మనీలా: భూకంపాలకు నిలయంగా మారిన ఫిలిప్పీన్స్‌లో బుధవారం తెల్లవారు జామున మరోమారు భూమి కంపించింది. ఈసారి భారీ స్థాయిలో రిక్టార్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఉదయం 8.43 గంటల ప్రాంతంలో లుజోన్ ద్వీపంలోని ఆబ్రా ప్రావిన్స్‌ను భూకంపం తాకినట్లు పేర్కొంది. మనీలాకు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఎత్తైన భవనాలు కుదుపులకు లోనయ్యాయి. కొన్ని భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ప్రజలు భయంతో బయటకు పరుగులు పెటుడుతున్న భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇద్దరు మృతి..
భూకంప కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలోని డోలోర్స్‌లో ప్రజలు భయంతో పరుగులు పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ‘ఈ భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంది. పోలీస్ స్టేషన్ భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ’ అని పోలీస్ మేజర్ ఎడ్విన్ సెర్జియో తెలిపారు. తొలుత ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అంచనా వేసినా.. పలు భవనాలు, చర్చీలు కూలిన ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు మీడియా పేర్కొంది.
ప్రతి ఏడాది సుమారు 20కిపైగా తుపాన్లు ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేస్తుంటాయి. ప్రపంచంలోనే అంత్యత విపత్తు ప్రాంతంగా నిలుస్తోంది ఈ దేశం. 1990లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించగా.. 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ ఇప్పుడు 7కుపైగా తీవ్రత నమోదవటం వల్ల ప్రజల్లో ఆందోళన నెలకొంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు.
🚨#BREAKING: A Powerful magnitude 7.3 earthquake has hit the Philippines,
📌#Philippines l #Asia
A magnitude 7.3 earthquake has hit the Philippines, with reports of significant damage has occurred. As It was felt strongly in metro Manila, and all buildings have been evacuated. pic.twitter.com/G6SqC1akFq
— R A W S A L E R T S (@rawsalerts) July 27, 2022
ఇదీ చదవండి: విమాన భోజనంలో బయటపడిన పాము తల.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment