contraversial coments
-
పీడీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లో భారతీయులు ఎవరైనా భూములు కొనుగోలు చేసేలా పలు చట్టాలను సవరించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే పీడీపీ నేత బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భూ చట్టాల్లో మార్పుల నేపథ్యంలో దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి భారతీయులు ఇక్కడ స్ధిరపడేందుకు వస్తే లైంగిక దాడులు పెరిగిపోతాయని పీడీపీ నేత, ఆ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీకి సన్నిహితులు సురీందర్ చౌధరి వ్యాఖ్యానించడం కలకలం రేపింది. జమ్ముకు ఘనమైన డోగ్రా సంస్కృతి వారసత్వం ఉందని, తాము దేశం కోసం విలువైన త్యాగాలు చేశామని ఆయన చెప్పుకొచ్చారు. వారు (ఇతర ప్రాంతాల వారు) ఇక్కడికి రాగానే లైంగిక దాడుల వంటి నేరాలు అధికమవుతాయనే తాము చెప్పడం లేదని, తాము అస్సాం, మహారాష్ట్ర వాదననూ వినిపిస్తున్నామని..బయటి వారు ఇక్కడికి వస్తే తమ ఉద్యోగాలు పోతాయని చౌధరి పేర్కొన్నారు. ప్రస్తుతం జమ్ము ప్రాంతం ప్రశాంతంగా ఉందని, పలు గ్రామాల నుంచి మహిళలు చదువుకునేందుకు జమ్ముకు వచ్చారని చెప్పుకొచ్చారు. ఫరీదాబాద్‌లో ఓ బాలికను కాల్చి చంపారు..హథ్రాస్‌లో ఏం జరిగిందో చూశామని వ్యాఖ్యానించారు. లైంగిక దాడుల కేసులు పెరుగుతున్నాయి...ఇవన్నీ జాతీయ మీడియాలో చూపుతున్నారని అన్నారు. కాగా, జమ్ము కశ్మీర్లో అభివృద్ధికి ద్వారాలు తెరిచేలా దేశంలో ఎవరైనా ఇక్కడ భూములు కొనుగోలు చేసేలా చట్ట సవరణలు చేపట్టడం స్వాగతించదగిన పరిణామమని బీజేపీ వ్యాఖ్యానించింది. చదవండి : ఇకపై కశ్మీర్లో భూములు కొనొచ్చు.. -
బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో : దేశమంతా కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వేళ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ శాసనసభ్యుడు సురేష్ తివారి మంగళవారం ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలెవ్వరూ కూడా ముస్లింల వద్ద కురగాయాలు, ఎలాంటి వస్తువలు గానీ కొనుగోలు చేయవద్దని అన్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తించడానికి కారణం కూడా ముస్లింలేనని ఆరోపణలు చేశారు. కరోనా వ్యాప్తికి ఢిల్లీలో నిర్వహించిన మత ప్రార్థనలే కారణమని వివాదాస్పద రీతిలో వ్యాఖ్యానించారు. (లాక్డౌన్: రోడ్డుపై బైఠాయించిన ఎంపీ) సురేష్ తివారి వ్యాఖ్యలపై ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార పార్టీ ఎమ్మెల్యే మత వివక్ష చూపడం సరికాదని, ఆయన వ్యాఖ్యలను ఖండించింది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఎమ్మెల్యే దేశ ద్రోహ కేసు నమోదు చేయాలని ఎస్పీ అధికార ప్రతినిధి అనురాగ్ బంధుప్రియా డిమాండ్ చేశారు. ప్రస్తుత సమయంలో ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. -
మోదీపై ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు
కరాచీ : భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. నరేంద్ర మోదీ ప్రధాని పదవిలో ఉన్నంత కాలం భారత్- పాక్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరగవంటూ పేర్కొన్నాడు. అంతేకాదు 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆఫ్రిది మాట్లాడుతూ.. ' భారత్, పాక్‌ల మధ్య మంచి సంబంధాలు లేకపోవడానికి ఒకే ఒక వ్యక్తి కారణం. ఆయనే భారతదేశ ప్రధాని మోదీ. ఆయన అధికారంలో ఉన్నంత వరకు భారత్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాదు. అసలు మోదీ ఎజెండా ఏమిటో, ఆయన ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. సరిహద్దులకు రెండు వైపులా ఉన్న ప్రజలు ఒకరి దేశంలోకి ఒకరు ప్రయాణించాలని చూస్తున్నారు. కానీ మోదీ ఆలోచనలు మాత్రం తిరోగమనాన్ని సూచిస్తున్నాయి' అంటూ తెలిపాడు. (‘భారత్-పాక్ సిరీస్ యాషెస్ కంటే గొప్పది’) కాగా భారత జట్టు చివరిసారిగా రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో 2006లో పాక్‌లో పర్యటించింది. అయితే 2008లో 26/11 ముంబై దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడంతో అప్పటినుంచి టీమిండియా పాక్ గడ్డపై అడుగు పెట్టలేదు. ఐసీసీ వేదికగా జరిగిన టోర్నమెంట్లలో తప్ప భారత్- పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగలేదు. చివరిసారి 2008లో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్ జరిగితే.. 2013 నుంచి ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.. (ట్రంప్‌పై పీటర్సన్, ఐసీసీ సెటైర్) -
మీ దుస్తులు ధరించే వారంతా బాధపడుతున్నట్లేనా?
ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతిగా అలంకరించుకునే మహిళలు అంతరంగంలో ఎంతో వేదన అనుభవిస్తుంటారని ఓ పోస్ట్ చేశారు. దీని పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి 19వ శతాబ్దం నాటి పనికిమాలిన సూక్తులు చెప్పకండి.. అప్పటి వారికి మహిళలను అర్థం చేసుకునేంత బుర్ర లేదు.. ఇది 21వ శతాబ్దం. మీ కస్టమర్లలో ఎక్కువగా ఉంది మహిళలే ఆ విషయం గుర్తు పెట్టుకొండి అంటూ మండి పడుతున్నారు. ఇంతకు ఆ పోస్ట్‌లో ఏం ఉందంటే.. ఏ మహిళైనా అతిగా అలంకరించుకుని ఉందంటే.. ఆమె గాయపడినట్లు. లోలోన ఆమె మౌనంగా చాలా బాధపడుతుంది. కానీ ప్రపంచం దృష్టిలో తన గౌరవాన్ని, మర్యాదను కాపాడుకోవడం కోసం ఇలాంటి మెరుపులను ధరిస్తుంది. కానీ ఆమె అంతరంగం ఎంతో చీకటిగా, బాధతో నిండి ఉంటుంది. అలాంటి వారిని గమనిస్తే.. మీ విలువైన సమయంలో కొంత ఆమె కోసం కేటాయించండి.. మీ ప్రేమతో వారిని ఓదార్చండి.. ఎందుకంటే కొన్నిసార్లు స్పర్శకు మించింది ఏమి లేదు’ అంటూ సబ్యసాచి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీన్ని సమర్థిస్తూ.. ఓ ప్రఖ్యాత రచయిత లైన్స్‌ను కూడా కోట్ చేశారు. View this post on Instagram #Sabyasachi #ParadiseLost #SabyasachiJewelry #TheWorldOfSabyasachi @sabyasachijewelry A post shared by Sabyasachi Mukherjee (@sabyasachiofficial) on Jul 5, 2019 at 8:10am PDT అయితే ఈ పోస్ట్ పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడంబరమైన దుస్తులు, నగలు డిజైన్ చేసే మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. మీ దుస్తులు ధరించే వారంతా బాధపడుతున్నట్లేనా అని ప్రశ్నిస్తున్నారు. మీ దుస్తులు అమ్మకాల కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్‌ను ప్లే చేయకండి అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. -
‘నా కులం అభివృద్ధే నాకు ముఖ్యం’
జైపూర్ : రాజస్తాన్‌లో నూతన ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా పూర్తికాలేదు. కానీ ఈ లోపే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పనులు ప్రారంభించారు మంత్రులు. రాజస్తాన్ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేస్తోన్న మమతా భూపేష్ ‘నా కులం అభివృద్ధే నాకు ముఖ్యం.. మిగతావన్ని తర్వత’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్వార్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మమతా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నా సామాజిక వర్గ ప్రజల అభివృద్ధే నా ప్రథమ బాధ్యత. ముందు నా కులం ప్రజల అభివృద్ధి గురించి ఆలోచిస్తా.. ఆ తరువాతే మిగతా వారి గురించి పని చేస్తా’ అంటూ ప్రసంగించారు. మమతా చేసిన వ్యాఖ్యలు కొత్త ప్రభుత్వాన్ని ఇరుకున పడేశాయి. -
అతనో పిచ్చివాడు.. పట్టించుకోవద్దు
దావా : ఆడ, మగ తేడా లేకుండా అందరికి సమ న్యాయం కల్పించాల్సిన నాయకులే ఆడవారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. తప్పు చేసిన వారిని శిక్షించలేని సమాజం తన మాటలు, చేతలతో బాధితులనే మరింత ఇబ్బంది పెడుతోంది. అత్యాచారాలను నిరోధించలేని నాయకులు చిత్రంగా ఆడవారిదే తప్పంటూ మహిళల మీదే రాళ్లు వేస్తుంటారు. ఇలా నోటికి అడ్డు, అదుపు లేకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిలో ముందుంటారు ఫిలీప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటర్ట్. తాజాగా ఈయన గారు మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి వివాదాస్పద ‘జోక్’ చేసి విమర్శల పాలవుతున్నారు. దావోలో ఓ కార్యక్రమానికి హాజరైన డ్యూటర్ట్ ‘అందమైన మహిళలు ఉన్నంత కాలం అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయంటూ’ పనికిమాలిన జోక్ చేశారు. అంతటితో ఆగకుండా మరికొన్ని నీతి మాలిన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ దేశ మహిళా సంఘాలతో పాటు పాశ్చత్య మీడియా కూడా డ్యూటర్ట్ మీద దుమ్మేత్తిపోస్తున్నాయి. డ్యూటర్ట్ గురించి తెలిసిన ఫిలీప్పీన్స్ మహిళలు ‘దేవున్నే ఇడియట్ అన్న వాడు మహిళల గురించి ఇంత కన్నా బాగా ఎలా మాట్లాడగలడు. డ్యూటర్ట్ ఓ పిచ్చివాడు.. అతని మాటాలను పరిగణలోకి తీసుకుంటే మన స్థాయి పడిపోతుంది’ అంటున్నారు. -
వారికన్నా వ్యభిచారులు నయం
- జేఎన్ యూ విద్యార్థినులను ఉద్దేశించి హర్యానా సీఎం ఓఎస్డీ తీవ్ర వ్యాఖ్యలు గుర్గావ్: పార్లమెంట్ పై దాడి కేసులో ఉరిశిక్ష అమలైన కశ్మీరీ ప్రొఫెసర్ అఫ్ఝల్ గురు సస్మరణ సభతో మొదలైన రాజకీయ కాష్టం అంతకంతకూ పెద్దదవుతోంది. ఆరోపణా ప్రత్యారోపణల పర్వం శృతిమించుతోంది. విద్యార్థి నాయకులపై దేశద్రోహం కేసు పెట్టడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థినులను ఉద్దేశించి హర్యానా సీఎంకు ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న జవహర్ యాదవ్.. శనివారం ట్విట్టర్ లో తీవ్రవ్యాఖ్యలు చేశారు. 'ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీ(జేఎన్ యూ)లో అఫ్జల్ గురు సంస్మరణ సభ నిర్వహించడమేకాక, ఆ చర్యను సమర్థించుకుంటూ అక్కడి విద్యార్థినులు ఆందోళన నిర్వహిస్తుండటం సిగ్గుచేటు. దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న ఆ విద్యార్థినుల కన్నా వ్యభిచారిణులు నయం. రెండోవాళ్లు కేవలం ఒళ్లమ్ముకుంటారు. దేశాన్ని కాదు' అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జవహర్ యాదవ్. గతంలో బీజేపీ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేచేసిన జవహర్ యాదవ్.. ప్రస్తుతం ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ కు ప్రత్యేక అధికారి(ఓఎస్డీ)గా వ్యవహరిస్తున్నారు.