
2015లో 'ఏబీసీడీ 2' రికార్డు
ముంబై: వరుణ్ ధావన్, శ్రద్ధాకపూర్, ప్రభుదేవా నటించిన 'ఏబీసీడీ 2' బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. ఈ ఏడాదిలో తొలి వారం రోజుల్లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది.
తొలి వారంలో ఈ సినిమా దాదాపు 72 కోట్ల రూపాయలు వసూలు సాధించింది. ఇంతకుముందు 'తను వెడ్స్ మను రిటర్స్' చిత్రం (వారంలో 69 కోట్లు) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టింది. రిమో డిసౌజా దర్శకత్వం వహించిన ఏబీసీడీ 2 రెండో వారంలో కూడా మంచి కలెక్షన్లను రాబడుతోందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.