అసెంబ్లీలో స్టార్‌ హీరోయిన్‌పై నోరు పారేసుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే | Congress MLA Tikaram Jully Sparks Controversy with Remarks on Madhuri Dixit | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో నోరు పారేసుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే.. హీరోయిన్‌ సెకండ్‌ గ్రేడ్‌ యాక్టర్‌ అంటూ

Published Thu, Mar 13 2025 7:46 PM | Last Updated on Thu, Mar 13 2025 8:07 PM

Congress MLA Tikaram Jully Sparks Controversy with Remarks on Madhuri Dixit

జైపూర్‌ : అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నోరు పారేసుకున్నారు. రాష్ట్రంలో సెకండ్‌ గ్రేడ్‌ యాక్టర్‌ బాలీవుడ్‌ నటి మాధురి దీక్షిత్‌ (madhuri dixit) ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. సెకండ్‌ గ్రేడ్‌ యాక్టర్లు తప్ప మీకు ఇంకెవరి ఫొటోలు దొరకలేదా? షారుఖ్‌ ఖాన్‌ తప్ప మిగిలిన నటులంతా ఆ కోవకే చెందుతారంటూ తన నోటికి పనిచెప్పారు. ప్రస్తుతం సదరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.

రాజస్థాన్‌ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌.. రాష్ట్రంలో జరిగిన ఐఫా అవార్డ్‌ల ఫంక్షన్‌పై బీజేపీ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించింది.

ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టికారం జుల్లీ (Congress MLA Tikaram Jully) అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఐఫా (IIFA Awards 2025) ఉత్సవాల్ని నిర్వహించింది. ఐఫా పేరిట దేనికి ఎంతెంత? ఖర్చు పెట్టారో లెక్కలు బయటకు తీయాలి. మీరు ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు రాష్ట్రాన్ని ప్రమోట్‌ చేస్తున్నట్లుగా లేదు. ఐఫాను ప్రమోట్‌ చేస్తునట్లుంది.

ఐఫా వల్ల రాష్ట్రానికి ఏ ఒరిగింది? ఈ కార్యక్రమానికి వచ్చిన సినీ ప్రముఖులు టూరిస్ట్‌ ప్రాంతాల్ని సందర్శించారా? సినీ ఇండస్ట్రీ నుంచి ఐఫా కార్యక్రమానికి వచ్చిన స్టార్లు ఎవరు? నాకు తెలిసి షారుఖ్‌ఖాన్‌ మినహా మిగిలిన వాళ్లందరూ సెకండ్‌ గ్రేడ్‌ యాక్టర్లే. ఫస్ట్‌ గ్రేడ్‌ యాక్టర్లు ఈ కార్యక్రమానికి వచ్చినట్లు లేదే? అని వ్యాఖ్యానించారు.

దీంతో ఎమ్మెల్యే టికారం జుల్లీ వ్యాఖ్యల్ని అధికార బీజేపీ ఎమ్మెల్యేలు ఖండించారు. ప్రతి స్పందనగా.. అవును మాధిరి దీక్షిత్‌ ఇప్పుడు సెకండ్‌ గ్రేడ్‌ యాక్టర్‌. నాటి దిల్‌, బేటా సినిమాలకు మాత్రమే ఆమె స్టార్‌. ఆమె ఎరా ఎప్పుడో ముగిసింది’అని తాను చేసిన వ్యాఖ్యల్ని సమర్ధించుకున్నారు.

కొద్ది రోజుల క్రితం ఇదే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మహిళా నేత షామా మొహమ్మద్‌ (shama mohamed) ఎక్స్‌ వేదికగా చేసిన ట్వీట్‌ రాజకీయ దుమారం రేపింది. షామా తన ట్వీట్‌లో రోహిత్‌ శర్మ (rohit sharma)  ఫిట్‌గా లేడు! బరువు తగ్గాలి. భారత క్రికెట్‌ జట్టులో గత సారథులతో పోల్చితే ఆకట్టుకోని కెప్టెన్‌ అతడే’ అని రాసుకొచ్చింది. ఆమె చేసిన ట్వీట్‌పై పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది.

భారతీయులు రోహిత్‌ శర్మకు మద్దతు పలుకుతూ షామాపై విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలు తట్టుకోలేక దెబ్బకు దిగొచ్చారు. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత జట్టును విజయపథం వైపు నడిపించారంటూ రోహిత్‌ శర్మపై ప్రశంసల వర్షం కురిపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement