
మాలీవుడ్ నటి ప్రియా ప్రకాష్ వారియర్
సాక్షి, హైదరాబాద్ : మాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ నెట్టింట్లో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, బాలీవుడ్ హీరోలు, స్టార్ క్రికెటర్లను ఆకట్టుకుంటూ ఈ అమ్మడు దూసుకుపోతోంది. ఇక ఈ అమ్మాయి కొంటెగా కన్నుగీటితూ.. సన్నగా నవ్విన అర నవ్వులకు సోషల్ మీడియాలో కుర్రకారు హుషారు ఒక రేంజ్‌లో ఉంది.
ట్విటర్, ఎక్స్ ప్రెషన్స్, కామెంట్లు, జిప్ వీడియోలతో హోరెత్తిపోతోంది. ముఖ్యంగా ప్రముఖ క్రికెటర్లు గౌతం గంభీర్, రవి శాస్త్రి, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీతో పాటు, బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్‌లు ప్రియావైపు చూస్తున్నట్లు హాస్య ఫోటోలను ఎడిట్ చేసి టైమ్‌లైన్లను నింపేస్తున్నారు నెటిజన్లు. బాలీవుడ్ చర్రితలో కత్రినా కైఫ్ కూడా ఇంతటి అందమైన భావాలను అన్నిరకాల వ్యక్తీకరణలను పలికించలేపోయిందని ఓ ట్విటరాటీ వ్యాఖ్యానించడం విశేషం.
కేరళలోని త్రిసూర్‌కు చెందిన ప్రియ నటిస్తున్న ‘ఒరు అదార్ లవ్’లోని ‘మాణిక్య మలరయ పూవి’ అనే సాంగ్‌లో క్లిప్ ఫిబ్రవరి 9న ఆన్‌లైన్లో వైరల్ అయి మంగళవారం సాయంత్రానికి యూ ట్యూబ్‌లో సుమారు 10,000,000 వీక్షణలను సంపాదించింది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రియా ఫాలోవర్స్ అమాంతం పెరిగిపోయారు.
కాగా త్వరలో విడుదల కాన్ను ప్రియ డెబ్యూ మూవీకి ఓమర్ దర్శకత్వం వహించగా, ఓసుపచాన్ మూవీ హౌస్ పతాకంపై ఓసేపచాన్ వాలాకుజ్హి నిర్మించారు. షాన్ రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
— pysh (@TeaAnddBusquets) February 11, 2018
Cute expression kya bt hai
— Nitish thapliyal (@Nitishthapliya5) February 12, 2018
Dil ko chu gya thaak 😍😍😍😍😍😍 pic.twitter.com/BsVvsPRmVf
— 💛 (@ShiftedtoMars) February 11, 2018
Comments
Please login to add a commentAdd a comment