చిన్న మార్పు | Nithya Menen turns songmaker | Sakshi
Sakshi News home page

చిన్న మార్పు

Published Sat, Jan 11 2020 6:38 AM | Last Updated on Sat, Jan 11 2020 6:38 AM

Nithya Menen turns songmaker - Sakshi

నిత్యామీనన్‌ మల్టీటాలెంటెడ్‌. బాగా యాక్ట్‌ చేయగలరు. మలయాళీ అయినా అచ్చ తెలుగులో సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకోగలరు. సినిమాల్లో పాటలు పాడగలరు. ఇప్పుడు తనలోని గాయనిపై మరింత దృష్టి పెట్టారు. గాయనిగా నిత్యామీనన్‌ తన తొలి ఆల్బమ్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ మ్యూజిక్‌ ఆల్బమ్‌కి లండన్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ సౌమిక్‌ దత్తా సంగీతాన్ని సమకూర్చగా నిత్యామీనన్‌ పాడనున్నారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా తెలియజేశారామె. ‘‘సరికొత్త ప్రాజెక్ట్‌ తయారవుతోంది. కెరీర్‌లో చిన్న మార్పు రాబోతోంది. నా తొలి మ్యూజిక్‌ సింగిల్‌ త్వరలో విడుదల కాబోతోంది. అందరికీ త్వరగా వినిపించేయాలనే ఆతురుతతో ఉన్నాను’’ అన్నారు. ప్రస్తుతం జయలలిత బయోపిక్‌ ‘ది ఐరన్‌ లేడీ’, తెలుగులో సత్యదేవ్‌తో ఓ సినిమా చేస్తున్నారు నిత్యామీనన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement