
సాక్షి, ముంబై: ఆటో ఎక్స్‌పో 2023లో మారుతి సుజుకి ఆవిష్కరించిన లైఫ్‌స్టైల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ జిమ్నీ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. ఆవిష్కరించిన రెండు రోజుల్లోనే, 3వేల యూనిట్ల బుకింగ్‌లను పొందింది. రాబోయే రోజుల్లో జిమ్నీకి బలమైన ఆర్డర్లు వస్తాయని కంపెనీ భావిస్తోంది. దీంతో జిమ్నీ వెయిటింగ్ పీరియడ్ ఇప్పటికే మూడు నెలల వరకు పెరిగిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.
గ్రేటర్ నోయిడా వేదికగా జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2023లో మారుతి సుజుకి జిమ్నీని 5 డోర్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజీన్‌తో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరికి దీనిని వినియోగదారులకు అందించనుంది. ఈ జిమ్నీ ధర రూ. 10-12.5 లక్షల శ్రేణిలో ఉంటుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment