public servants
-
ఆప్ గుర్తింపు రద్దు చేయండి: ఈసీకి బ్యూరోక్రట్ల లేఖ
ఢిల్లీ: ఒకవైపు గుజరాత్‌లోనూ పాగా వేయాలని.. ఎన్నికల ముందస్తు ప్రచారంలో పాల్గొంటున్నారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈక్రమంలో ‘ఉచిత’ హామీల మీద హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. అయితే అధికార రాష్ట్రంలోనే కేజ్రీవాల్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ 57 మంది బ్యూరోక్రట్స్, డిప్లోమాట్స్.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను రాబోయే ఎన్నికల కోసం ఆప్ వాడుకోవాలని చూస్తోందని లేఖలో వాళ్లు ఆరోపించారు. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్.. పోలీస్ సిబ్బంది, హోం గార్డులు, అంగన్వాడీ వర్కర్స్, ప్రజారవాణ వ్యవస్థలోని డ్రైవర్లను, ఆఖరికి పోలింగ్ బూత్ ఆఫీసర్లను కూడా వచ్చే ఎన్నికల్లో ఆప్ కోసం పని చేయాలని పిలుపు ఇచ్చారు. కానీ, ఇలా ప్రజా సేవకులను.. ఒక పార్టీ, అదీ అధికారంలో ఉన్న పార్టీ తమ ఎన్నికల స్వార్థం కోసం వాడుకోవడం సరైంది కాదు. ఇది ప్రజా ప్రతినిధుల చట్టం 1951 నిబంధనలను ఉల్లంఘించేలా ఉంది. అంతేకాదు.. 1968 ఎన్నికల సింబల్స్ ఆర్డర్‌లోని 16ఏ ఉల్లంఘిస్తుంది. కాబట్టి, లేఖను పరిగణనలోకి తీసుకుని ఆప్ గుర్తింపు రద్దు చేయాలని లేఖలో బ్యూరోక్రట్లు కోరారు. ప్రభుత్వ ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తూ.. స్వలాభం కోసం ఆప్, వాళ్లను వాడుకోవాలని చూస్తోందని లేఖలో ఆరోపించారు వాళ్లు. అంతేకాదు.. ఆప్ కోసం పని చేస్తే ట్రాన్స్ఫర్లతో పాటు ఉచిత విద్యుత్, కొత్త స్కూల్స్.. ఉచిత విద్య హామీలను ఇచ్చి ప్రలోభపెట్టే యత్నం చేస్తోందని లేఖలో పేర్కొన్నారు వాళ్లు. ఈ లేఖపై ఈసీ స్పందన తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా? -
రూల్స్ పక్కనపెట్టి ఆ పని చేశా: మంత్రి గడ్కరీ
ముంబై: ‘‘నేను తరచూ అధికారులకు చెబుతుంటాను. మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం పనిచేయదు. మంత్రుల ఆదేశాలకు మీరు ‘యస్ సర్’ అంటూ పని చేయాల్సిందే. మేము (మంత్రులం) చెప్పిన దానినే మీరు అమలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం మా ప్రకారమే పనిచేస్తుందని.. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు ఆశ్చర్యంగా అనిపించి ఉండొచ్చు. కానీ, ఆ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం మాత్రం వేరే ఉంది. మంచి చేయాలనే ఆలోచనే ఉంటే.. పేదల సంక్షేమ విషయంలో ఏ చట్టం, అధికారం అడ్డుతగలబోదన్న కోణంలో గడ్కరీ పైవ్యాఖ్యలు చేశారు. ఇందుకోసం రూల్స్, బ్యూరోక్రసీని పక్కనపెట్టి ఆయన చేసిన ఓ మంచి పనిని గుర్తు చేసుకున్నారాయన. అది 1995వ సంవత్సరం. ఆ సమయంలో మనోహర్ జోషి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. గడ్కరీ ఏమో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మినిస్టర్‌గా పని చేశారు. విదర్భ మేల్ఘాట్ రీజియన్‌లో పోషకాహార లోపంతో పిల్లలు మరణించడం ఎక్కువగా ఉండేది. కనీసం 2వేల మంది పిల్లలైనా చనిపోయి ఉంటారక్కడ. ఆ సమయంలో ఆ ప్రాంతానికి రోడ్లు వేయాలని ప్రభుత్వం ఎంతో ప్రయత్నించింది. కానీ, అటవీ శాఖ అధికారులు చట్టాల వంకతో అడ్డుకునే యత్నం చేశారు. చివరకు అమరావతి కమిషనర్ సైతం ఎలాంటి సాయానికి ముందుకు రాలేదు. అది బాగా వెనుకబడిన ప్రాంతం. ఆ టైంలో నా దారిలో సమస్యను పరిష్కరించా అని చెప్పుకొచ్చారాయన. ఏ చట్టం కూడా పేదల సంక్షేమానికి అడ్డుకాదన్న మహాత్మాగాంధీ మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు గడ్కరీ. ‘‘ఏ చట్టం పేదల సంక్షేమానికి అడ్డుకాదన్నది నాకు తెలుసు. అవసరమైతే సదరు చట్టాన్ని పదిసార్లు ఉల్లంఘించాల్సి వచ్చినా వెనుకాడేది లేదు. మహాత్మాగాంధీ అదే చెప్పారు’’ అని గడ్కరీ ఉటంకించారు. నాసిక్‌లో మంగళవారం మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. గడ్కరీ చూపిన చొరవతోనే మేల్ఘాట్ రీజియన్‌లో 450 గ్రామాలకు రోడ్లు పడ్డాయి. అక్కడి ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ సౌకర్యాలు, సంక్షేమ పథకాలు అందుతున్నాయ్ కూడా. ఇదీ చదవండి: ఆ బీజేపీ సీఎంకు పదవీగండం! -
నవ్వుతూ సేవ చేయ్! లేదంటే జరిమాన: ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు
Smile Or Get Fined: ఫిలిప్పీన్స్ మేయర్ స్థానిక ప్రభుత్వం అందించే సేవల స్థాయిని మెరుగుపరిచే నిమిత్తం ఒక సరికొత్త పాలసీని తీసుకు వచ్చాడు. ఫిలిప్పీన్స్ ప్రధాన ద్వీపం లుజోన్‌లో క్యూజోన్ ప్రావిన్స్‌లోని ములానే పట్టణంలో అరిస్టాటిల్ అగ్యురే కొత్త మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అధికారం చేపట్టిన వెంటనే స్మైల్ పాలసీ అనే కొత్త పాలసీని ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేస్తూనే ప్రశాంతంగా, స్నేహపూర్వక వాతావరణంలో వారి సమస్యలను విని సాయం అందించేలా చిత్తశుద్ధితో పనిచేసేందుకు ఈ స్మైల్ పాలసీ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానికులు, ఎక్కువగా కొబ్బరి వ్యాపారులు, మత్స్యకారులు తమ పన్నులు చెల్లించడానికి లేదా సహాయం కోరడానికి వెళ్ళినప్పుడు టౌన్ హాల్ సిబ్బంది తమతో అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ ...ఫిర్యాదులు రావడంతోనే ప్రతిస్పందనగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అగ్యురే తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల వైఖరి మార్చేందుకే ఈ పాలసీని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ పాలసీని పాటించని ఉద్యోగులకు ఆరు నెలల జీతానికి సరిపడా మొత్తం జరిమానగా విధించబడటం లేదా విధుల నుంచి తొలగించడం వంటివి జరుగుతాయని స్పష్టం చేశారు. అగ్యురే ఎన్నికలలో పోటీ చేయడానికి ముందు ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌గా పనిచేశారు. ఈ మేరకు అగ్యురే మాట్లాడుతూ... వ్యాపార అనుకూలమైన మున్సిపాలిటీగా ఉండేందుకే ఈ పాలసీని తీసుకువచ్చాం. తమ ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనలు పాటిస్తారనే విశ్వసిస్తున్నానని చెప్పారు. (చదవండి: అగ్నిపర్వతం వద్ద సెల్ఫీ తీసుకోబోయి... అందులోనే పడిపోయాడు ఆ తర్వాత...) -
ఖాకీలకూ నో ఎంట్రీ!
