నరసింహుడు, అశోక్, జై చిరంజీవ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్ సమీరా రెడ్డి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. సినిమాలకు, షికార్లకు వెళ్లినప్పుడు ప్రియుడి తల్లి కూడా తన వెంటే వచ్చేదట!
అమ్మను తీసుకెళ్తాం..
దీని గురించి సమీరా ఇంకా మాట్లాడుతూ.. అక్షయ్‌తో డేట్‌కు వెళ్లినప్పుడు అతడి తల్లిని కూడా తీసుకొచ్చేవాడు. మా అమ్మ విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. తను ఎక్కడికి వెళ్లాలన్నా మేమే తీసుకెళ్తాం. మేము ఎక్కడికి వెళ్లినా తననూ వెంటపట్టుకుని వెళ్తాం. అందుకనే మనం సినిమాకు వెళ్లినప్పుడు తనను కూడా తీసుకొస్తున్నా అన్నాడు. అది విని నాకు ఆశ్చర్యమేసింది.
రాత్రి బస చేసేందుకు గ్రీన్ సిగ్నల్
ఎప్పుడైనా తన ఇంట్లో రాత్రి నిద్ర చేసేందుకు కూడా అడ్డు చెప్పేది కాదు. పెళ్లికి ముందు అక్షయ్‌తో ఉండనిచ్చేది. తను చాలా సపోర్ట్‌గా నిలిచింది అని చెప్పుకొచ్చింది. కాగా సమీరా, అక్షయ్ 2014లో పెళ్లి చేసుకున్నారు. అక్షయ్ కంటే సమీరా రెండేళ్లు పెద్దది కావడం గమనార్హం. ఈ దంపతులకు ఇద్దరు చిన్నారులు జన్మించారు. దశాబ్దకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమీరా నామ్ మూవీతో రీఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment