బాలీవుడ్‌లో సూపర్ హిట్ ఫ్రాంఛైజీ భూల్ భులయ్యా నుంచి విడుదలైన మూడో సినిమా 'భూల్ భులయ్యా 3'. హారర్, కామెడీ, థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. కార్తీక్ ఆర్యన్, తృప్తి డిమ్రి,విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటించిన ఈ మూవీ నవంబర్ 1న విడుదలైంది. అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
భూల్ భూలయ్యా 3 ప్రాజెక్ట్‌లోకి విద్యాబాలన్ రీఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడంతో థియేటర్స్‌లలో చూడని వారు తమ ఇంట్లోనే చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. అందుకు సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భూల్ భూలయ్యా 3 ఓటీటీ ప్రకటన విషయాలను పలు వీడియోలతో నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే షేర్ చేసిన విషయం తెలిసిందే.
రూహ్ బాబా పాత్ర పోషించిన కార్తీక్ ఆర్యన్‌పై అభిమానులు ప్రశంసలు కురిపించారు. హారర్ కామెడీ జానర్లో 2024లో విడుదులై హిట్ కొట్టిన సినిమాల జాబితాలో భూల్ భూలయ్యా 3 టాప్‌లో ఉంటుంది. ఈ చిత్రం ప్రేక్షకులకు విజువల్ వండర్‌లా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ఊహకు కూడా అందవని చెప్పవచ్చు. హీరో ఎంట్రీ సాంగ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. సుమారు 1000 మంది డ్యాన్సర్లతో తెరకెక్కిన ఎంట్రీ సాంగ్ సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు. సుమారు రూ. 150 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 450 కోట్లు పైగానే కలెక్షన్స్ రాబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment