ఫిలీప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటర్ట్ (ఫైల్ ఫోటో)
దావా : ఆడ, మగ తేడా లేకుండా అందరికి సమ న్యాయం కల్పించాల్సిన నాయకులే ఆడవారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. తప్పు చేసిన వారిని శిక్షించలేని సమాజం తన మాటలు, చేతలతో బాధితులనే మరింత ఇబ్బంది పెడుతోంది. అత్యాచారాలను నిరోధించలేని నాయకులు చిత్రంగా ఆడవారిదే తప్పంటూ మహిళల మీదే రాళ్లు వేస్తుంటారు. ఇలా నోటికి అడ్డు, అదుపు లేకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిలో ముందుంటారు ఫిలీప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటర్ట్. తాజాగా ఈయన గారు మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి వివాదాస్పద ‘జోక్’ చేసి విమర్శల పాలవుతున్నారు.
దావోలో ఓ కార్యక్రమానికి హాజరైన డ్యూటర్ట్ ‘అందమైన మహిళలు ఉన్నంత కాలం అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయంటూ’ పనికిమాలిన జోక్ చేశారు. అంతటితో ఆగకుండా మరికొన్ని నీతి మాలిన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ దేశ మహిళా సంఘాలతో పాటు పాశ్చత్య మీడియా కూడా డ్యూటర్ట్ మీద దుమ్మేత్తిపోస్తున్నాయి. డ్యూటర్ట్ గురించి తెలిసిన ఫిలీప్పీన్స్ మహిళలు ‘దేవున్నే ఇడియట్ అన్న వాడు మహిళల గురించి ఇంత కన్నా బాగా ఎలా మాట్లాడగలడు. డ్యూటర్ట్ ఓ పిచ్చివాడు.. అతని మాటాలను పరిగణలోకి తీసుకుంటే మన స్థాయి పడిపోతుంది’ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment