
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన హృదయంలో బాలీవుడ్ నటుడు వరుణ్ దావన్‌కు ప్రత్యేకమైన స్తానం ఉందని శ్రద్ధా కపూర్ తెలిపారు. వరుణ్, శ్రద్దా కపూర్‌ల జంటగా ‘స్ట్రీట్ డ్యాన్స్‌ర్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రద్ధా మీడియాతో మాట్లాడుతూ.. వరుణ్, తాను వేరే పాఠశాలలో చదివినప్పటికి అవి చాలా దగ్గరగా ఉండేవని తెలిపారు. తన జీవితంలో వరుణ్ చాలా ముఖ్యమైన వ్యక్తి అని అన్నారు. తన బాల్యంలో ఎవరి స్కూల్ మెరుగైనదో అంటు తరుచుగా చర్చించుకునే వాళ్లమని ఆమె గుర్తు చేశారు. అతడు తనకు చిన్ననాటి నుంచి తెలుసునని.. ఎవరితోనైతే ప్రత్యే క అనుబంధం ఉంటుందో వారితో కలిసి నటించడం ఎంతో ప్రత్యేకమన్నారు.
వరుణ్‌లో మంచి లక్షణాలు ఉన్నాయని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం అతడి సొంతమన్నారు. వరుణ్‌ను ప్రేక్షకులు అభిమానిస్తారని.. అభిమానులను ఆకర్శించే శక్తి దాగి ఉందన్నారు. ప్రేక్షకులు వరుణ్‌ను తమ సొంత మనిషిలా ఆరాధిస్తారని పేర్కొన్నారు. ఏబీసీడీ 2, త్రీడీ స్ట్రీట్ డ్యాన్స్‌ర్ తనకు మైలురాయి లాంటి సినిమాలని అభిప్రాయపడ్డారు. ఈ రెండు సినిమాలు వల్ల తనకు విభిన్న రకాలుగా డ్యాన్స్‌లు చేయడానికి అవకాశం లభించిందన్నారు. తనకు చిన్నతనం నుంచే డ్యాన్స్‌లంటే విపరీతంగా ఇష్టమని... ప్రముఖ బాలీవుడ్ నటులు శ్రీదేవి, మాధరీ దీక్షిత్‌లు తనకు ఇష్టమైన వారని శ్రద్ధా కపూర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment