Women and Child Welfare Minister
-
ఏపీ స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రిగా ఉషాశ్రీచరణ్ బాధ్యతలు
-
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉషశ్రీ చరణ్
సాక్షి, తాడేపల్లి: స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉషశ్రీ చరణ్ బాధ్యతలు చేపట్టారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఉషశ్రీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. 'ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ మహిళనైన నాకు మంత్రిగా అవకాశం కల్పించారు. ఎలాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా నాకు అవకాశం ఇచ్చారు. బీసీలను అందరూ ఓట్ బ్యాంక్‌లా చూశారు. కానీ సీఎం జగన్ బీసీ, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మహిళా పక్షపాత ప్రభుత్వంలో మంత్రిగా ఉండటం అదృష్టం. మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం. మహిళలకు ఇప్పటి వరకూ ఎవరూ ఇవ్వని 50శాతం రిజర్వేషన్ ఇచ్చారు. మహిళలకు ఇళ్లు, ఇళ్ల పట్టాలు, ఆసరా, చేయూత ఇచ్చారు. మహిళా సాధికారత అన్ని రంగాల్లోనూ సాధించేలా సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారు' అని మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. చదవండి: (హోం శాఖ అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నా: తానేటి వనిత) -
బాల్య వివాహాలకు అడ్డుకట్ట
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో బాల్య వివాహాలను ప్రభుత్వం అరికడుతోందని, ఒక్క అనంతపురం జిల్లాలోనే గత మూడేళ్లలో 1,508 బాల్య వివాçహాలను అడ్డుకుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత శాసన మండలిలో చెప్పారు. అనంతపురం జిల్లాలో బాల్య వివాహాలపై ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఎన్జీవోల సహాయంతో అనంతపురం జిల్లాలో 2019 ప్రారంభంలో 396, 2019 చివరలో 337, 2020లో 357, 2021లో 418 బాల్య వివాçహాలను అడ్డుకున్నట్లు తెలిపారు. బాల్య వివాహల నియంత్రణకు వైఎస్సార్ కిశోరి వికాసం కార్యక్రమం ద్వారా అనంతపురం జిల్లాలోని అన్ని పాఠశాలలు, జానియర్ కాలేజీల్లో అవగాహన తరగతులు నిర్వహించినట్టు తెలిపారు. సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శు (మహిళా పోలీసు)ల సేవలను కూడా ఉపయోగించుకుంటున్నట్టు తెలిపారు. కొత్తగా 17 స్టేడియాలు రాష్ట్రంలో కొత్తగా 17 స్టేడియాల అభివృద్ధికి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో తెలిపారు. కొన్ని పూర్తిగా ప్రభుత్వ నిధులతో, మరికొన్ని పీపీపీ విధానంలో, ఇంకొన్ని ఖేల్ ఇండియా పథకంలో చేపడుతున్నట్టు వివరించారు. 1.53 లక్షల క్వింటాళ్ల బియ్యం స్వాధీనం ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేసి 2019 నుంచి ఇప్పటి వరకు 1.53 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు మంత్రి కొడాలి నాని శాసన మండలిలో చెప్పారు. -
‘నీ రాకతో అన్నీ మారిపోయాయి’
‘పదహారేళ్ల క్రితం నువ్వు మా జీవితాల్లోకి వచ్చావు. నీ రాకతో అన్నీ మారిపోయాయి. నువ్వున్న చోట ఆనందం వెల్లివిరుస్తూనే ఉంటుంది. నీ చేతి మృదువైన స్పర్శ నాలో శాంతిని, స్థిరత్వాన్ని నింపింది. నేటికీ నాకు ఎదురయ్యే ప్రతీ సవాలులో అది తోడుగా నిలుస్తోంది. నువ్వు మా జీవితాల్లో ఉండటం వల్ల ఆ దేవుడి ఆశీర్వాదాలు మాకు లభించాయని ఎంతో సంతోషిస్తాం. హ్యాపీ బర్త్‌డే జో. కలకాలం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా’ అంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన గారాల పట్టి జోయిష్ ఇరానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో స్మృతి పోస్ట్ చేసిన జోయిష్ చిన్ననాటి ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా జోయిష్ ఇరానీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సందేశాత్మక పోస్టులతో పాటు ఫన్నీ కామెంట్స్‌తో అభిమానులను అలరించే స్మృతి..ట్రోలర్స్‌కు సైతం ఘాటుగానే సమాధానమిస్తారు. గతంలో తన కూతురిని కించపరిచేలా మాట్లాడిన ఆమె క్లాస్‌మేట్‌కు స్మృతి ఇన్‌స్టా వేదికగా బుద్ధిచెప్పారు. తాను పోస్ట్ చేసిన సెల్ఫీలో జోయిష్ ఇరానీ అందవిహీనంగా ఉందన్న అతడి కామెంట్లపై స్పందించిన స్మృతి.. ‘నా కుమార్తె క్రీడాకారిణి, లిమ్కా బుక్స్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించింది. కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించింది. ప్రపంచ చాంపియన్ షిప్లో రెండుసార్లు కాంస్య పతకం గెలుచుకుంది. తను నా ముద్దుల తనయ. ఎంతో అందంగా ఉంటుంది. తనను ఎంతగా ఏడిపిస్తారో ఏడిపించండి. మీ అందరికి దీటుగా బదులిస్తుంది. ఎందుకంటే తను జోయిష్ ఇరానీ. ఆమె తల్లినైనందుకు గర్విస్తున్నా’ అని కూతురి విజయాలను ప్రస్తావించి అతడి నోరు మూయించారు. View this post on Instagram You came into our lives 16 years ago and things have not been the same since. Laughter follows you wherever you go, you bring peace and stability with your gentle touch every time a challenge springs up. We @iamzfi @shanelleirani @zohrirani_24 are blessed to have you in our lives. Happy Birthday Zoe ❤️❤️love you lots 😍😍😍😍😍😘 A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Sep 22, 2019 at 11:27am PDT -
‘విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించను’
సాక్షి, అమరావతి : విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించనని మహిళా, శిశు సంక్షేమ మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి మహిళా శిశు సంక్షేమశాఖ సమీక్షా సమావేశం బుధవారంఅమరావతిలో నిర్వహించారు. ఈ కార్యక్రామంలో మంత్రి తానేటి వనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. విధుల్లో ఉన్న ఉద్యోగులు నిర్లిప్తత విడాలని, అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని పిలుపునిచ్చారు. అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తేనే ఫలితాలలు సాధించగలుగుతామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవినీతి రహిత సమాజానికి కృషిచేస్తున్నారని, దానికనుగుణంగా ప్రతి ఒక్కరూ స్నేహపూర్వక విధానంలో పనిచేయాలని కోరారు. మనది అనే భావన ఉంటేనే ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలమని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించాలని, దానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సి ఉందని తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలో కొంతమంది సిబ్బందిని క్షేత్రస్థాయిలోని వారు వేధింపులకు గురిచేస్తున్నారనే వార్త తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వాటిని ఉపేక్షింనని హెచ్చరించారు. మహిళలు, శిశు సంక్షేమం కోసం కృషిచేసే శాఖ తమదని పునరుద్ఘాటించారు. సమన్వయ శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. పౌష్టికాహార ఆవశ్యకతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. పనితీరు మెరుగుపర్చుకొని, పలువురికి ఆదర్శంగా నిలవాలని తెలిపారు. -
‘నువ్వు అదృష్టవంతురాలివి అమ్మా’
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని, భావోద్వేగాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటారు. పార్లమెంట్ సమావేశాల నిమిత్తం ఢిల్లీలో ఉన్న ఆమె కుటుంబాన్ని మిస్సవుతున్నానంటూ ఇటీవల ఉద్వేగానికి లోనయ్యారు. ఇక శనివారం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన కుమారుడు జోహర్ ఇరానీ ఫొటో పోస్ట్ చేసిన స్మృతి హర్ట్ ఎమోజీని జత చేశారు. ఇందుకు స్పందనగా...‘ ఆ చిన్నారి ఎంత క్యూట్‌గా ఉన్నాడో కదా!!! నువ్వు ఎంతో అదృష్టవంతురాలివైన తల్లివి’ అంటూ జోహర్ కామెంట్ చేశాడు. ‘ అవునా ఇంటికి రా.. ఎవరు ఎంత క్యూట్‌గా ఉంటారో చెప్తా’ అంటూ స్మృతి బదులిచ్చారు. తల్లీకొడుకులకు సంబంధించిన ఈ సంభాషణ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘మీరిద్దరు అదృష్టవంతులే’ అని కొంతమంది అంటుంటే... ‘తను క్యూట్‌గానే ఉన్నాడు. అదే విధంగా మీలా ఇన్స్పైరింగ్గా కూడా ఉండాలి’ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రధాన నరేంద్ర మోదీ కేబినెట్లో రెండుసార్లు చోటు దక్కించుకున్న స్మృతి...ప్రస్తుతం స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని మట్టికరిపించిన ఆమె.. మోదీ 2.0 కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు. View this post on Instagram @zohrirani_21 ❤️🥰 A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Jun 28, 2019 at 10:45pm PDT -
‘నా కూతురి కోసమే చేశా.. కానీ అది తప్పు’
-
‘నా కూతురి కోసమే చేశా.. కానీ అది తప్పు’
‘ నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న నా కూతురి సెల్ఫీని నిన్న డెలీట్ చేశాను. ఆ ఫొటోలో తను అందంగా లేదంటూ ఆమె క్లాస్మేట్ ఏ ఝా అనే విద్యార్థి కామెంట్ చేశాడట. అంతేగాక స్నేహితులందరితో కలిసి ఏడిపించాడట. అందుకే తన కన్నీళ్లు చూడలేక నేను ఆ ఫొటోను డెలీట్ చేశాను. కానీ అది తప్పని తర్వాత తెలుసుకున్నాను. నేను అలా చేయడం వల్ల అతడు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది. అందుకే మళ్లీ అదే ఫొటో పోస్ట్ చేస్తున్నా’ అంటూ కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో షేర్ చేసిన స్టోరీ నెటిజన్లను ఆకర్షిస్తోంది. తన కూతురిని అవమానించిన వ్యక్తికి స్మృతి కౌంటర్ ఇచ్చిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. తనే జోయిష్ ఇరానీ.. స్మృతి కూతురు అందవిహీనంగా ఉందంటూ తోటి విద్యార్థులు చేసిన కామెంట్లపై స్పందించిన ఆమె..‘ చూడండి మిస్టర్ ఝా.. నా కుమార్తె క్రీడాకారిణి, లిమ్కా బుక్స్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించింది. కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించింది. ప్రపంచ చాంపియన్ షిప్లో రెండుసార్లు కాంస్య పతకం గెలుచుకుంది. తను నా ముద్దుల తనయ. ఎంతో అందంగా ఉంటుంది. తనను ఎంతగా ఏడిపిస్తారో ఏడిపించండి. మీ అందరికి దీటుగా బదులిస్తుంది. ఎందుకంటే తను జోయిష్ ఇరానీ. ఆమె తల్లినైనందుకు గర్విస్తున్నా’ అని తన కూతురి విజయాలను ప్రస్తావిస్తూ ఆకతాయిలకు బుద్ధి చెప్పారు. అదే విధంగా ఇలాంటి చెత్త కామెంట్లకు ఎవరూ భయపడవద్దని, అందం అంటే రూపం మాత్రమే కాదని పేర్కొన్నారు. వ్యక్తిత్వంతోనే జీవితంలో అన్నింటినీ సాధించగలుగుతామని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో..‘తను మీ కూతురు. అందంగా ఉండటమే కాదు ధైర్యవంతురాలిగా కూడా ఉండాలి’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram I deleted my daughter’s selfie yesterday coz an idiot bully in her class ,A Jha ,mocks her for her looks & tells his pals in class to humiliate her for how she looks in her mother’s insta post. My child pleaded with me ‘ Ma please delete it, they are making fun of me’. I obliged coz I could not stand her tears. Then I realised my act just supported the bully . So Mr Jha , my daughter is an accomplished sports person, record holder in Limca Books, 2 Nd Dan black belt in Karate, at the World Championships has been awarded bronze medal twice; is a loving daughter and yes damn beautiful. Bully her all you want , she will fight back. She is Zoish Irani and I’m proud to be her Mom ❤️ A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Jun 21, 2019 at 1:22am PDT -
‘నా కులం అభివృద్ధే నాకు ముఖ్యం’
జైపూర్ : రాజస్తాన్‌లో నూతన ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా పూర్తికాలేదు. కానీ ఈ లోపే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పనులు ప్రారంభించారు మంత్రులు. రాజస్తాన్ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేస్తోన్న మమతా భూపేష్ ‘నా కులం అభివృద్ధే నాకు ముఖ్యం.. మిగతావన్ని తర్వత’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్వార్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మమతా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నా సామాజిక వర్గ ప్రజల అభివృద్ధే నా ప్రథమ బాధ్యత. ముందు నా కులం ప్రజల అభివృద్ధి గురించి ఆలోచిస్తా.. ఆ తరువాతే మిగతా వారి గురించి పని చేస్తా’ అంటూ ప్రసంగించారు. మమతా చేసిన వ్యాఖ్యలు కొత్త ప్రభుత్వాన్ని ఇరుకున పడేశాయి. -
మహిళా పారిశ్రామికవేత్తలేరీ?
న్యూఢిల్లీ: ఆర్థికంగా వేగంగా దూసుకెళుతున్నా... మహిళా పారిశ్రామిక వేత్తల పురోగతి విషయంలో భారత్ అడుగులు వెనకే ఉన్నాయి. 57 దేశాలతో కూడిన జాబితాలో భారత్ కింది నుంచి ఐదు స్థానాలపైన 52 దగ్గర నిలవడమే ఇందుకు నిదర్శనం. గతేడాది కూడా భారత్ స్థానం ఇదే. ‘మాస్టర్‌కార్డ్ ఇండెక్స్ ఆఫ్ ఉమెన్ ఎంట్రపెన్యూర్స్’ పేరిట విడుదలైన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. భారత్ కేవలం ఇరాన్, సౌదీ అరేబియా, అల్జీరియా, ఈజిప్ట్, బంగ్లాదేశ్ కంటే మాత్రమే ముందుంది. మహిళా వ్యాపార నాయకత్వానికి భారత్‌లో పరిస్థితులు సానుకూలంగా లేవని నివేదిక స్పష్టం చేసింది. సాంస్కృతిక వివక్ష వల్ల భారత్‌లో వ్యాపారానికి మహిళలు అంతగా ఆసక్తి చూపడంలేదని తెలిపింది. ఇక మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం పరంగా న్యూజిలాండ్ అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా ఈ సూచీలో 4వ స్థానంలో, చైనా 29వ స్థానంలో ఉంది. అనుకూల వాతావరణం కల్పించాలి లాభదాయకత లేకపోవటమో, ఆర్థిక వనరుల కొరత వంటి కారణాల వల్ల భారతీయ మహిళలు వారి వ్యాపారాలను వృద్ధి చేయటంపై దృష్టి పెట్టకపోవటం, వ్యాపారాలను నిలిపివేయడం వంటివి చేస్తున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ‘‘అమెరికా, చైనా విజయాలను తెలుసుకోవడం ద్వారా భారత్‌లోనూ మహిళలు మరింతగా పాలుపంచుకునేందుకు, ఉన్నత విద్య, ఆర్థిక సేవలు పొందేందుకు తగిన వాతావరణం కల్పించాలి’’ అని నివేదిక సూచించింది. మేధోపరమైన ఆస్తుల పరంగా భారత్ స్థానం 55కాగా, వ్యాపార పరంగా రాణించేందుకు ప్రోత్సాహం విషయంలో 47వ స్థానంలో ఉంది. -
అవినీతిరహిత పాలన అందిస్తాం
మంత్రి పీతల సుజాత ఏలూరు : అవినీతికి తావులేని పారదర్శక పాలనను రాష్ట్ర ప్రజలకు అందిస్తామని రాష్ట్ర గనులు, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఏలూరు ఎంపీ మాగంటిబాబుతో కలిసి శనివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అవినీతిరహిత పాలనే తమ లక్ష్యమని, ఆ దిశగా అన్ని రంగాల్లో అభివృద్ధికి అధికారులను, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని ముందుకు వెళతామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. తన శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పరిశీలించి పరిష్కరిస్తానని చెప్పారు. జిల్లాలో వనరులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందించడమే తమ లక్ష్యమన్నారు. ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈ ప్రాంతంలో పాస్‌పోర్టు కార్యాలయం త్వరలో ప్రారంభినున్నట్టు చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో గుంటూరు, విజయవాడ, ఏలూరు నగరాలను హైటెక్ సిటీలుగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రాష్ట్ర, జిల్లా అభివృద్ధికి కష్టపడి పనిచేస్తామని చెప్పారు. అంతకుముందు ఎన్టీఆర్, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుజాతకు పట్టుచీర పెట్టిన మాగంటి సతీమణి స్థానిక ఆర్ఆర్పేటలో ఎంపీ మాగంటి ఇంటికి శనివారం ఉదయం చేరుకున్న మంత్రి సుజాతకు మాగంటి బాబు సతీమణి పద్మవల్లీ దేవి ఘనస్వాగతం పలికారు. మంత్రికి పద్మవల్లీదేవీ పట్టుచీర పెట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సుజాత మాగంటి బాబు దంపతులకు పాదాభివందనం చేశారు.