మనిషి తర్వాత అంతటి కామెడీ జంతువు ఏది? చింపాజీ.. కోతి.. అంటూ ఆంథ్రోపాలజీ ఆధారంగా ఊహాగానం లాంటి సమాధానం చెబితే సరిపోదు. మీకు సమీపంలో ఉన్న జంతువుల్ని పరీక్షగా చూశారా? ఎప్పుడైనా ఓసారి అవి నవ్వితే ఎలా ఉంటుందో చూశారా? చూస్తే ఇంకోసారి, చూడకపోతే మొదటిసారి..అన్నట్లు జంతువుల్లో హైనాలు బాగా కామెడీ టైప్ అట! ఎలుకలు కూడా సాధ్యమైనంతలో పొట్ట చెక్కలు చేసుకుంటూ ఉంటాయట! ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఫొటోగ్రాఫర్లు తీసిన, జనం మెచ్చిన పక్షులు, జంతువుల నవ్వుల ఫొటోలివి.. నమ్మండి.. ఇది నిజంగా నవ్వేనండి!