార్క్ కంపెనీ ప్రకటించింది. 2023 రెండో త్రైమాసికంలోఈ మోటార్ సైకిల్ బుకింగ్‌లు ప్రారంభం. మోటార్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగాన్ని మరింత అందుబాటులోకి ,ఆచరణాత్మకంగా చేయడానికి కట్టుబడి ఉన్నామని TORK మోటార్స్ వ్యవస్థాపకుడు,సీఈఓ కపిల్ షెల్కే తెలిపారు. ఈ రోజు కంపెనీకి ఒక ముఖ్యమైన మైలురాయి అని సంతోషం ప్రకటించారు. బెస్ట్ ఇన్ క్లాస్ టెక్నాలజీతో స్పోర్టియర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అద్భుతమైన సౌకర్యం, మెరుగైన పనితీరు , మెరుగైన రైడింగ్ అనుభవం కోసం రూపొందించినట్టు తెలిపారు. తమ డైనమిక్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అత్యుత్తమ పవర్‌ట్రెయిన్, టార్క్‌ను అందిస్తుందనీ, డిస్ప్లే ఇన్స్ట్రుమెంటేషన్, ఇతర సేఫ్టీ ఫీచర్లు హోస్ట్ రైడింగ్ అనుభవాన్ని మరింత సురక్షితం చేస్తుందని వెల్లడించారు. అలాగే కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కొత్త వాటిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.కాగా కంపెనీ ఇటీవల పూణేలో తన మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని (COCO మోడల్) ప్రారంభించింది. హైదరాబాద్, సూరత్, పాట్నా నగరాల్లో డీలర్‌షిప్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం, పూణే, ముంబై, హైదరాబాద్‌లో డెలివరీ చేస్తోంది. త్వరలో ఇతర మార్కెట్లలో కూడా ప్రారంభించ నుంది. వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ బైక్స్‌ను బుక్ చేసుకోవచ్చని టార్క్ ఒక ప్రకటనలో తెలిపింది. క్రాటోస్ ఆర్‌లో రిఫైన్డ్ లైవ్ డాష్, ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్, మెరుగైన ముందు, వెనుక బ్లింకర్లు లాంటి మార్పులు చేసింది. అలాగే ఈ మోటార్ సైకిల్ జెట్ బ్లాక్, వైట్.రెండు కొత్త వేరియంట్లలో లభిస్తుంది -
అట్టహాసంగా ఆటో ఎక్స్పో-2023, కళ్లు చెదిరే ఈవీల హవా (ఫొటోలు)
-
అదిరిపోయే కీవే రెట్రో బైక్ ఎస్ఆర్ 250, కేవలం 2 వేలతో
న్యూఢిల్లీ: హంగేరియన్ బ్రాండ్ కీవే ఆటో ఎక్స్‌పోలో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. SR125 సిరీస్‌లో కీవే ఎస్ఆర్ 250ని ఢిల్లీలో జరుగుతున్న ఆటోఎక్స్‌పో 2023లో ఆవిష్కరించింది. రెట్రో మోడల్ బైక్ ఎస్ఆర్ 250 ప్రారంభ ధరను 1.49 లక్షలుగా నిర్ణయించింది. కేవలం 2 వేల రూపాయలతో ఆన్లైన్ ద్వారా దీన్ని బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, 223cc ఇంజన్, 7500 rpm వద్ద 15.8 bhp, 6500 rpm వద్ద16 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2023 ఏప్రిల్ నుండి SR250 డెలివరీలను ప్రారంభం. ఇండియాలో ఎస్ఆర్ 125కి వచ్చిన ఆదరణ నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చామని AARI మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఝబఖ్ తెలిపారు. ఇది భారతదేశంలో హంగేరియన్ బ్రాండ్ 8వ ఉత్పత్తి. ఈ బ్రాండ్‌ను అదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మార్కెట్ చేస్తోంది. We are excited to Launch the All-New #SR250 from Keeway. Buckle up to witness a Retro ride with a twist! Priced at ₹ 1.49 Lakhs* only. Book yours online at ₹ 2 000 only. Visit: https://t.co/TZ4YeuD8Jb or call: 7328903004 T&C* Apply#Keeway #KeewayIndia #Launch #Hungarian pic.twitter.com/TS3Joj6XeH — KeewayIndia (@keeway_india) January 11, 2023 The SR 250 is available in 3 appealing colours! Price starts at ₹ 1.49 Lakhs* only. Book yours online at ₹ 2 000 only. Visit : https://t.co/TZ4YeuD8Jb or call : 7328903004 T&C* Apply#Keeway #KeewayIndia #SR250 #AutoExpo2023 #AutoExpo #Launch #Hungarian pic.twitter.com/IU6s0KuxJ6 — KeewayIndia (@keeway_india) January 11, 2023 -
ఈవీ సెగ్మెంట్లోకి మారుతి, ఆటోఎక్స్పోలో ‘ఈవీఎక్స్’ కాన్సెప్ట్ ఎంట్రీ
న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2023మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. గ్రేటర్ నొయిడా వేదికగా జరుగుతున్న ఆటో ఎక్స్పో 2023లో బుధవారం (జనవరి 11) తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఈవీఎక్స్’ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ‘మారుతీ సుజుకీ ఈవీఎక్స్ కాన్సెప్ట్’ ఎలక్ట్రిక్ కారు 2025లో మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. అద్బుతమైన బ్యాటరీ పవర్డ్ ఆప్షన్‌తో ఫస్ట్ మోడల్‌ను తీసుకొస్తున్నట్టు మారుతి సుజుకీ గ్రూప్ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ వెల్లడించారు. గరిష్టంగా 550 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధితో 60kWh బ్యాటరీని ఇందులో అందించింది. మారుతి eVX SUV కాన్సెప్ట్ హ్యుందాయ్ క్రెటా కంటే పెద్దదిగా 2700mm పొడవైన వీల్‌బేస్‌ను అందిస్తుంది. టయోటా 40PL గ్లోబల్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించిన ఈ మోడల్ 27PL ప్లాట్‌ఫారమ్‌కు పునాదిగా పనిచేస్తుంది,. ముందు భాగంలో పదునైన గ్రిల్, హెడ్‌ల్యాంప్‌ల కోసం LED DRLలను కలిగి ఉంది. అదనంగా, EV కాన్సెప్ట్‌లో పెద్ద వీల్ ఆర్చ్‌లు, అల్లాయ్ వీల్స్, కూపేని పోలి ఉండే రూఫ్‌లైన్ ,మినిమల్ ఓవర్‌హాంగ్‌తో కూడిన షార్ప్లీ యాంగిల్ రియర్ ఉన్నాయి. మారుతి కొత్త మారుతి కాన్సెప్ట్ eVX ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్ EVతో పోటీపడనుంది. మారుతి కాన్సెప్ట్ eVX బేస్ మోడల్ ధర రూ. 13 లక్షలు ,టాప్ వేరియంట్ల ధర ఎక్కువగా రూ. 15 లక్షలుగా ఉండనుంది. ఈవీఎక్స్ ఎస్యూవీ కాన్సెప్ట్ తోపాటు, గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్6, సియజ్, ఎర్టిగా, బ్రెజా, వాగనార్ ఫ్యుయల్ ఫ్లెక్స్ ఫ్యుయల్, బలెనో, స్విఫ్ట్ ను ఇక్కడ ప్రదర్శించనుంది. -
హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్; స్పెషల్ ఎట్రాక్షన్‌గా షారూఖ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభంమైన ఆటో ఎక్స్పో 2023 (జనవరి 11నుంచి 18 వరకు) వాహన ప్రియులను, బిజినెస్ వర్గాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. 45 దేశీయ, అంతర్జాతీయ తయారీ సంస్థలు కొత్త మోడళ్లు, విద్యుత్తు కార్లు, కాన్సెప్ట్ కార్లు, త్రి, ద్విచక్ర వాహనాలు, కమర్షియల్ వెహికల్స్ ఎగ్జిబిట్ కానున్నాయి. ఈ క్రమంలో ఆటో ఎక్స్పో మొదటి రోజున, ప్రముఖ వాహన తయారీదారు హ్యుందాయ్ మోటార్స్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ స్యూవీని లాంచ్ చేసింది. దీంతోపాటు స్లీక్ అండ్ ఫుల్లీ-ఎలక్ట్రిక్ సెడాన్ Ioniq 6నికూడా ప్రదర్శించింది. బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ ఈ కారును ఆవిష్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హ్యుందాయ్ బ్రాండ్ అంబాసిడర్ షారూఖ్ తనదైన 'సిగ్నేచర్ స్టైల్'లో Ioniq 5తో పోజులివ్వడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. లక్ష రూపాయలతో బుకింగ్‌లకు సిద్ధంగా ఉన్న ఈ కారు ధరను ఆటో ఎక్స్పో 2023లో కంపెనీ తాజాగా వెల్లడించింది. ప్రారంభ ధర రూ. 44.95 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ ప్రకటించింది. తెలుపు, నలుపు , ప్రత్యేకమైన మ్యాట్ సిల్వర్ కలర్స్‌లో ఇది లభ్యం. ఐనాక్ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు (డ్రైవర్ & ప్యాసింజర్, సైడ్ & కర్టెన్), వర్చువల్ ఇంజిన్ సౌండ్ సిస్టమ్ (VESS), ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ (EPB), మొత్తం నాలుగు డిస్క్ బ్రేక్‌లు, మల్టీ కొలిజన్-ఎవాయిడెన్స్ బ్రేక్ (MCB) పవర్ ఫీచర్లున్నాయి. ముఖ్యంగా కేవలం 18 నిమిషాల్లో (350kw DC ఛార్జర్) 10- 80శాతం వరకు అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యంతో వస్తుందని కంపెనీ తెలిపింది. Handsome Hunk #𝐒𝐡𝐚𝐡𝐫𝐮𝐤𝐡𝐊𝐡𝐚𝐧 on stage at #Hyundai Auto Expo event in #Delhi. 😎 at #AutoExpo2023 | Launched Hyundai #Ioniq5 EV priced at Rs 44.95 lakh with his signature step!#Pathaan #HyundaiAtAutoExpo2023 #HyundaiIndia #HyundaiAE2023 #Hyundai #SRK #AutoExpo2023 https://t.co/eFi7o77MEE — SHAsHikant CHavan (@iamsmCHavan) January 11, 2023 -
ఆటో ఎక్స్పో 2023: కియా కేఏ4 ఆవిష్కారం, వేల కోట్ల పెట్టుబడులు
సాక్షి,ముంబై: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కార్ల తయారీదారులలో ఒకటైన కియా ఇండియా ఆటో ఎక్స్పో 2023లో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. కాన్సెప్ట్ EV9 SUV , KA4 కార్లను ఆవిష్కరించింది.అంతేకాదు ఇండియాలో రానున్న 4-5 సంవత్సరాలలో రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఆర్ అండ్ డీ సెంటర్, 2025లో మేడిన్ ఇండియా ఈవీనీ లాంచింగ్‌లో ఈ పెట్టుబడి సహాయపడుతుందని కియా పేర్కొంది. కియా ఇండియా తన ఆల్-ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్ - కియా కాన్సెప్ట్ ఈవీ9, కొత్త కేఏ4లను జనవరి 11న ప్రారంభమైన ఆటో ఎక్స్పో 16వ ఎడిషన్‌లో లాంచ్ చేసింది. KA4 లాంచ్‌తో, కంపెనీ MPV సెగ్మెంట్లో బలమైన పట్టు సాధించాలని చూస్తోంది. ఈ 4వ జనరేషన్ కార్నివాల్ ఎంపీవీ ఈ ఏడాది చివర్లో భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో కేఏ4 3 ఇంజన్ ఎంపికలతో రానుంది. వీటిలో 3.5-లీటర్ GDi V6 పెట్రోల్, 3.5-లీటర్ MPi V6 పెట్రోల్ , 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా లభ్యంకానుంది. 3 లేదా 4 వరుసల సీటింగ్ కాన్ఫిగ రేషన్లతో, గరిష్టంగా 11 మంది ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుందట. 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అలాగే డ్యాష్ బోర్డ్‌లోని టచ్-సెన్సిటివ్ బటన్స్ ద్వారా ఇన్ఫోటైన్మెంట్, క్లైమేట్ కంట్రోల్ ఫంక్షన్లను నియంత్రించే ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. కాగా మూడు సంవత్సరాల కోవిడ్ అనంతరం జరుగుతున్న మొదటి ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. వివిధ విభాగాల నుండి 45 వాహన తయారీదారులతో సహా 70 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటారు.కియా ఇండియా 2023లో 220 నగరాలకు విస్తరించాలని , 2024 నాటికి 100 ప్లస్ అవుట్లెట్లకు చేరుకోవాలని యోచిస్తోంది.