‘నా కులం అభివృద్ధే నాకు ముఖ్యం’ | Rajasthan Minister Says Caste First Society Later | Sakshi
Sakshi News home page

‘నా కులం అభివృద్ధే నాకు ముఖ్యం’

Published Tue, Jan 1 2019 5:18 PM | Last Updated on Tue, Jan 1 2019 5:18 PM

Rajasthan Minister Says Caste First Society Later - Sakshi

జైపూర్‌ : రాజస్తాన్‌లో నూతన ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా పూర్తికాలేదు. కానీ ఈ లోపే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పనులు ప్రారంభించారు మంత్రులు. రాజస్తాన్‌ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేస్తోన్న మమతా భూపేష్‌ ‘నా కులం అభివృద్ధే నాకు ముఖ్యం.. మిగతావన్ని తర్వత’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్వార్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మమతా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నా సామాజిక వర్గ ప్రజల అభివృద్ధే నా ప్రథమ బాధ్యత. ముందు నా కులం ప్రజల అభివృద్ధి గురించి ఆలోచిస్తా.. ఆ తరువాతే మిగతా వారి గురించి పని చేస్తా’ అంటూ ప్రసంగించారు. మమతా చేసిన వ్యాఖ్యలు కొత్త ప్రభుత్వాన్ని ఇరుకున పడేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement