
చిత్ర పరిశ్రమలో సాయి పల్లవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఆమెను అభిమానించేవాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకే మన దర్శకనిర్మాతలు సినిమాల్లో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటారు. హీరో ఎవరనేది పట్టించుకోకుండా.. వైవిద్యమైన పాత్ర ఉంటే చాలు నటించడానికి సై అంటుంది ఈ లేడీ పవర్‌స్టార్. ఫిదా, లవ్‌స్టోరీ సినిమాలు ఆ కోవలోకి చెందిన చిత్రాలే.
అయితే గత కొంతకాలం నుంచి మాత్రం సాయి పల్లకి బ్యాడ్ టైం నడుస్తోంది. ఇటీవల ఈ నేచురల్ బ్యూటీ నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన విరాటపర్వం, గార్గి లాంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయినప్పటికీ.. కమర్షియల్‌గా నిర్మాతలకు మాత్రం నిరాశే మిగులుతోంది.
దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది ఈ నేచురల్ బ్యూటీ. అంతేకాదు మీడియాకు, సోషల్ మీడియాకు కూడా కాస్త దూరంగానే ఉంటుంది. దానికి కారణం ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ కావడమే. అయితే చాలా రోజుల తర్వాత ఇన్‌స్టాలో ఆమె ఫోటోని షేర్ చేసింది. జీవితంలో చిరునవ్వులు...ఆశ... కృతజ్ఞత ఉంటే చాలు అంటూ నవ్వులు చిందిస్తున్న ఫోటోని సాయి పల్లవి షేర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment