వరుణ్, శ్రద్ధాలతోనే ఏబీసీడీ 3 | 'ABCD 3' with Varun and Shraddha: Remo D'Souza | Sakshi
Sakshi News home page

వరుణ్, శ్రద్ధాలతోనే ఏబీసీడీ 3

Published Sat, Jul 11 2015 2:59 PM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM

వరుణ్, శ్రద్ధాలతోనే ఏబీసీడీ 3

వరుణ్, శ్రద్ధాలతోనే ఏబీసీడీ 3

ఎనీబడీ కెన్ డాన్స్ 2 అంటూ కలెక్షన్లు కొల్లగొట్టిన రెమో డిసౌజా ఇప్పుడు ఏబీసీడీ 3 సినిమా కూడా తీసేందుకు సిద్ధమవుతున్నారు. అందులో కూడా ఏబీసీడీ 2 హీరో హీరోయిన్లు వరుణ్ ధావన్, శ్రద్ధాకపూరే నటించబోతున్నారు. ప్రస్తుతం తాను వేరేసినిమా చేస్తున్నానని, వరుణ్, శ్రద్ధా కపూర్ కూడా వేరే వేరే సినిమాలు చేస్తున్నారని.. ఒక్కసారి తాము మగ్గురం ఫ్రీ అయితే అప్పుడు వెంటనే ఏబీసీడీ 3 సినిమా తీస్తామని ఆయన చెబుతున్నారు.

ఏబీసీడీ 2 సినిమా సక్సెస్ పార్టీని ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. 2013లో డాన్స్ నేపథ్యంలో రెమో తీసిన ఏబీసీడీ సినిమా ఇప్పటికే రెండు భాగాలు విడుదలై రెండూ విజయం సాధించాయి. ఏబీసీడీ సినిమాకు దాదాపు 104 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఏబీసీడీ 2 ఇప్పటికే 103.25 కోట్ల రూపాయల కలెక్షన్లు దండుకుంది. ఇప్పటికీ చాలాచోట్ల విజయవంతంగా నడుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement