Madhuri Dikshit
-
OTT: ఓటీటీలో భయపెడుతూ నవ్విస్తున్న సినిమా!
సాధారణంగా సినిమాలలో ఓ రెండిటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకటి హ్యుమర్ అయితే మరోటి హారర్. కాని ఆ రెండూ కలిపి సినిమా తీస్తే అదే ఈ సినిమా భూల్ భులయ్యా3. ఇది భూల్ భులయ్యా(Bhool Bhulaiyaa 3) సిరీస్ లో వచ్చిన మూడవ సినిమా. నిజానికి మొదటి భాగానికి మిగతా రెండు భాగాలకి కథతో పాటు పాత్రధారులలో కూడా తేడా ఉంది. భూల్ భులయ్యా మొదటి భాగం చంద్రముఖి సినిమా ఆధారంగా తీసింది. కాని మిగతా రెండు భాగాలు మాత్రం అదే థీమ్ తో కాస్త విభిన్నంగా రూపొందించారు. ఇప్పుడు భూల్ భులయ్యా 3(Bhool Bhulaiyaa-3) సినిమా కథ విషయానికొస్తే 200 సంవత్సరాల క్రితం రక్తఘాట్ రాజ్యంలో జరిగిన కథ. అప్పటి రాజ కుటుంబం వల్ల జరిగిన సంఘటనలో మంజులిక అనే ఓ దెయ్యం తయారవుతుంది. ఈ దేయ్యాన్ని అదే రాజ్యంలోని అంతఃపుర గదిలో భద్రంగా భద్రపరుస్తారు ఆ రాజ్యానికి చెందిన రాజగురువు. 2024 సంవత్సరంలో వారసత్వ సంపదగా ఆ అంతఃపురాన్ని ఓ హోటల్ గా మార్చాలని రాజకుటుంబం వారసులు ప్రయత్నించగా బందీగా ఉన్న మంజులిక దెయ్యం బయటపడి వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ విషయం చూసే ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిస్తాయి. మరి ఈ మంజులికను కట్టడి చేయడానికి ఫేక్ మాంత్రికుడైన రూహాన్ ను ఆ రాజ్యానికి తెప్పించుకుంటారు. రూహాన్ రక్తఘాట్ కు వచ్చినప్పటి నుండి కథ అనేక మలుపులు తిరగుతూ ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ తో ముగుస్తుంది. ఈ సినిమా లో ముఖ్యంగా ముగ్గురి గురించి చెప్పుకోవాలి. అందులో మొదటగా హీరో రోల్ వేసిన రోహాన్. తన ఈజ్ ఆఫ్ యాక్టింగ్ తో హారర్ ఎమోషన్ ని కూడా హ్యుమర్ ఎమోషన్ తో చక్కగా నటించాడు. ఇక విశేష పాత్రలలో నటించిన నాటి తార మాధురీ దీక్షిత్, నేటి వర్ధమాన తార విద్యాబాలన్ వారి నటనతోనే కాదు అద్భుత నాట్యంతో కూడా సినిమాని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు. దర్శకుడు అనీస్ ఈ సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా ఓ పక్క భయపెడుతూ మరో పక్క గిలిగింతలు పెడుతూ ప్రేక్షకులను కదలినివ్వకుండా స్క్రీన్ ప్లే నడిపాడు. నెట్ ఫ్లిక్స్ ఓటిటి వేదికగా స్ట్రీమ్ అవుతున్నఈ భూల్ భులయ్యా వీకెండ్ వాచబుల్ మువీ. - ఇంటూరు హరికృష్ణ. -
అల్లు అర్జున్‌కు నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ విషెస్.. దేనికంటే ?
కరోనా కల్లోలంతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో థియేటర్లకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్‌లు మారిన సంగతి తెలిసిందే. ఈ ఓటీటీ ప్లాట్ఫ్లామ్లలో ప్రత్యేక కాన్సెప్ట్‌లతో సినిమాలు రూపొందిస్తోంది నెట్‌ఫ్లిక్స్. సినిమాలతోపాటు విభిన్న జోనర్లో వెబ్ సిరీస్‌లు తెరకెక్కిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ దిగ్గజ సంస్థ స్టైలిష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు స్పెషల్ శుభాకాంక్షలు తెలిపింది. శుక్రవారం (ఏప్రిల్ 29) ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే అని తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేసింది. అంతేకాకుండా బన్నీతోపాటు మరో ముగ్గురు తారలకు ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పింది. బాలీవుడ్ సీనియర్ బ్యూటీఫుల్ మాధురి దీక్షిత్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, అల్లు అర్జున్, బీటౌన్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌కు స్పెషల్‌గా విష్ చేసింది నెట్‌ఫ్లిక్స్. చదవండి: రిలీజైన నెలలోనే అత్యధిక వ్యూస్ సాధించిన ఓటీటీ సిత్రాలు.. ఈ విషెస్‌తోపాటు ది ఫేమ్ గేమ్, మేర్సల్, అలా వైకుంఠపురములో, లక్ష్య చిత్రాల్లోని వారి డ్యాన్స్ స్టెప్పుల ఫొటోలను షేర్ చేసింది. ఈ పోస్ట్ చేస్తూ 'ప్రతి ఒక్కరీకీ హ్యాపీ ఇంటర్నేషనల్డ్యాన్స్ డే. కానీ ప్రత్యేకంగా వీరికి..' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ సినిమాలన్ని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే మాధురి దీక్షిత్, విజయ్, బన్నీ, హృతిక్ రోషన్ డ్యాన్స్‌లో తమదైన ప్రత్యేకతను చాటిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల నెట్‌ఫ్లిక్స్ 3 నెలల్లో సుమారు 2 లక్షల సబ్‌స్క్రైబర్స్‌ను కోల్పోయింది. చదవండి: అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్‌లు.. Happy International Dance Day to everyone, but especially to them 💃🕺 pic.twitter.com/zOcVDtQNJZ — Netflix India (@NetflixIndia) April 29, 2022 -
మాధురితో ఏక్.. దో.. తీన్
మనిషిని కడిగేసే శానిటైజర్.. డ్యాన్స్. శుభ్రమైపోతాయి బాడీ అండ్ మైండ్.. డ్యాన్స్ చేసినా.. డ్యాన్స్ చూసినా! ‘తాం.. దిగిదిగి తాం.. దిగిదిగి.. తాం..’ ఇదొకటే కాదు డ్యాన్స్‌కి తాళం. మనసు ఉద్వేగాన్ని తెరిచే ప్రతిదీ! ‘సాగర సంగమం’లో ఇన్విటేషన్ చూసి కమల్‌హాసన్ మనసు నాట్యం చేస్తుంది. నేడూ రేపు మనతో డ్యాన్స్ చేయించడానికి అలాంటి ఇన్విటేషన్నే ఇస్తున్నారు మాధురీ దీక్షిత్. నిలువనివ్వనిదేదో డ్యాన్స్‌లో ఉంది. రక్తప్రసరణలా నృత్యప్రసరణ! మనిషిని నిటారుగా ఉండనివ్వదు. కొద్దిగా వచ్చినవాళ్లను కూడా క్రీస్తుపూర్వపు నృత్య పండితుడు భరతముని ఆవహించి ఆడించేస్తాడేమో! ‘సాగర సంగమం’లో కమల్‌హాసన్‌కి భరతనాట్యం వచ్చు. కూచిపూడి వచ్చు. కథాకళి వచ్చు. కథక్ కూడా కొంచెం వచ్చు. కొంచెంతో తృప్తిపడడు. దాహం. నృత్యదాహం. డబ్బులుండవు. గురువుగారికి సేవచేసి రుణం తీర్చుకుంటానని చెప్పి కథక్ క్లాసులకు ఎంట్రీని ఇప్పించుకుంటాడు. ఆ ఆనందంలో డాన్స్ చేస్తుంటాడు. ‘‘సరే పదా’’ అంటాడు శరత్‌బాబు వచ్చి. ‘నువ్వు వెళ్లు.. ’ అంటాడు.. చేత్తో ‘వెళ్లు’ అని అభినయిస్తూ. ‘‘సరే, అట్టాగే మణిపురి, భోజ్‌పురి, ఒడిస్సీ, అస్సాం, గుస్సాం, బుస్సాం.. అవి కూడా నేర్చుకో. దాంతోనే జీవితమంతా సరిపోతుంది. తొందరగా ఇంటికొచ్చి ఏడువ్’’ అనేసి తను వెళ్లిపోతాడు శరత్‌బాబు. డ్యాన్సే జీవితం అనుకున్నప్పుడు జీవితమంతా డాన్స్కే సరిపోవడం అంటూ ఏముంటుంది? అయితే కమల్ని గానీ, మాధురీ దీక్షిత్‌ని గానీ.. కోర్సు పూర్తయింది కదా.. అని వదిలేసి పోదు డ్యాన్స్. ఆడిస్తుంది. ఓ పెద్ద వేదిక మీద గిర్రున తిరిగి అలసి పడిపోయేంత వరకు. ‘‘అవునూ.. ప్రతి సంవత్సరం ఆలిండియా మ్యూజిక్ ఫెస్టివల్స్, డాన్స్ ఫెస్టివల్ జరుగుతాయంటారు.. అంత గొప్పగా ఉంటాయా?’’.. సాగర సంగమంలోనే.. జయప్రద అడుగుతుంది కమల్ని. ‘మరీ! చాలా విశేషం కదండీ. ఎక్కడెక్కడి నుంచో కళాకారులు, దేశదేశాల రాయబారులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఒక్కోసారి ప్రైమ్ మినిస్టర్ కూడానండీ. అంతమంది పెద్దవాళ్ల ఎదుట, తోటి కళాకారుల సమక్షంలో పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే జాతకంలో రాసి పెట్టి ఉండాలండీ’ అంటాడు. కనీసం ఆ ఫెస్టివల్స్‌ని చూసే భాగ్యం కూడా కలిగివుండదు కమల్‌కి తన లైఫ్‌లో. ఓసారెప్పుడో గురువుగారి దగ్గర్నుంచి ఒక్క ఇన్విటేషన్ సంపాదిస్తే, సరిగ్గా వెళ్లే టైమ్‌కి డబ్బుల్లేక ఆగిపోతాడు. జయప్రద అడిగితే అదే చెబుతాడు. ‘‘ఈసారి జరిగే డ్యాన్స్ ఫెస్టివల్‌కి నా దగ్గర కొన్ని ఇన్విటేషన్లు ఉన్నాయి. వెళతారా?’’ అని అడుగుతుంది జయప్రద. అతడా ఆశ్చర్యంలోంచి తేరుకోకముందే తన హ్యాండ్ బ్యాగులోంచి ఒక ఇన్విటేషన్ తీసి ఇస్తుంది. డాన్స్ చేసినంత పని చేస్తాడు కమల్. ఇన్విటేషన్ తీసుకుని ఒక్కో పేజీ తిప్పుతుంటాడు. లోపల అంతా ప్రపంచ ప్రసిద్ధ నాట్యకోవిదులు. యామినీ కృష్ణమూర్తి! ‘అమ్మోయ్’ అంటాడు. సోనాల్ మాన్సింగ్! ‘ఓహ్’ అంటాడు. జయప్రద కమల్ కళ్లలోకే చూస్తూ ఉంటుంది. గీతానాయర్! ‘ఆహా’ అంటాడు. గోపి కృష్ణ! ‘ఊప్..’ అంటాడు. అని, జయప్రద వైపు చూసి ‘ఈసారి అంతా పెద్దవాళ్లేనండీ’ అంటాడు. ఇంకో పేజీ తిప్పుతాడు. క్లాసికల్ డ్యాన్స్ రిసైటల్ బై.. శ్రీ బాలకృష్ణ అని ఉంటుంది!! ఆ బాలకృష్ణ కమల్‌హాసనే! జయప్రద వైపు చూస్తాడు. అతడి విస్మయాన్ని, అతడి ఉద్వేగాన్ని, కృతజ్ఞతను మోయలేని అతడి హృదయ భారాన్ని వ్యక్తీకరించే పనిని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా ఇళయరాజాకు అప్పగించారు కె.విశ్వనాథ్. ఆ సీన్లో కమల్‌లా మనం కూడా గడ్డకట్టుకుని పోతాం. జయప్రద కలవారి అమ్మాయి. ఆమె ప్రయత్నం వల్లనే కమల్‌కి అంతటి అవకాశం వస్తుంది. ముందే చెప్పదు. సర్ప్రైజ్ చెయ్యాలనుకుంటుంది. ఇన్విటేషన్లో డాన్స్ చేస్తున్న తన ఫొటో, తన పేరు చూస్తుంటాడు కమల్. ‘‘ఈయన కూడా చాలా పెద్ద డాన్సరే’’ అంటుంది జయప్రద ఇన్విటేషన్లో కమల్ని చూపిస్తూ. కమల్ ఏడ్చేస్తాడు. కమల్ కాదు. కమల్‌లోని డాన్సర్ ఏడ్చేస్తాడు. ఎంత పెద్ద లైఫ్ అచీవ్మెంట్.. కళాకారుడికి. మాధురీ దీక్షిత్ తొమ్మిదేళ్లకే కథక్ డాన్సర్. గురుపూర్ణిమ రోజు తొలి డాన్స్ ప్రదర్శన ఇచ్చింది. ‘దిస్ లిటిల్ గర్ల్ స్టోల్ ద షో’ అని ముంబైలో ఓ పత్రిక రాసింది. ఆ రోజంతా చంద్రమండలం మీదే ఉంది మాధురి. సినిమా స్టార్ కాకపోయుంటే ఆమె డ్యాన్సర్ గానీ, మైక్రోబయాలజిస్ట్ గానీ అయి ఉండేది. సినిమాలొచ్చి క్లాస్‌లోంచి మధ్యలోనే ఆమెను తీసుకెళ్లిపోయాయి. మైక్రోబయాలజిస్ట్ అయి ఉంటే మాధురి ఇప్పుడు కరోనా వైరస్‌కు వాక్సిన్ కనిపెట్టే టీమ్‌లో ఉండేవారేమో! అప్పుడూ ఆమెను డ్యాన్స్ వదలకపోయేది. డ్యాన్స్‌లో ఉన్న గొప్పతనం అది. వదిలిపెట్టదు. ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఈరోజు. లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి.. ఆన్లైన్లో డాన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు మాధురీ.. ఈరోజు, రేపు. తన ఫస్ట్ లవ్ కథక్‌తో పాటు.. ‘ఏక్ దో తీన్..’ పాటలకూ ఆమె తన వెబ్సైట్లో లైవ్‌గా డ్యాన్స్ చేయబోతున్నారు. ‘డాన్స్ విత్ మాధురి’ ఆ ఫెస్టివల్ పేరు. కొరియోగ్రాఫర్లు సరోజ్ ఖాన్, ఫరాఖాన్, కథక్ నాట్యాచార్యులు పండిట్ బిర్జూ మహరాజ్ మరికొంతమంది దిగ్గజాలు మాధురితో కలుస్తున్నారు. హిప్హాప్లు, మసాలా భాంగ్రాలూ ఉంటాయి. డ్యాన్స్‌లో ఏదో ఉంది.. రక్తప్రసరణలా మనిషి లోపల నృత్యప్రసరణ లాంటిది. -
‘అతడికి నా హృదయంలో ప్రత్యేక స్థానం’
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన హృదయంలో బాలీవుడ్ నటుడు వరుణ్ దావన్కు ప్రత్యేకమైన స్తానం ఉందని శ్రద్ధా కపూర్ తెలిపారు. వరుణ్, శ్రద్దా కపూర్ల జంటగా ‘స్ట్రీట్ డ్యాన్స్‌ర్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రద్ధా మీడియాతో మాట్లాడుతూ.. వరుణ్, తాను వేరే పాఠశాలలో చదివినప్పటికి అవి చాలా దగ్గరగా ఉండేవని తెలిపారు. తన జీవితంలో వరుణ్ చాలా ముఖ్యమైన వ్యక్తి అని అన్నారు. తన బాల్యంలో ఎవరి స్కూల్ మెరుగైనదో అంటు తరుచుగా చర్చించుకునే వాళ్లమని ఆమె గుర్తు చేశారు. అతడు తనకు చిన్ననాటి నుంచి తెలుసునని.. ఎవరితోనైతే ప్రత్యే క అనుబంధం ఉంటుందో వారితో కలిసి నటించడం ఎంతో ప్రత్యేకమన్నారు. వరుణ్‌లో మంచి లక్షణాలు ఉన్నాయని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం అతడి సొంతమన్నారు. వరుణ్‌ను ప్రేక్షకులు అభిమానిస్తారని.. అభిమానులను ఆకర్శించే శక్తి దాగి ఉందన్నారు. ప్రేక్షకులు వరుణ్‌ను తమ సొంత మనిషిలా ఆరాధిస్తారని పేర్కొన్నారు. ఏబీసీడీ 2, త్రీడీ స్ట్రీట్ డ్యాన్స్‌ర్ తనకు మైలురాయి లాంటి సినిమాలని అభిప్రాయపడ్డారు. ఈ రెండు సినిమాలు వల్ల తనకు విభిన్న రకాలుగా డ్యాన్స్‌లు చేయడానికి అవకాశం లభించిందన్నారు. తనకు చిన్నతనం నుంచే డ్యాన్స్‌లంటే విపరీతంగా ఇష్టమని... ప్రముఖ బాలీవుడ్ నటులు శ్రీదేవి, మాధరీ దీక్షిత్‌లు తనకు ఇష్టమైన వారని శ్రద్ధా కపూర్ వివరించారు. చదవండి: ‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’ -
మధురంగా పాడారట
‘ఏక్ దో తీన్..’ అంటూ బాలీవుడ్‌ను తన స్టెప్స్‌తో మాధురీ దీక్షిత్ మైమరిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మాధురి డ్యాన్స్‌కు తిరుగులేదు. లేటెస్ట్గా మాధురి తనలోని కొత్త కోణాన్ని బయటకు తీసుకొచ్చారు. సింగర్‌గా ఓ ఇంగ్లీష్ ఆల్బమ్ పాడారామె. తన తొలి ఆల్బమ్ గురించి మాధురీ దీక్షిత్ మాట్లాడుతూ – ‘‘ప్రొఫెషనల్ లెవల్లో సింగర్‌గా ట్రై చేయడం ఇదే మొదటిసారి. ఆల్రెడీ సాంగ్స్ రికార్డింగ్ పూర్తయింది. ఇక ఆ పాటలకు సంబంధించి వీడియో షూట్ చేయాలి. ఫస్ట్ సింగిల్‌ను ఈ ఏడాది రిలీజ్ చేస్తాం. ఆల్బమ్ పాప్ మ్యూజిక్ స్టైల్లో సాగుతుంది. మొత్తం ఆరు పాటలుంటాయి. ప్రతీ పాట డిఫరెంట్ ఫ్లేవర్‌లో ఉంటుంది’’ అని పేర్కొన్నారు. 2014లో తాను నటించిన ‘గులాబ్ గ్యాంగ్’ సినిమా కోసం ఓ పాటలో తన గొంతుని వినిపించారు మాధురి. అన్నట్లు.. మాధురి పాడిన పాటలను ఆమె సన్నిహితులు విని, ‘చాలా మధురంగా పాడావు’ అని కితాబులిచ్చారట. -
మళ్లీ ఏక్ దో తీన్
‘‘ఏక్ దో తీన్..’’ అనగానే మనందరికి గుర్తొచ్చేది మాధురీ దీక్షిత్. మోహినిగా తను వేసిన స్టెప్పులను దశాబ్దాలు దాటిపోయినా ఎవ్వరూ మరచిపోయి ఉండరు. మాధురీ దీక్షిత్‌ను ఓవర్ నైట్ స్టార్‌గా మార్చేసి, డ్యాన్సింగ్ క్వీన్ అంటూ బాలీవుడ్ అభిమానుల కితాబులు పొందేలా చేసిందీ సాంగ్. ప్రస్తుతం‘భాగీ 2’ చిత్రం కోసం ఆ పాటను రీమిక్స్ చేస్తున్నారు. నయా మోహినిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనిపించనున్నారు. టైగర్ ష్రాఫ్, దిశా పటానీ జంటగా అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్న చిత్రం ‘భాగీ 2’. 2016లో వచ్చిన ‘భాగీ’ చిత్రానికి ఇది సీక్వెల్. అప్పుడు మాధురీ కోసం ప్యారీలాల్ కంపోజ్ చేసిన ఆ పాటకు సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ చేశారు. ఇప్పుడు సరోజ్ ఖాన్ శిష్యుడు, ‘భాగీ 2’ చిత్ర దర్శకుడు ఈ పాటను రీమిక్స్ చేయాలనుకోవడం విశేషం. ‘ఏక్ దో తీన్...’ సాంగ్‌లో సైడ్ డ్యాన్సర్‌గా కనిపించిన గణేష్ ఆచార్యనే ఈ రీమిక్స్‌కు కొరియోగ్రఫీ చేయడం మరో విశేషం. ఈ సాంగ్ రీమిక్స్ గురించి దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఏక్ దో తీన్’ అనే పాట ఆల్ టైమ్ హిట్. గణేష్ మాస్టర్‌ను సేమ్ సరోజ్ ఖాన్ స్టైల్లోనే కంపోజ్ చేయమని అడిగాను. అలాగే మాధురీ దీక్షిత్ ధరించిన పింక్ కలర్ డ్రెస్‌ను దృష్టిలో ఉంచుకొనే జాక్వెలిన్‌కు డ్రెస్ డిజైన్ చేయమని మనీష్ మల్హోత్రాను కోరాను. జాక్వెలిన్‌తో ఇంతకు ముందు ‘కిక్’లో ‘జుమ్మే కీ రాత్ హై’, ‘రాయ్’ సినిమాలో ‘చిట్టియన్ కలయ్యా’ వంటి సూపర్ హిట్ సాంగ్స్ చేశాం. ఆమె ఫెంటాస్టిక్ డ్యాన్సర్. అందుకే ‘ఏక్ దో...’ సాంగ్‌ను రీక్రియేట్ చేయటానికి జాక్వెలిన్ మంచి ఛాయిస్ అనుకున్నాను’’ అన్నారు. ఈ సాంగ్‌ను మూడు రోజులు షూట్ చేస్తారట. ‘భాగీ 2’ మార్చి 30న విడుదల కానుంది. మాధురీ దీక్షిత్ గురించి సరోజ్ ఖాన్ మాట్లాడుతూ – ‘‘బేసిక్‌గా మాధురీ కథక్ డ్యాన్సర్. అందుకే బాలీవుడ్ స్టైల్ పాటలను అడాప్ట్ చేసుకోవటానికి కొంచెం ఇబ్బంది పడేవారు. ‘ఏక్ దో...’ సాంగ్‌ను నేను కేవలం 20 నిమిషాల్లో కంపోజ్ చేశాను. కానీ ఆ హిప్ మూమెంట్స్‌ను క్యాచ్ చేయటానికి ఆమె బాగా కష్టపడ్డారు. దానికోసం పదిహేడు రోజులు ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం. ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకూ ప్రాక్టీస్ చేసేవారు. పదో రోజు కల్లా తన స్టెప్స్‌లో పర్ఫెక్ట్ అయ్యారు మాధురి. ఇక ప్రాక్టీస్‌కు రావద్దులే అంటే మిగతా 7 రోజులు కూడా డ్యాన్స్ స్టూడియోకి వచ్చి ప్రాక్టీస్ చేస్తూనే ఉండేవారామె’’ అన్నారు. -
రేప్- ఇట్స్ యువర్ ఫాల్ట్
సినిమా తెరకెక్కడానికి బుల్లి చిత్రాల్ని ఒక సాధనంగా ఔత్సాహికులు మలచుకుంటుంటే... పెద్ద తారలేమో ‘షార్ట్’ మూవీస్‌లో కనిపించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకలా.. అంటే కారణాలనేకం. షార్ట్ఫిలింస్ వేగంగా ప్రపంచాన్ని చుట్టి వచ్చే పవర్ఫుల్ మీడియంగా మారాయి. పెద్ద సినిమా చిత్రీకరణ, విడుదలకు ఉండే హడావుడి ఈ చిత్రాలకు లేకపోయినా, ఇంటర్నెట్ ద్వారా ఇమిడియట్‌గా కోట్లాది మంది వ్యూవర్స్‌ని చేరుకుంటుండడం ఈ చిత్రాలపై ఆసక్తి పెంచుతోంది. దీంతో సినీ తారలు సైతం వీటిని పట్టించుకోక తప్పని పరిస్థితి. అయితే సంతోషించాల్సిన విషయమేమిటంటే... కమర్షియల్, భారీ బడ్జెట్ సినిమాలలో సాహసించడానికి వీలులేని సందేశాత్మక సామాజిక అంశాలపై స్పందించడానికి వీరు చిన్ని చిత్రాలను ఉపయోగించుకోవడం. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు ఇప్పుడు పొట్టి సినిమాల్లో కనిపిస్తున్నారు. వీరిలో నేటి తరం అలియాభట్, కల్కీ నుంచి నిన్నటి తరం మాధూరీ దీక్షిత్ కూడా ఉన్నారు. దర్శకులదీ ఇదే బాట. ఈ నేపధ్యంలో స్టార్స్ నటించిన కొన్ని పొట్టి చిత్ర విశేషాలివి. వినీల్ మ్యాథ్యూ రూపొందించిన స్టార్ట్ విత్ ద బాయ్స్ అనే బుల్లి సినిమా డొమెస్టిక్ వయోలెన్స్ నేపథ్యంలో చక్కటి సందేశంతో రూపొందింది. అనేక సందర్భాల్లో సహజంగా వచ్చే ఏడుపును నియంత్రించుకోవటం వల్ల అబ్బాయిల్లో పెరిగే క్రోధం, అది అమ్మాయిల పట్ల హింసగా ఎలా మారుతుందనేది రెండు నిముషాల చిత్రంలో చక్కగా చూపారు. ‘పుట్టినప్పటి నుంచి బాయ్స్ ఏడవకూడదని నేర్పించే తల్లిదండ్రలు, ఇక నుంచి, మగపిల్లలు ఆడవారిని ఏడిపించకూడదు అని నేర్పిస్తే మంచిది’ అని మాధురి చెప్పే మాటలతో ముగుస్తుంది. దీనికి యూట్యూబ్‌లో మంచి హిట్స్ వచ్చాయి. కల్కీ సంచలనం... ‘రేప్- ఇట్స్ యువర్ ఫాల్ట్’... ఈ సూపర్‌హిట్ షార్ట్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ కల్కీ కోచ్లీన్ (షాంగై సినిమా ఫేం) నటించింది. యూట్యూబ్‌లో ఇదో సంచలనం. ఆడవారిపై జరిగే అన్యాయాలకు వారే కారణమంటూ అడ్డదిడ్డంగా చేసే వ్యాఖ్యలకు సమాధానంగా రూపొందిన ఈ సినిమాకు అశ్విన్శెట్టి దర్శకత్వం. మరెందరో... ఇదే తరహాలో ‘యామ్ నాట్ ఏ వుమన్’ షార్ట్ఫింలో కూడా బాలీవుడ్‌కి చెందిన రజిత్ కపూర్, మియాంగ్ చాంగ్, అదితి మిట్టల్ తదితరులు నటించారు. ‘దట్ డే ఆఫ్టర్ ఎవ్రీడే’ కూడా మరో మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రమే. బయటకు వెళ్లే ఆడపిల్లలు బస్సుల్లో, వీధుల్లో ఎదుర్కునే ఈవ్‌టీజింగ్ సమస్యని ఇందులో చూపారు. రాధికా ఆప్టే, సంధ్యా మృదుల్, అరణ్యకౌర్ మధ్యతరగతి అమ్మాయిల పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ రూపొందించారు. టాలీవుడ్ నటులు కూడా ఇప్పుడిప్పుడే షార్ట్ చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. రెగ్యులర్ సినిమా తర్వాత గెలుపు, ఓటమి క్రిటిసిజమ్ లాంటి ఎన్నో అంశాలు ఎదుర్కునే ఈ బడా తారలకు ఈ చిన్ని సినిమాల తర్వాత అల్టిమేట్‌గా మంచి మార్కులు పడుతుండటం విశేషం. ఓ మధు