మధురంగా పాడారట | Madhuri Dixit soon to come up with an English pop album | Sakshi
Sakshi News home page

మధురంగా పాడారట

Published Fri, Apr 12 2019 6:00 AM | Last Updated on Fri, Apr 12 2019 6:00 AM

Madhuri Dixit soon to come up with an English pop album - Sakshi

‘ఏక్‌ దో తీన్‌..’ అంటూ బాలీవుడ్‌ను తన స్టెప్స్‌తో మాధురీ దీక్షిత్‌ మైమరిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మాధురి డ్యాన్స్‌కు తిరుగులేదు. లేటెస్ట్‌గా మాధురి తనలోని కొత్త కోణాన్ని బయటకు తీసుకొచ్చారు. సింగర్‌గా ఓ ఇంగ్లీష్‌ ఆల్బమ్‌ పాడారామె. తన తొలి ఆల్బమ్‌ గురించి మాధురీ దీక్షిత్‌ మాట్లాడుతూ – ‘‘ప్రొఫెషనల్‌ లెవల్లో సింగర్‌గా ట్రై చేయడం ఇదే మొదటిసారి. ఆల్రెడీ సాంగ్స్‌ రికార్డింగ్‌ పూర్తయింది. ఇక ఆ పాటలకు సంబంధించి వీడియో షూట్‌ చేయాలి. ఫస్ట్‌ సింగిల్‌ను ఈ ఏడాది రిలీజ్‌ చేస్తాం. ఆల్బమ్‌ పాప్‌ మ్యూజిక్‌ స్టైల్లో సాగుతుంది.  మొత్తం ఆరు పాటలుంటాయి. ప్రతీ పాట డిఫరెంట్‌ ఫ్లేవర్‌లో ఉంటుంది’’ అని పేర్కొన్నారు. 2014లో తాను నటించిన ‘గులాబ్‌ గ్యాంగ్‌’ సినిమా కోసం ఓ పాటలో తన గొంతుని వినిపించారు మాధురి. అన్నట్లు.. మాధురి పాడిన పాటలను ఆమె సన్నిహితులు విని, ‘చాలా మధురంగా పాడావు’ అని కితాబులిచ్చారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement