న్యూఢిల్లీ: ఆర్థికంగా వేగంగా దూసుకెళుతున్నా... మహిళా పారిశ్రామిక వేత్తల పురోగతి విషయంలో భారత్ అడుగులు వెనకే ఉన్నాయి. 57 దేశాలతో కూడిన జాబితాలో భారత్ కింది నుంచి ఐదు స్థానాలపైన 52 దగ్గర నిలవడమే ఇందుకు నిదర్శనం. గతేడాది కూడా భారత్ స్థానం ఇదే. ‘మాస్టర్‌కార్డ్ ఇండెక్స్ ఆఫ్ ఉమెన్ ఎంట్రపెన్యూర్స్’ పేరిట విడుదలైన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. భారత్ కేవలం ఇరాన్, సౌదీ అరేబియా, అల్జీరియా, ఈజిప్ట్, బంగ్లాదేశ్ కంటే మాత్రమే ముందుంది. మహిళా వ్యాపార నాయకత్వానికి భారత్‌లో పరిస్థితులు సానుకూలంగా లేవని నివేదిక స్పష్టం చేసింది. సాంస్కృతిక వివక్ష వల్ల భారత్‌లో వ్యాపారానికి మహిళలు అంతగా ఆసక్తి చూపడంలేదని తెలిపింది. ఇక మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం పరంగా న్యూజిలాండ్ అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా ఈ సూచీలో 4వ స్థానంలో, చైనా 29వ స్థానంలో ఉంది.
అనుకూల వాతావరణం కల్పించాలి
లాభదాయకత లేకపోవటమో, ఆర్థిక వనరుల కొరత వంటి కారణాల వల్ల భారతీయ మహిళలు వారి వ్యాపారాలను వృద్ధి చేయటంపై దృష్టి పెట్టకపోవటం, వ్యాపారాలను నిలిపివేయడం వంటివి చేస్తున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ‘‘అమెరికా, చైనా విజయాలను తెలుసుకోవడం ద్వారా భారత్‌లోనూ మహిళలు మరింతగా పాలుపంచుకునేందుకు, ఉన్నత విద్య, ఆర్థిక సేవలు పొందేందుకు తగిన వాతావరణం కల్పించాలి’’ అని నివేదిక సూచించింది. మేధోపరమైన ఆస్తుల పరంగా భారత్ స్థానం 55కాగా, వ్యాపార పరంగా రాణించేందుకు ప్రోత్సాహం విషయంలో 47వ స్థానంలో ఉంది.
మహిళా పారిశ్రామికవేత్తలేరీ?
Published Thu, Mar 8 2018 12:30 AM | Last Updated on Thu, Mar 8 2018 12:30 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment