నా కొత్త పేరు చోటా హల్క్! | Shraddha Kapoor: My Mother Calls Me 'Chota Hulk' | Sakshi
Sakshi News home page

నా కొత్త పేరు చోటా హల్క్!

Published Sun, May 17 2015 11:41 PM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM

నా కొత్త పేరు చోటా హల్క్!

నా కొత్త పేరు చోటా హల్క్!

 ‘‘ఇప్పుడు నేను  మానసికంగా,శారీరకంగా చాలా  దృఢంగా ఉన్నా. ఇది ‘ఏబీసీడీ 2’  తెచ్చిన మార్పు. ఈ సినిమా మొదలయ్యాక ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లో చేరాను. ఈ  కోర్సు చాలా విభిన్నంగా ఉంది. ఇంటిలో ఉన్నప్పుడు కూడా చాలా వర్కవుట్స్ చేస్తున్నా. ఇందులో ప్రధానమైనది వెయిట్ లిఫ్టింగ్. అందువల్ల ఇంట్లో ఉన్నప్పుడు వంటగదిలో చాలా బరుైవె న సామాన్లు కూడా అవలీలగా ఎత్తగలుగుతున్నా. ఓ రోజు సోఫా మోయాల్సిన పరిస్థితి వచ్చింది. మా అమ్మ
 
 ఎవరినో సాయం  పిలిచేలోపు,
 ఒక్క చేత్తో దాన్ని ఎత్తి అవతల పడేశా. దాంతో ఆశ్చర్యపోవడం మా అమ్మ వంతయింది. ఇక అప్పటి నుంచి మా అమ్మ ‘చోటా హల్క్’ అని పిలుస్తోంది. ఇటీవలే  మథుర వెళ్లినప్పుడు ఓ ఆవు దూడను చూశా. చాలా ముద్దనిపించింది. వెంటనే ఎత్తుకుని ముద్దాడా. మామూలుగా అయితే దూడ చాలా బరువుగా ఉంటుంది. కానీ అదేం అనిపించలేదు. ఇదంతా ‘ఏబీసీడీ2’ పుణ్యమే.’’
 - శ్రద్ధాకపూర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement