'భూల్‌ భులయ్యా 3' నుంచి టీజర్‌.. | Bhool Bhulaiyaa 3 Movie Official Teaser Out Now, Watch Video Inside | Sakshi
Sakshi News home page

'భూల్‌ భులయ్యా 3' నుంచి టీజర్‌..

Published Fri, Sep 27 2024 1:09 PM | Last Updated on Fri, Sep 27 2024 1:23 PM

Bhool Bhulaiyaa Teaser Out Now

కార్తీక్‌ ఆర్యన్‌, తృప్తి డిమ్రి నటించిన ‘భూల్‌ భులయ్యా 3’ నుంచి తాజాగా టీజర్‌ విడుదలైంది. హారర్, కామెడీ, థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా విడుదల కానుంది. గతంలో విడుదలైన భూల్‌ భులయ్యా ప్రాంఛైజీలో భాగంగా పార్ట్‌-3 ప్రేక్షకుల ముందుకు రానుంది. విద్యాబాలన్‌, మాధురీ దీక్షిత్‌ వంటి స్టార్స్‌ ఈ చిత్రంలో నిటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అనీస్‌ బజ్మీ తెరకెక్కిస్తున్నారు.

భూల్ భూలయ్యా 3 ప్రాజెక్ట్‌లోకి విద్యాబాలన్  రీఎంట్రీ ఇవ్వడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. హారర్,సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ  సమ్మేళనానికి ఆమె పాత్ర చాలా కీలకం. ఆత్మలతో సంభాషించగలిగే పాత్రలో కార్తీక్‌ ఆర్యన్‌ నటించనున్నారు. దీపావళి సందర్భంగా  ‘భూల్‌ భులయ్యా 3’ విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా టీజర్‌ను పంచుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement