పిల్లల్ని పోగొట్టుకోవడం కంటే పెద్ద దుఃఖం మరొకటి ఉండదు. తన జీవితంలోనూ అతి పెద్ద విషాదం రెండో కొడుకుని కోల్పోవడమే అంటున్నాడు సింగర్ బి ప్రాక్. నా కొడుకు మరణాన్ని నేను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. నేనేం పాపం చేశానని భగవంతుడు నాకు ఇంత పెద్ద శిక్ష విధించాడని బాధపడుతుంటాను.
సమాధి చేశాం..
చనిపోయిన శిశువును ఒక్కసారి చూస్తానని నా భార్య మీరా అడిగింది. తన బాధ రెట్టింపు చేయడం ఇష్టం లేక అందుకు ఒప్పుకోలేదు. తనకు చూపించకుండానే సమాధి చేశాం. ఇప్పటికీ ఈ విషయంలో తను నాపై కోప్పడుతూనే ఉంటుంది.. అని కన్నీళ్లుపెట్టుకున్నాడు.
కెరీర్..
కాగా బిప్రాక్, మీరా 2019 ఏప్రిల్ 4న పెళ్లి చేసుకున్నారు. వీరికి 2020లో అదాబ్ అనే కుమారుడు జన్మించాడు. 2022లో మరో శిశువు జన్మించగా.. పురిట్లోనే కన్నుమూసింది. కాగా ప్రాక్.. పంజాబీ, హిందీ భాషల్లో అనేక సినిమాలకు సంగీత దర్శకుడిగా, సింగర్‌గా పని చేశాడు. ప్రైవేట్ సాంగ్ ఆల్బమ్స్ కూడా చేస్తుంటాడు. కేసరి సినిమాలో తేరి మిట్టి పాటకుగానూ ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment