సాధారణంగా సినిమాలలో ఓ రెండిటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకటి హ్యుమర్ అయితే మరోటి హారర్. కాని ఆ రెండూ కలిపి సినిమా తీస్తే అదే ఈ సినిమా భూల్ భులయ్యా3. ఇది భూల్ భులయ్యా(Bhool Bhulaiyaa 3) సిరీస్ లో వచ్చిన మూడవ సినిమా. నిజానికి మొదటి భాగానికి మిగతా రెండు భాగాలకి కథతో పాటు పాత్రధారులలో కూడా తేడా ఉంది. భూల్ భులయ్యా మొదటి భాగం చంద్రముఖి సినిమా ఆధారంగా తీసింది. కాని మిగతా రెండు భాగాలు మాత్రం అదే థీమ్ తో కాస్త విభిన్నంగా రూపొందించారు. ఇప్పుడు భూల్ భులయ్యా 3(Bhool Bhulaiyaa-3) సినిమా కథ విషయానికొస్తే 200 సంవత్సరాల క్రితం రక్తఘాట్ రాజ్యంలో జరిగిన కథ. అప్పటి రాజ కుటుంబం వల్ల జరిగిన సంఘటనలో మంజులిక అనే ఓ దెయ్యం తయారవుతుంది.
ఈ దేయ్యాన్ని అదే రాజ్యంలోని అంతఃపుర గదిలో భద్రంగా భద్రపరుస్తారు ఆ రాజ్యానికి చెందిన రాజగురువు. 2024 సంవత్సరంలో వారసత్వ సంపదగా ఆ అంతఃపురాన్ని ఓ హోటల్ గా మార్చాలని రాజకుటుంబం వారసులు ప్రయత్నించగా బందీగా ఉన్న మంజులిక దెయ్యం బయటపడి వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ విషయం చూసే ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిస్తాయి.
మరి ఈ మంజులికను కట్టడి చేయడానికి ఫేక్ మాంత్రికుడైన రూహాన్ ను ఆ రాజ్యానికి తెప్పించుకుంటారు. రూహాన్ రక్తఘాట్ కు వచ్చినప్పటి నుండి కథ అనేక మలుపులు తిరగుతూ ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ తో ముగుస్తుంది. ఈ సినిమా లో ముఖ్యంగా ముగ్గురి గురించి చెప్పుకోవాలి. అందులో మొదటగా హీరో రోల్ వేసిన రోహాన్. తన ఈజ్ ఆఫ్ యాక్టింగ్ తో హారర్ ఎమోషన్ ని కూడా హ్యుమర్ ఎమోషన్ తో చక్కగా నటించాడు.
ఇక విశేష పాత్రలలో నటించిన నాటి తార మాధురీ దీక్షిత్, నేటి వర్ధమాన తార విద్యాబాలన్ వారి నటనతోనే కాదు అద్భుత నాట్యంతో కూడా సినిమాని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు. దర్శకుడు అనీస్ ఈ సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా ఓ పక్క భయపెడుతూ మరో పక్క గిలిగింతలు పెడుతూ ప్రేక్షకులను కదలినివ్వకుండా స్క్రీన్ ప్లే నడిపాడు. నెట్ ఫ్లిక్స్ ఓటిటి వేదికగా స్ట్రీమ్ అవుతున్నఈ భూల్ భులయ్యా వీకెండ్ వాచబుల్ మువీ.
- ఇంటూరు హరికృష్ణ.
Comments
Please login to add a commentAdd a comment