సాక్షి, సత్తెనపల్లి : ఎన్నికల విధుల్లో పబ్లిక్ సర్వెంట్ అనే పదానికి సాధారణ అర్థం పోలీస్ అధికారి అని కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. యూనిఫామ్‌లో ఉన్నా .. లేకున్నా పోలీసులు తమ విధుల్లో భాగంగానైనా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకూడదని సూచించింది. అవసరమైన పక్షంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎన్నికల అధికారి పిలిస్తే తప్ప ఏ ప్రత్యేక కారణం లేకుండా పోలీసులకు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి అనుమతి లేదు. పోటీ చేసే అభ్యర్థి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా ఆయన ఒక్కరే లోపలికి వెళ్లాలి. భద్రతా సిబ్బంది మాత్రం ద్వారం బయటే ఆగాలి. ఎన్నికల విధులలో ఉన్న సిబ్బందికి ఇబ్బంది కలిగించే ఏ పని ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, స్పీకర్ కానీ, వారి అనుచరులు కానీ చేయరాదు. పోటీల్లో ఉన్న అభ్యర్థికి జెడ్‌ప్లస్ క్యాటగిరి రక్షణ ఉన్నా.. వారి వెంట వచ్చే సిబ్బందిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించరు. మఫ్టిలో ఉన్న భద్రతా సిబ్బందిలో ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల క్యాబినెట్ మంత్రులు, ఉప మంత్రులకు భద్రతా సిబ్బంది ఉంటారు. వారు కూడా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లకూడదు. పోలింగ్ సిబ్బంది రాజకీయ నాయకులు, మంత్రుల మాటలను పట్టించుకోకూడదు. సిబ్బంది ఎన్నికల సంఘం ఆదేశాలను మాత్రమే అమలు చేయాలి. ఎన్నికల సంఘం ఆజ్ఞాపత్రం ఉంటేనే పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలి. పదవుల్లో ఉన్న వారు, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రవర్తించినా, మాటలు, సైగలు చేసినా అది నేరం గానే పరిగణిస్తారు. వెబ్‌కాస్టింగ్‌తో పారదర్శకత ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ విధానాన్ని అములు చేయనున్నారు. నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తుంటారు. దీని ద్వారా ప్రతి క్షణం ఓటింగ్ ప్రక్రియ..అవాంఛనీయ ఘటన వివరాలను నేరుగా తెలుసుకునే వీలుంటుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచే పోలింగ్ ప్రక్రియను వీక్షించే సౌకర్యం ఉంటుంది. పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిపించడమే దీని లక్ష్యం. -
పని జరగాలంటే.. చేయి తడపాల్సిందేనా..!
చేవెళ్ల: ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజాసేవకులు.. నెలనెలా వేతనం తీసుకుంటూ విధులు నిర్వర్తించాలి. కాని నేడు కొందరు అధికారులు అక్రమ సంపాదన వైపు మొగ్గు చూపుతున్నారు. తమ పనిని తాము చేసేందుకు లంచాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో తరచూ ఏసీబీ వలకు చిక్కుతున్నారు. కాగా ‘దొరికినోడే దొంగ’ అన్న చందంగా ఉంది. అవినీతికి పాల్పడుతూ తప్పించుకుంటున్నవాళ్లు చాలామంది ఉన్నారు. అంకితభావంతో ఉద్యోగాలు చేసేవారూ లేకపోలేదు. ప్రజల్లో చైతన్యం పెరిగినప్పుడే అవినీతిని పూర్తిస్థాయిలో నిర్మూలించే అవకాశం ఉంది. లంచం తీసుకోవడం ఎంత నేరమో.. ఇవ్వడమూ అంతే తప్పు. ఇటీవల మంచాల వ్యవసాయ అధికారి లావణ్య ఓ ఫర్టిలైజర్ లెసైన్స్ కోసం ఓ యువకుడి నుంచి డబ్బులు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కిపోయిన విషయం తెలిసిందే. జిల్లాలో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేపలు.. * 2009లో మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సురేందర్‌రెడ్డి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. * 2011లో మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ శుక్లకుమార్ లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుకున్నారు. * 2012లో అప్పటి శంకర్పల్లి గ్రామ పంచాయతీ ఈఓ ఓ పని నిమిత్తం రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. * 2012 ఫిబ్రవరి 16న చేవెళ్ల ప్రొబేషనరీ డీఎస్పీ గుణశేఖర్ ఓ భూవివాదం పరిష్కారిస్తానని ఓ వ్యక్తి నుంచి రూ. 25 వేలు తీసుకుంటుండగా ఏసీబీ వలకు చిక్కారు. అప్పట్లో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. * 2013 జనవరి 30న చేవెళ్ల హెడ్‌కానిస్టేబుల్ నాగేందర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి దొరికాడు. దీంట్లో సీఐ శ్రీనివాస్ హస్తం ఉందనే ఆరోపణలతో అధికారులు ఆయనపై కూడా కేసు నమోదు చేసి అప్పట్లో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. * చేవెళ్ల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ కురుమానాయక్, కానిస్టేబుల్ నర్సింలు కల్లు దుకాణం యజమాని నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. * కుల్కచర్ల ఇన్చార్జి ఎంపీడీఓ పండరీనాథ్ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ అవినీతి అధికారులకు పట్టుబడ్డారు. * 2013లో గండేడ్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఏసీబీ అధికారులకు చిక్కారు. గతంలో గండేడ్ తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ శీనప్ప ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. * పంచాయతీ రాజ్ ఏఈఈ వేణుగోపాల్‌రెడ్డి లంచం కేసులో అవినీతి అధికారులు పట్టుకున్నారు * గండేడ్ పీహెచ్సీ కార్యదర్శి గోపాల్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. * తాజాగా ఈనెల 5న మంచాల ఏఓ (అగ్రికల్చర్ ఆఫీసర్) లావణ్య ఓ ఫర్టిలైజర్ దుకాణం లెసైన్స్ విషయంలో రూ. 2 వేలు ఓ వ్యక్తి నుం చి తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అవినీతిపరుల భరతంపట్టండి.. ప్రభుత్వ అధికారులు వేతనం తీసుకుంటున్నారు. పనిచేయడం వారి బాధ్యత. పనికోసం లంచాలి వాల్సిన అవసరం లేదు. అవినీతి పరుల భరతం పట్టాలంటే జిల్లా ఏసీబీ అధికారికి 9440446140 నంబర్లో ఫిర్యాదు చేయవచ్చు. అధికారులు వలపన్ని వారిని పట్టుకుంటారు. -
పోలీసులు ప్రజాసేవకులు
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: ఒకప్పుడు మీరంతా ప్రజల్లో ఒకరని, ఇప్పుడు మాత్రం ప్రజా సేవకులన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అడిషనల్ డీజీపీ ఎన్.వి.సురేంద్రబాబు శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు సూచించారు. శ్రీకాకుళం రూరల్ మండలం తండ్యాంవలసలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న 243 మంది కానిస్టేబుళ్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో గౌరవంతో కూడుకున్నదన్నారు. ప్రజల్లో గౌరవాన్ని తెచ్చిపెట్టే ఈ ఉద్యోగం సంపాదించడం అదృష్టంగా భావిం చాలన్నారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ముందుగా పోలీసుల వద్దకే వస్తారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యలను పరిష్కరించేందుకు సంసిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. నీతి నిజాయితీలతో ఉద్యోగం చేయడం ద్వారా ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకం కలుగుతోందన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడకూడదని, ఉన్నత విద్యనభ్యసించినవారు ఇంకా మెరుగైన ఉద్యోగాలకు ప్రయత్నించాలన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్ల నైపుణ్యాన్ని పరిశీ లించి సంతృప్తి వ్యక్తం చేశారు. కానిస్టేబుళ్లకు అందజేస్తున్న శిక్షణపై ప్రిన్సిపాల్ సెంథిల్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శిక్షణ కేంద్రం పరిసర ప్రాంతాలను, మెస్ నిర్వహణను పరిశీలించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, ఆర్ఐ టి.రమేష్, సీఐలు డి.మోహనరావు, ఎన్.సాయి, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు. మెరైన్ స్టేషన్ సందర్శన గార : కళింగపట్నం మెరైన్ స్టేషన్‌ను అడిషనల్ డీజీపీ సురేంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా బోట్ల పరిస్థితులపై సంబంధిత సిబ్బంది నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. డీజిల్ ఎంత ఖర్చువుతోంది, సముద్రంలోకి ఎలా తీసుకెళ్తున్నారు తదితర వివరాలపై ఆరా తీశారు. సిబ్బంది సౌకర్యాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ, డీఎస్పీ శ్రీనివాసరావు, మెరైన్ సీఐ పూరేటి నారాయణరావు పాల్గొన్నారు.