
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో బాల్య వివాహాలను ప్రభుత్వం అరికడుతోందని, ఒక్క అనంతపురం జిల్లాలోనే గత మూడేళ్లలో 1,508 బాల్య వివాçహాలను అడ్డుకుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత శాసన మండలిలో చెప్పారు. అనంతపురం జిల్లాలో బాల్య వివాహాలపై ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఎన్జీవోల సహాయంతో అనంతపురం జిల్లాలో 2019 ప్రారంభంలో 396, 2019 చివరలో 337, 2020లో 357, 2021లో 418 బాల్య వివాçహాలను అడ్డుకున్నట్లు తెలిపారు. బాల్య వివాహల నియంత్రణకు వైఎస్సార్ కిశోరి వికాసం కార్యక్రమం ద్వారా అనంతపురం జిల్లాలోని అన్ని పాఠశాలలు, జానియర్ కాలేజీల్లో అవగాహన తరగతులు నిర్వహించినట్టు తెలిపారు. సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శు (మహిళా పోలీసు)ల సేవలను కూడా ఉపయోగించుకుంటున్నట్టు తెలిపారు.
కొత్తగా 17 స్టేడియాలు
రాష్ట్రంలో కొత్తగా 17 స్టేడియాల అభివృద్ధికి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో తెలిపారు. కొన్ని పూర్తిగా ప్రభుత్వ నిధులతో, మరికొన్ని పీపీపీ విధానంలో, ఇంకొన్ని ఖేల్ ఇండియా పథకంలో చేపడుతున్నట్టు వివరించారు.
1.53 లక్షల క్వింటాళ్ల బియ్యం స్వాధీనం
ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేసి 2019 నుంచి ఇప్పటి వరకు 1.53 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు మంత్రి కొడాలి నాని శాసన మండలిలో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment