ఓటీటీలోకి వచ్చేసిన పుష్పరాజ్‌.. ఫ్యాన్స్‌కు బోనస్‌ | Allu Arjun Pushpa 2 The Rule Movie Released In OTT, Check Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Pushpa 2 OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన పుష్పరాజ్‌.. ఫ్యాన్స్‌కు బోనస్‌

Jan 30 2025 7:03 AM | Updated on Jan 30 2025 1:57 PM

Pushpa 2 Movie OTT Streaming Now

పుష్పగాడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేశాడు. దేశవ్యాప్తంగా సినిమా ప్రియులు పుష్ప2(Pushpa 2: The Rule) ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే, జనవరి 30 అర్ధరాత్రి నుంచే ఓటీటీలో 'పుష్పగాడి' రూల్‌ మొదలైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రీలోడెడ్‌ వెర్షన్‌ స్ట్రీమింగ్‌ అవుతుంది. 

పాన్‌ ఇండియా రేంజ్‌లో  అల్లు అర్జున్‌(Allu Arjun) హీరోగా సుకుమార్‌(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లతో అనేక రికార్డులను దాటేసింది. ఇప్పటికి 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రూ. 1896 కోట్ల కలెక్షన్స్‌ వచ్చినట్లు మేకర్స్‌ ప్రకటించారు.

మరో నాలుగు నిమిషాలు అదనం
గతేడాది డిసెంబరు 5న భారీ అంచనాలతో విడుదలైన పుష్ప2 మొత్తం రన్‌టైమ్‌  3 గంటల 20 నిమిషాలుగా ఉంది. అయితే, సంక్రాంతి రేసులో ఈ సినిమా నిడివి అదనంగా మరో 20 నిమిషాలు జోడించారు. అప్పుడు  పుష్ప రన్‌ టైమ్‌ 3:40 నిమిషాలు అయింది. ఫ్యాన్స్‌కు బోనస్‌గా  ఇప్పుడు ఓటీటీ వర్షన్‌లో మరో 4 నిమిషాల సీన్లు అదనంగా మరోసారి  జత చేశారు. దీంతో పుష్ప2 మొత్తం రన్‌ టైమ్‌ 3:44 గంటలు ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement