Netflix Special Wishes to Allu Arjun, Thalapathy Vijay on International Dance Day - Sakshi
Sakshi News home page

Netflix: బన్నీతోపాటు మరో ముగ్గురికి నెట్​ఫ్లిక్స్​ స్పెషల్​ విషెస్..

Published Sat, Apr 30 2022 11:49 AM | Last Updated on Sat, Apr 30 2022 12:54 PM

Netflix Special Wishes To Allu Arjun On International Dance Day - Sakshi

కరోనా కల్లోలంతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో థియేటర్లకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ ప్లాట్​ఫ్లామ్​లు మారిన సంగతి తెలిసిందే. ఈ ఓటీటీ ప్లాట్​ఫ్లామ్​లలో ప్రత్యేక కాన్సెప్ట్​లతో సినిమాలు రూపొందిస్తోంది నెట్​ఫ్లిక్స్​. సినిమాలతోపాటు విభిన్న జోనర్​లో వెబ్ సిరీస్​లు తెరకెక్కిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ దిగ్గజ సంస్థ స్టైలిష్​, ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్​కు స్పెషల్​ శుభాకాంక్షలు తెలిపింది. 

శుక్రవారం (ఏప్రిల్​ 29) ఇంటర్నేషనల్​ డ్యాన్స్​ డే అని తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేసింది. అంతేకాకుండా బన్నీతోపాటు మరో ముగ్గురు తారలకు ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పింది. బాలీవుడ్​ సీనియర్ బ్యూటీఫుల్​ మాధురి దీక్షిత్​, కోలీవుడ్ స్టార్​ హీరో విజయ్, అల్లు అర్జున్, బీటౌన్ గ్రీక్​ గాడ్​ హృతిక్​ రోషన్​కు స్పెషల్​గా విష్​ చేసింది నెట్​ఫ్లిక్స్​. 

చదవండి: రిలీజైన నెలలోనే అత్యధిక వ్యూస్​ సాధించిన ఓటీటీ సిత్రాలు..

ఈ విషెస్​తోపాటు ది ఫేమ్​ గేమ్​, మేర్సల్​, అలా వైకుంఠపురములో, లక్ష్య చిత్రాల్లోని వారి డ్యాన్స్​ స్టెప్పుల ఫొటోలను షేర్​ చేసింది. ఈ పోస్ట్​ చేస్తూ 'ప్రతి ఒక్కరీకీ హ్యాపీ ఇంటర్నేషనల్​డ్యాన్స్​ డే. కానీ ప్రత్యేకంగా వీరికి..' అని క్యాప్షన్​ రాసుకొచ్చింది. ఈ సినిమాలన్ని నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​ అవుతున్నాయి. ​​అలాగే మాధురి దీక్షిత్, విజయ్​, బన్నీ, హృతిక్​ రోషన్​ డ్యాన్స్​లో తమదైన ప్రత్యేకతను చాటిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల నెట్​ఫ్లిక్స్ 3 నెలల్లో సుమారు 2 లక్షల సబ్​స్క్రైబర్స్​ను కోల్పోయింది. 

చదవండి: అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్‌లు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement